
📌 Key Points
- బెంగాల్ ఎన్నికల ఫలితాలపై సంచలన డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి షాకింగ్ కామెంట్స్ వైరల్.
- “ది కశ్మీర్ ఫైల్స్, ది బెంగాల్ ఫైల్స్‌ను బ్యాన్ చేసి, మాపై దాడి చేశారు” అని వెల్లడి.
- మమతా బెనర్జీ పాలనలో జరిగిన సంఘటనలను గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు.
- “ఇకపై బెంగాల్ ప్రజలు భయం లేకుండా తలెత్తి నడవొచ్చు” అంటూ ధీమా వ్యక్తం.
బెంగాల్ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో బాలీవుడ్ సంచలన డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆయన మాటలు తెలుగు ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంటున్నాయి.
బెంగాల్ ఎన్నికల ఫలితాలపై వివేక్ అగ్నిహోత్రి రియాక్షన్
Vivek Ranjan Agnihotri : పశ్చిమబెంగాల్ లో జరిగిన ఎన్నికల్లో మమతా బెనర్జీ పార్టీ దారుణంగా ఓడిపోయింది. దీంతో సెలబ్రిటీలు సైతం ఈ ఫలితాలపై స్పందిస్తున్నారు. పలువురు సినీ సెలబ్రిటీలు సైతం మమతాబెనర్జీని, ఆమె పార్టీని, బెంగాల్ లో జరిగిన సంఘటనలను ప్రత్యక్షంగానే విమర్శిస్తూ పోస్టులు చేసారు. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి మమతాబెనర్జీ హయాంలో తమపై జరిగిన దాడుల గురించి మాట్లాడుతూ ఓ వీడియో రిలీజ్ చేసారు.
వివేక్ అగ్నిహోత్రి మాట్లాడుతూ.. ఇకపై ఇలాంటివి జరగకూడదు. తెలియని వారి కోసం చెబుతున్నా. ది కశ్మీర్ ఫైల్స్ సినిమా రిలీజ్ అయ్యాక నన్ను పశ్చిమ బెంగాల్ నుంచి మమతా బెనర్జీ బహిష్కరించారు. ఆ సినిమాని థియేటర్స్ నుంచి తొలగించారు. ఇక ది బెంగాల్ ఫైల్స్ సినిమాను అయితే పశ్చిమ బెంగాల్‌లో పూర్తిగా బ్యాన్ చేసారు. ఆ సినిమా ట్రైలర్ కార్యక్రమాన్ని అడ్డుకొని మాపై దాడి చేసి కొట్టారు. నాపై అనేక కేసులు పెట్టారు. అయినా నేను వెనుకడుగు వేయలేదు. ఈ ఎన్నికల సమయంలో ది బెంగాల్ ఫైల్స్ సినిమాని బెంగాల్ వ్యాప్తంగా చాలామందికి రహస్యంగా చూపించాం. మా శక్తి మేరకు మేము పోరాడాము. బెంగాల్ మహనీయులకు అభినందనలు. ఇకపై బెంగాల్ ప్రజలు ఎలాంటి భయం లేకుండా తలెత్తి గర్వంగా నడవొచ్చు అని అన్నారు.
“మా సినిమాలను బ్యాన్ చేసి, దాడి చేశారు!”
“ఇక బెంగాల్‌లో భయం లేకుండా నడవొచ్చు!”
వివేక్ అగ్నిహోత్రి వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. బెంగాల్ రాజకీయాలపై ఆయన చేసిన కామెంట్స్ మరింత చర్చకు దారితీస్తున్నాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన సినీ, రాజకీయ అప్‌డేట్స్ కోసం మా ఛానెల్‌ను చూస్తూ ఉండండి!


