|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విశాల్ కి షాక్ ఇచ్చిన హైకోర్టు.. వడ్డీతో కలిపి అన్ని కోట్లు కట్టాల్సిందే..

Published: 05-06-2025, 10:55 AM
విశాల్ కి షాక్ ఇచ్చిన హైకోర్టు.. వడ్డీతో కలిపి అన్ని కోట్లు కట్టాల్సిందే..

తమిళ హీరో విశాల్‌కు లైకా ప్రొడక్షన్స్‌తో ఉన్న ఆర్థిక వివాదం హైకోర్టులో తీవ్ర రూపం దాల్చింది. లైకాకు కోట్ల రూపాయలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

Key Points

1

విశాల్ లైకా ప్రొడక్షన్స్ నుండి 21.29 కోట్లు అప్పు తీసుకున్నాడు.

2

అగ్రిమెంట్ ప్రకారం, అప్పు తీర్చే వరకు సినిమా హక్కులు లైకాకే చెందుతాయి.

4

హైకోర్టు విశాల్‌ను 21.29 కోట్లతో పాటు 30% వడ్డీ, కోర్టు ఖర్చులు చెల్లించాలని ఆదేశించింది.

లైకా ప్రొడక్షన్స్ తో వివాదం

Vishal : హీరో విశాల్, తమిళ అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ హౌస్ కి ఎప్పట్నుంచో డబ్బు లావాదేవీల విషయంలో విబేధాలు ఉన్న సంగతి తెలిసిందే. గతంలో విశాల్ లైకా అనుబంధ సంస్థ దగ్గర ఒక సినిమా నిర్మాణం కోసం 21.29 కోట్లు అప్పు తీసుకున్నాడు. ఆ అప్పు తిరిగి ఇచ్చేదాకా విశాల్ నిర్మించే ఆ సినిమా హక్కులు మావే అని లైకా అగ్రిమెంట్ రాయించుకుంది. కానీ విశాల్ ఆ అగ్రిమెంట్ బ్రేక్ చేసి ఒక సినిమా హక్కులు వేరే సంస్థకు ఇచ్చాడు.

హైకోర్టు తీర్పు

విశాల్ స్పందన

అప్పట్నుంచి విశాల్ – లైకా కేసు కోర్టులో నడుస్తుంది. గతంలో విశాల్ వెంటనే 15 కోట్లు కట్టాలని కూడా హైకోర్టు నోటీసులు ఇచ్చింది. కానీ విశాల్ డబ్బులు లేవంటూ కట్టలేదు. ఆ కేసు రెండేళ్లుగా సాగగా తాజాగా మద్రాస్ హైకోర్టు విశాల్ లైకా ప్రొడక్షన్ వాళ్లకు తీసుకున్న 21.29 కోట్లతో పాటు 30 శాతం వడ్డీ, ఆ నిర్మాణ సంస్థకు అయిన కోర్టు ఖర్చులు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. మరి దీనిపై విశాల్ స్పందిస్తాడా, డబ్బులు కడతాడా చూడాలి.

హైకోర్టు తీర్పుతో విశాల్‌పై భారీ ఆర్థిక భారం పడింది. ఇప్పుడు ఆయన ఈ తీర్పును ఎలా ఎదుర్కొంటారో, డబ్బులు చెల్లిస్తారో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.