
📌 Key Points
- శ్రీ విష్ణు నటించిన ‘విష్ణు విన్యాసం’ మూవీ టీజర్ విడుదల.
- టీజర్లో లిప్ కిస్ సన్నివేశాలు, కామెడీ డైలాగులు హైలైట్.
- నయన్ సారిక హీరోయిన్ గా, మారుతి రావు దర్శకత్వం వహించారు.
- ఫిబ్రవరి 28న విడుదల కానున్న ‘విష్ణు విన్యాసం’.
శ్రీ విష్ణు నటించిన ‘విష్ణు విన్యాసం’ సినిమా టీజర్ విడుదలైంది. ఈ టీజర్ లో కామెడీ సన్నివేశాలతో పాటు లిప్ కిస్ సీన్లు కూడా ఉండటం విశేషం. ఈ సినిమా ఫిబ్రవరి 28న విడుదల కానుంది.
విష్ణు విన్యాసం టీజర్ విడుదల
Vishnu Vinyasam: టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు ఇటీవల బ్యాక్ టు బ్యాక్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ మంచిగా సక్సెస్ అందుకుంటున్నారు. ఈ సినిమాలన్నీ కామెడీ నేపథ్యంలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాలకు కూడా మంచి ఆదరణ లభిస్తుంది. ఇక త్వరలోనే శ్రీ విష్ణు విష్ణు విన్యాసం (Vishnu Vinyasam)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా టీజర్ వీడియోని విడుదల చేశారు. ఈ టీజర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ టీజర్ చూస్తుంటే సినిమా మొత్తం కామెడీ ఎంటర్టైనర్ గాని ఉండబోతుందని చెప్పాలి. ఇందులో శ్రీ విష్ణు వాస్తు పిచ్చి ఉన్న వ్యక్తిగా కనిపించబోతున్నట్లు చూపించారు. ఇక ఈ టీజర్ వీడియోలో విష్ణు లిప్ కిస్ సన్నివేశాలు హైలైట్ గా నిలిచాయి. అలాగే హీరోయిన్ తో విష్ణు మాట్లాడుతూ ఇంతమంది ఉండగా నన్నే ఎందుకు లవ్ చేసావ్ అంటూ అడగడంతో నువ్వు హీరో మెటీరియల్ విష్ణు చెప్పే డైలాగులు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.. మొత్తానికి మంచి కామెడీ ఎంటర్టైనర్ సినిమాతో శ్రీ విష్ణు మరోసారి విష్ణు విన్యాసం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
టీజర్లో హైలైట్ గా నిలిచిన ముద్దు సీన్లు
ఇక ఈ సినిమాలో శ్రీ విష్ణు జోడిగా నయన్ సారిక జంటగా నటించారు.శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుమంత్ నాయుడు నిర్మాణంలో మారుతి రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 28 వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. మరి ఈ సినిమా ద్వారా శ్రీ విష్ణు ఎలాంటి సక్సెస్ అందుకుంటారనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాతో పాటు శ్రీ విష్ణు మృత్యుంజయ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఇక ఈ సినిమా కూడా షూటింగ్ పనులను పూర్తి చేసుకుంది. అయితే ఈ రెండు సినిమాలు ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వస్తాయని చిత్ర బృందం భావించినప్పటికీ ఇందులో నిజం లేదని తెలుస్తోంది.
ఇక ఇప్పటికే విష్ణు విన్యాసం అనే సినిమా నుంచి ఒక పాటను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ పాట కూడా సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసింది. తాజాగా విడుదల చేసిన టీజర్ చూస్తుంటే విష్ణు ఈ సినిమా ద్వారా మరో సక్సెస్ అందుకోబోతున్నారని తెలుస్తోంది . ఇక ఇటీవల శ్రీ విష్ణు శర్వానంద్ హీరోగా నటించిన నారీ నారీ నడుమ మురారి సినిమాలో క్యామియో పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఇందులో ఈయన సంయుక్త మీనన్ భర్తగా నటించి సందడి చేశారు.
ఫిబ్రవరి 28న సినిమా విడుదల
మొత్తానికి శ్రీ విష్ణు ఈ సినిమా ద్వారా ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి. కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

