|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విశ్వంభర విడుదల తేదీ ఫిక్స్! చిరంజీవి అభిమానులకు పండగే!

Published: 09-04-2026, 8:05 AM
విశ్వంభర విడుదల తేదీ ఫిక్స్! చిరంజీవి అభిమానులకు పండగే!
  • చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర చిత్రం తెరకెక్కింది.
  • ఈ సినిమా సోసియో ఫాంటసీ నేపథ్యంలో రూపొందుతోంది.
  • విఎఫ్ఎక్స్ పనులు ఆలస్యం కావడంతో సినిమా విడుదల వాయిదా పడింది.
  • జూలై 10న సినిమా విడుదల కానుందని సమాచారం.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం విశ్వంభర. ఈ సినిమా జూలై 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని సమాచారం. విఎఫ్ఎక్స్ పనులు పూర్తికాకపోవడంతో సినిమా విడుదల ఆలస్యమైంది.

విశ్వంభర సినిమా విడుదల ఎప్పుడు?

Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి హీరోగా బింబిసారా దర్శకుడు వశిష్ట కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం విశ్వంభర(Vishwambhara). సోసియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా గత రెండు సంవత్సరాల క్రితం ప్రకటించి షూటింగ్ పనులను కూడా పూర్తి చేసుకున్నారు. నిజానికి ఈ సినిమా 2025 సంవత్సరంలోనే విడుదల కావాల్సి ఉండగా తరచూ వాయిదా పడుతూ వస్తుంది. ఈ సినిమా వరుసగా వాయిదా పడుతున్న నేపథ్యంలో అభిమానులు ఎంతో నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా విడుదల వాయిదా పడటానికి కారణం లేకపోలేదు.

ఈ సినిమాకు సంబంధించిన విఎఫ్ఎక్స్ పనులు పూర్తికాని నేపథ్యంలో ఈ సినిమాని వాయిదా వేస్తూ వచ్చారు. మంచి క్వాలిటీతో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం కోసం చిత్ర నిర్మాతలు తరచు ఈ సినిమాని వాయిదా వేస్తూ వచ్చారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా విఎఫ్ఎక్స్ పనులన్నీ దాదాపు పూర్తి అయ్యాయని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే సినిమా విడుదలకు చిత్ర నిర్మాతలు ముహూర్తం ఖరారు చేసినట్టు ఇండస్ట్రీ సమాచారం. ఇక ఈ చిత్రాన్ని జులై 10వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయడానికి చిత్ర నిర్మాతలు సిద్ధమవుతున్నారు.

విఎఫ్ఎక్స్ పనుల్లో జాప్యం

ఇప్పటికే సినిమా విఎఫ్ఎక్స్ పనులతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ కూడా దాదాపు పూర్తి అయ్యాయని, త్వరలోనే ఈ సినిమా విడుదలకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా రాబోతోందని తెలుస్తోంది. ఈ సినిమాకు వశిష్ట దర్శకత్వం వహించగా యూవీ క్రియేషన్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి సంగీతం అందించగా చిరంజీవి జోడిగా త్రిష నటించబోతున్నారు. ఇక ఈ సినిమా విడుదల తేదీ గురించి ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మెగా 158 పూజా కార్యక్రమం..

చిత్ర యూనిట్ ప్రకటన ఎప్పుడు?

నిజానికి ఈ సినిమా మన శంకర్ వరప్రసాద్ గారు కంటే ముందుగానే విడుదల కావాల్సి ఉంది కానీ గ్రాఫిక్స్ పనులు పూర్తికాని నేపథ్యంలోనే వాయిదా పడుతూ వస్తోంది. చిరంజీవి అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మన శంకర వరప్రసాద్ గారు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నారు. ఈ నేపథ్యంలోనే విశ్వంభరపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. ఇక చిరంజీవి ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే ఈయన బాబీ డైరెక్షన్లో మరో సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఏప్రిల్ 11వ తేదీ పూజ కార్యక్రమాలను జరుపుకోబోతోంది. ఏప్రిల్ 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ సినిమా మెగా 158 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకోబోతోంది.

విశ్వంభర సినిమా జూలై 10న విడుదల కానుందనే వార్త అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తోంది. త్వరలోనే చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ సినిమా కోసం ఎదురుచూడండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.