
కోలీవుడ్ నటుడు విశాల్ పెళ్లి విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కబాలి సినిమా హీరోయిన్ సాయి ధన్సికతో ఆయన పెళ్లి జరగబోతుందని వార్తలు వస్తున్నాయి. నటుడు త్వరలోనే పెళ్లి చేసుకుంటానని ప్రకటించాడు.
Key Points
విశాల్ మరియు సాయి ధన్సిక ప్రేమలో ఉన్నారని వార్తలు
నడిగర్ సంఘం భవనం నిర్మాణం పూర్తయిన తర్వాత విశాల్ పెళ్లి
విశాల్ గతంలో అనీషాతో నిశ్చితార్థం రద్దు
విశాల్ త్వరలోనే పెళ్లి చేసుకుంటానని ప్రకటన
విశాల్ – సాయి ధన్సిక ప్రేమ వ్యవహారం
కోలీవుడ్ స్టార్, నిర్మాత ధనుశ్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. గతంలోనే పలు సార్లు ఆయన పెళ్లిపై వార్లలొచ్చినా ఇప్పటివరకు అలాంటిదేం జరగలేదు. నడిగర్ సంఘం భవనం నిర్మించాకే తన పెళ్లి ఉంటుందని గతంలో విశాల్ ప్రకటించారు. అయినప్పటికీ ఆయన పెళ్లి చర్చ ఆగడం లేదు. తాజాగా ఆయన పెళ్లిపై కోలీవుడ్‌లో మరోసారి చర్చ మొదలైంది.
నడిగర్ సంఘం భవనం మరియు విశాల్ పెళ్లి
విశాల్ త్వరలోనే హీరోయిన్ సాయి ధన్సికను పెళ్లాడబోతున్నారంటూ టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని కోలీవుడ్‌లో వార్త చక్కర్లు కొడుతోంది. అయితే తమపై వస్తున్న వార్తలపై ఇప్పటి వరకు సాయిధన్సిక కానీ.. విశాల్ కానీ స్పందిచంలేదు. దీనిపై వీరిద్దరిలో ఎవరో ఒకరూ స్పందిస్తేనే క్లారిటీ వస్తుంది. కాగా.. కోలీవుడ్‌కు చెందిన సాయి ధన్సిక తెలుగులో తెరకెక్కిన షికారు, అంతిమ తీర్పు, దక్షిణ వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా నటించారు.
గత వివాహ ప్రయత్నం మరియు తాజా అప్డేట్స్
ఇటీవల నడిగర్ సంఘం బిల్డింగ్ నిర్మాణం కూడా పూర్తయింది. ఇటీవల ఓ సమావేశంలో తన పెళ్లి గురించి మాట్లాడారు. త్వరలోనే పెళ్లి చేసుకుంటానని తెలిపారు. నా ప్రేమ వివాహమే.. త్వరలులోనే మరిన్ని వివరా తెలియజేస్తానని తెలిపారు. కాగా.. విశాల్‌కు గతంలో అనీషా అనే నటితో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. కానీ ఆ తర్వాత వీరి నిశ్చితార్థం క్యాన్సిల్ అియంది.
విశాల్ తన పెళ్లి గురించి త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడిస్తానని తెలిపారు. సాయి ధన్సిక స్పందన కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ విషయంపై స్పష్టత రావడానికి ఇంకా కొంత సమయం పట్టవచ్చు.


