
📌 Key Points
- విజయ్ దళపతి ‘జననాయగన్’ ట్రైలర్ జనవరి 3న విడుదలైంది.
- ఈ ట్రైలర్ ‘భగవంత్ కేసరి’ సినిమాకి రీమేక్ అంటూ అభిమానుల మధ్య చర్చ జరిగింది.
- దీని ఫలితంగా ‘భగవంత్ కేసరి’ అమెజాన్ ప్రైమ్‌లో ఓవర్ నైట్‌లో టాప్ ట్రెండింగ్‌లోకి వచ్చింది.
- దర్శకుడు వినోద్ గతంలో రీమేక్‌ను నిరాకరించినప్పటికీ, ట్రైలర్ తర్వాత అనుమానాలు బలపడ్డాయి.
విజయ్ దళపతి నటించిన ‘జననాయగన్’ ట్రైలర్ ఇటీవల విడుదలైంది. ఈ ట్రైలర్ బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ రీమేక్ అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుండటంతో, ‘భగవంత్ కేసరి’ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో రికార్డు స్థాయిలో ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ ఊహించని పరిణామం టాలీవుడ్‌లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
జననాయగన్: విడుదల వివరాలు, ట్రైలర్ సందడి
Tollywood:ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి (Vijay thalapathy) చివరి సినిమాగా వస్తున్న చిత్రం జన నాయగన్. ఈ చిత్రాన్ని తెలుగులో జననాయకుడు, హిందీలో జననేత అంటూ డబ్బింగ్ వెర్షన్లలో కూడా రిలీజ్ చేయనున్నారు.. ప్రముఖ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ హెచ్.వినోద్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్గా నటిస్తోంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ సినిమా నుండి జనవరి 3న ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమా 90% బాలకృష్ణ (Balakrishna ) భగవంత్ కేసరి సినిమాకి రీమేక్ అంటూ అభిమానులు కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.
అలా ఈ ట్రైలర్ రిలీజ్ అయ్యిందో లేదో ఈ జననాయగన్4 ట్రైలర్ దెబ్బకు బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమా ఓటీటీలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. అసలు విషయంలోకి వెళ్తే.. 2023లో నందమూరి బాలకృష్ణ హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన చిత్రం భగవంత్ కేసరి. అప్పట్లో మంచి విజయం అందుకున్న ఈ సినిమా ఆ తర్వాత ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫారం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కూడా అయింది. ఇకపోతే ఈ సినిమా విడుదలై మూడేళ్లు అవుతున్నా.. ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే జననాయగన్ ట్రైలర్ రిలీజ్ అయ్యిందో ఒక్కసారిగా ఈ సినిమా ట్రెండింగ్ లోకి వచ్చేసింది. జనాలు ఎగబడి మరీ ఈ సినిమాను ప్రైమ్ వీడియోలో చూస్తున్నారు.
భగవంత్ కేసరి: ఓటీటీలో ఊహించని ట్రెండ్
రీమేక్ వార్తలు.. దర్శకుడి వివరణ
తాజాగా విజయ్ నటిస్తున్న జననాయగన్ భగవంత్ కేసరికి రీమేక్ గా వస్తోందని గత కొద్ది రోజులుగా వార్తలు నడుస్తున్నాయి. దీనికి తోడు 4.5 కోట్లు పెట్టి మరీ భగవంత్ కేసరి రీమేక్ హక్కులను జననాయగన్ నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాకి జననాయగన్ ఏమాత్రం రీమేక్ కాదని డైరెక్టర్ వినోద్ ఇటీవల సింగపూర్ లో జరిగిన ఆడియో లాంచ్ ఈవెంట్ లో వెల్లడించారు కానీ ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఈ సినిమా రీమేక్ అని స్పష్టం అవుతోంది. అందుకే ఇప్పుడు ఈ భగవంత్ కేసరి సినిమా ఓవర్ నైట్ లోనే ట్రెండింగ్ లోకి వచ్చి నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. మొత్తానికైతే జననాయగన్ దెబ్బకు బాలకృష్ణ సినిమా ట్రెండింగ్ లోకి రావడం గమనార్హం.
మొత్తానికి, ‘జననాయగన్’ ట్రైలర్ విడుదల బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ సినిమాకు ఊహించని పబ్లిసిటీ తెచ్చిపెట్టింది. రీమేక్ వివాదం ఆ సినిమాను మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంతో, ఓటీటీలో సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది.


