|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Virgin Boys: రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఆకట్టుకుంటోన్న ‘వర్జిన్ బాయ్స్’ టీజర్!

Published: 14-05-2025, 8:32 AM
Virgin Boys: రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఆకట్టుకుంటోన్న ‘వర్జిన్ బాయ్స్’ టీజర్!

గీతా నంద్ మరియు మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘వర్జిన్ బాయ్స్’ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది. దయానంద్ దర్శకత్వంలో రాజా దరపునేని నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం యూత్‌ఫుల్ వైబ్స్‌తో ఆకట్టుకుంటుంది.

Key Points

1

గీతా నంద్, మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో నటించారు.

2

రొమాంటిక్ కామెడీ చిత్రంగా రూపొందింది.

4

యువతను ఆకట్టుకునేలా టీజర్ రూపొందించబడింది.

‘వర్జిన్ బాయ్స్’ టీజర్ విడుదల

గీతా నంద్, మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘వర్జిన్ బాయ్స్’ (Virgin Boys). రాజ్‌గురు ఫిల్మ్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న ఈ రొమాంటిక్ కామెడీ (Romantic comedy) చిత్రానికి దయానంద్ దర్శకత్వం వహిస్తుండగా.. రాజా దరపునేని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి టీజర్ రిలీజ్ చేశారు చిత్ర బృందం. యూత్‌ఫుల్ వైబ్స్, కలర్‌ఫుల్ విజువల్స్‌తో ఆకట్టుకుంటోన్న ఈ టీజర్‌లో గీతానంద్, మిత్రా శర్మ కెమిస్ట్రీ (Chemistry) ప్రేక్షకులకు మెస్మరైజ్ చేస్తుంది. హాస్యం, రొమాన్స్, ఎమోషన్స్‌తో కూడిన ఈ కథ, ఆధునిక రిలేషన్‌షిప్స్‌ను తమదైన స్టైల్‌లో చూపించనుందని తెలుస్తోంది.

బిగ్ బాస్ ఫేమ్ శ్రీహన్ క్యారెక్టర్ అండ్ కామెడీ టైమింగ్‌తో పాటు.. టీజర్‌లోని డైలాగ్స్, సీన్స్ ఫన్ ఎలిమెంట్స్ యూత్‌ను ఎట్రాక్ట్ చేస్తున్నాయి. మొత్తంగా ఈ సమ్మర్‌కి ‘వర్జిన్ బాయ్స్’ యూత్‌ను థియేటర్స్‌కు రప్పించే ఫుల్ ఎంటర్‌టైనర్‌గా కనిపిస్తోందని చిత్ర బృందం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అలాగే ఈ సినిమా కచ్చితంగా యూత్‌కి బాగా కనెక్ట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత రాజా దరపునేని మాట్లాడుతూ.. ‘ఈ సినిమా యూత్‌కి కనెక్ట్ అయ్యేలా తీర్చిదిద్దాం. గతంలో ఎన్నో మంచి యూత్‌ఫుల్ ఎంటర్టైనర్‌లు వచ్చాయి. కానీ వాటిని మైమరిపించేలా ఈ సినిమా ఉంటుంది. రొటీన్‌కి భిన్నంగా ఈ సినిమా ఉంటుంది. కచ్చితంగా యూత్‌కి బాగా కనెక్ట్ అవుతోంది’ అంటూ చెప్పుకొచ్చారు.

యువతను ఆకట్టుకునే కథాంశం

గీతా నంద్, మిత్రా శర్మ కెమిస్ట్రీ

మొత్తంమీద, ‘వర్జిన్ బాయ్స్’ టీజర్ యువతను థియేటర్లకు ఆకర్షించేలా ఉంది. రొమాన్స్, హాస్యం, ఎమోషన్స్ కలయికతో ఈ సినిమా సక్సెస్ అవుతుందని మేకర్స్ ఆశిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.