|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Vishwak Sen: విశ్వక్ సేన్ ఫ్యాన్స్‌కు భారీ గుడ్ న్యూస్.. ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్‌పై బిగ్గెస్ట్ అప్డేట్

Published: 27-06-2025, 7:17 AM
Vishwak Sen: విశ్వక్ సేన్ ఫ్యాన్స్‌కు భారీ గుడ్ న్యూస్.. ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్‌పై బిగ్గెస్ట్ అప్డేట్

విశ్వక్ సేన్ నటించిన సూపర్ హిట్ చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది?’ కు సీక్వెల్ రానున్నట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించనున్నారు. జూన్ 28 మరియు 29 తేదీలలో మరిన్ని అప్డేట్స్ వెలువడనున్నాయి.

Key Points

1

‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమాకు సీక్వెల్ వస్తున్నట్లు ప్రకటన.

2

తరుణ్ భాస్కర్ మళ్ళీ దర్శకత్వం వహించనున్నారు.

4

జూన్ 28 & 29 తేదీల్లో మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ రానున్నాయి.

‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమా సక్సెస్

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన చిత్రాల్లో ‘ఈ నగరానికి ఏమైంది?’ (Ee Nagaraniki Emaindi) ఒకటి. తరుణ్ భాస్కర్ (Tarun Bhaskar) దర్శకత్వం వహించిన ఈ మూవీని డి. సురేష్ బాబు నిర్మించగా.. సుశాంత్ రెడ్డి, అభినవ గోమటం, వెంకటేష్, కాకమాను, అనిషా అంబ్రోస్, సిమ్రాన్ చౌదరి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. 2018లో విడుదలైన ఈ మూవీ కేవలం రూ. 2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 12 కోట్ల వరకు రాబట్టి సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో విశ్వక్ సేన్ గ్రాఫ్ కూడా ఇండస్ట్రీలో బాగా పెరిగింది.

ఆ తర్వాత వచ్చిన సినిమాలు అంతగా ఆకట్టుకోకపోగా.. ఈ నగరానికి ఏమైంది లాంటి సినిమాలు చేయ్యి అన్నా అంటూ విశ్వక్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఫ్యాన్స్‌కు ఓ బిగ్టెస్ట్ గుడ్ న్యూస్ అయితే అందింది. ఈ బ్లాక్ బస్టర్ చిత్రానికి సీక్వెల్ తీసే ప్లాన్ ఉన్నారు చిత్ర బృందం. ఈ విషయన్ని ప్రకటిస్తూ.. ‘సర్‌ప్రైజ్!!! కన్యా రాశి బృందం తిరిగి వస్తోంది.. జూన్ 28 & 29 తేదీలలో ఎగ్జైటింగ్ అప్డేట్స్ రాబోతున్నాయి.. సిద్ధంగా ఉండండి’ అంటూ చెప్పుకొచ్చారు. కాగా.. ‘ఈ నగరానికి ఏమైంది?’ సీక్వెల్‌ను తరుణ్ భాస్కర్ మరోసారి తనదైన స్టైల్లో తెరకెక్కించబోతుండగా.. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనుంది. లింక్

సీక్వెల్ ప్రకటన

చిత్ర బృందం వివరాలు

‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమా సక్సెస్ తర్వాత, దాని సీక్వెల్ కోసం అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. చిత్ర బృందం త్వరలోనే మరిన్ని వివరాలను వెల్లడించనుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.