|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విశ్వక్ సేన్ ఉగ్రరూపం: సినిమాను చంపాలని చూస్తున్న పరాన్నజీవులపై ఫైర్!

Published: 21-12-2025, 4:44 AM
విశ్వక్ సేన్ ఉగ్రరూపం: సినిమాను చంపాలని చూస్తున్న పరాన్నజీవులపై ఫైర్!
  • సినీ పరిశ్రమలో సినిమాలపై, నటీనటులపై నెగెటివ్ ప్రచారం ఇటీవల పెరిగిపోయింది.
  • రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీలోని ‘చికిరి చికిరి’ పాటపై కొందరు నెగెటివ్ వీడియోలు క్రియేట్ చేశారు.
  • ఇండస్ట్రీ ద్వారా ప్రయోజనం పొందుతూనే సినిమాలను కించపరిచే వారిపై విశ్వక్ సేన్ ఫైర్ అయ్యారు.
  • ఇలాంటి వారిని ‘పరాన్నజీవి’ అనాలేమో అంటూ విశ్వక్ సేన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

సినీ పరిశ్రమలో సినిమాలపై, నటీనటులపై నెగెటివ్ ప్రచారం పెరిగిపోతోంది. తాజాగా, రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా, ‘చికిరి చికిరి’ పాటపై ట్రోలింగ్ జరగడంతో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తీవ్రంగా స్పందించారు. ఇండస్ట్రీని తిని బతికి, సినిమాలను నాశనం చేసేవారిని పరాన్నజీవులంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇండస్ట్రీలో నెగెటివ్ ప్రచారం: కొత్త ట్రెండ్

సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఏ సినిమాపై మొదట మంచి టాక్‌ను సొంతం చేసుకున్నప్పటికీ .. బాగున్న మూవీని బాలేదని కొందరు ప్రచారం మొదలెడుతున్నారు. నటీనటులు, దర్శక నిర్మాతలపై విమర్శలు చేస్తూ పోస్టులు పెడుతున్నారు. కొంతమంది యూట్యూబర్స్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల వల్ల ఎంతోమంది సెలబ్రిటీలు బాధపడుతున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి సంఘటనలు సినీ ఇండస్ట్రీలో చాలానే చోటుచేసుకుంటున్నాయి. అయితే కొందరు సెలబ్రిటీలు పట్టించుకోకుండా ఉంటే.. మరికొందరు మాత్రం పోలీసులు, కేసులంటూ తమ సినిమాపై నెగిటివిటీ చేసిన వారికి గట్టిగానే బుద్ధి చెబుతున్నారు. అయినప్పటికీ ఇలాంటి సంఘటనలు ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌పై కూడా ఇలాంటి ట్రోలింగ్ జరుగుతోంది. ఆయన నటిస్తున్న ‘పెద్ది’ సినిమాపై కొందరు నెగెటివ్ ప్రచారం చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఈ విషయం కాస్త మాస్ కా దాస్ విశ్వక్ సేన్‌కు తెలిసి అలాంటి వారిపై ఆయన మండిపడ్డారు.

రామ్ చరణ్ ‘పెద్ది’పై వివాదం

అసలు విషయంలోకి వెళితే.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), బుచ్చిబాబు సనా(Buchi Babu Sana) కాంబోలో రాబోతున్న మూవీ ‘పెద్ది’(peddi). వృద్ధి సినిమాస్, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై కిలారు వెంకట సతీష్, ఇషాన్ సక్సేనాలు నిర్మిస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుండగా.. జగపతి బాబు, దివ్యేందు శర్మ, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా రామ్ చరణ్ పుట్టినరోజును పురస్కరించుకుని వచ్చే ఏడాది మార్చి 27న థియేటర్స్‌లోకి రాబోతుంది.ఇక అప్పుడే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మూవీ టీమ్ వరుస అప్డేట్స్ విడుదల చేస్తున్నారు. ఇటీవల ఇందులోంచి ‘చికిరి చికిరి’ సాంగ్‌ను రిలీజ్ చేయగా.. అత్యధిక వ్యూస్ రాబడుతూ.. ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తెలుగు సహా 5 భాషల్లో 150 మిలియన్ల వ్యూస్‌ను రాబట్టింది. విడుదలై చాలా రోజులే అవుతున్నప్పటికీ టాప్ ట్రెండింగ్‌లో ఉంది. అయితే ఈ పాటపై కొందరు నెగెటివ్ వీడియోలు క్రియేట్ చేస్తూ నెట్టింట పోస్ట్ చేశారు. ఇక ఈ విషయంపై విశ్వక్ సేన్ (Vishwak Sen)గట్టిగానే స్పందించారు.

పరాన్నజీవులపై విశ్వక్ సేన్ ఆగ్రహం

చిత్ర పరిశ్రమ నుంచి ప్రయోజనం పొందుతూ.. ఇండస్ట్రీని కించపరిచేలా మాట్లాడటం కరెక్ట్ కాదని ఫైర్ అయ్యారు. ఇలాంటి మనుషులను పరాన్నజీవి అనాలేమో.. ఇండస్ట్రీ ద్వారా తాను, తన కుటుంబం బతుకుతూ ఒక సినిమా రిలీజ్ కాకముందే నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి వారి ప్రవర్తన.. తిని పళ్లెంలో ఉమ్మేసినట్లుగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్విట్టర్ ద్వారా నెగిటివిటీ క్రియేట్ చేస్తున్న వారి వీడియోను షేర్ చేశాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు విశ్వక్ సేన్‌కు సపోర్ట్‌గా నిలుస్తుండగా.. తమ హీరో సినిమాపై నెగిటివిటీ క్రియేట్ చేస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

విశ్వక్ సేన్ వ్యాఖ్యలు సినీ పరిశ్రమలోని సమస్యను మరోసారి వెలుగులోకి తెచ్చాయి. కష్టపడి నిర్మించిన సినిమాలను రిలీజ్ కాకముందే దెబ్బతీయాలని చూసే ఇలాంటి చర్యలను ఖండించాల్సిన అవసరం ఉంది. ఇండస్ట్రీ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.