|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వివో Y51 ప్రో: 7200mAh బ్యాటరీతో సంచలనం! ధర తెలిస్తే షాక్ అవుతారు!

Published: 12-03-2026, 10:35 AM
వివో Y51 ప్రో: 7200mAh బ్యాటరీతో సంచలనం! ధర తెలిస్తే షాక్ అవుతారు!
  • వివో Y51 ప్రో 5G ఫోన్ 7200mAh భారీ బ్యాటరీతో విడుదల అయింది.
  • ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 24,999 నుండి మొదలవుతుంది.
  • వివో Y51 ప్రో 5G డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68, IP69 రేటింగ్‌లతో వస్తుంది.
  • ఈ ఫోన్ ఫెస్టివ్ రెడ్, నోబుల్ గోల్డ్ రంగుల్లో లభిస్తుంది.

వివో నుంచి సరికొత్త 5జీ ఫోన్ విడుదలైంది. వివో Y51 ప్రో 7200mAh భారీ బ్యాటరీతో వస్తుంది. దీని ధర రూ. 24,999 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఫోన్ యొక్క ఫీచర్లు ఇప్పుడు తెలుసుకుందాం.

వివో Y51 ప్రో: ధర మరియు లభ్యత

Vivo Y51 Pro : వివో నుంచి కొత్త ఫోన్ లాంచ్ అయింది. 72000mAh భారీ బ్యాటరీతో వివో Y51 ప్రో 5జీ ఫోన్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ఫీచర్లు అద్భుతంగా ఉన్నాయి. ధర కూడా మీ బడ్జెట్ లోనే లభిస్తోంది.

వివో Y51 ప్రో మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్.. ధర రూ. 24,999 నుంచి ప్రారంభం బ్యాటరీ, డిజైన్, మన్నిక పరంగా వివో యూజర్లకు బెస్ట్ ఫోన్ వివో Y51 ప్రో వివో వెబ్‌సైట్, ఫ్లిప్ కార్ట్, రిటైల్ స్టోర్లలో అమ్మకానికి అందుబాటులో

Vivo Y51 Pro : వివో లవర్స్ పండగ చేస్కోండి. వివో నుంచి అద్భుతమైన ప్రో 5జీ ఫోన్ వచ్చేసింది. భారత మార్కెట్లో అధికారికంగా వివో Y51 ప్రో 5జీ లాంచ్ అయింది. దేశవ్యాప్తంగా కంపెనీ అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్, అధీకృత రిటైల్ స్టోర్‌ల ద్వారా అమ్మకానికి అందుబాటులో ఉంది.

ధర, ఆఫర్లు వివరాలివే : వివో Y51 ప్రో ఫోన్ 128GB స్టోరేజ్, బేస్ వేరియంట్‌ ధర రూ. 24,999 నుంచి ప్రారంభమవుతుంది. అయితే, 256GB మోడల్ ధర రూ. 27,999కు లభిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ ఫెస్టివ్ రెడ్, నోబుల్ గోల్డ్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. లాంచ్ ఆఫర్ల విషయానికి వస్తే కొనుగోలుదారులు రూ. 2,500 వరకు క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు.

ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్లు

వివో Y51 ప్రో 5G, వివో V70 సిరీస్ మాదిరిగానే డిజైన్‌ అందిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ రెక్టాంగులర్ కెమెరా మాడ్యూల్, ప్లాట్ ఎడ్జెస్ ఉన్నాయి. వివో Y51 ప్రో 5జీ ఫోన్ IP68, IP69 రేటింగ్‌తో డస్ట్ 1.5 మీటర్ల వరకు నీటిలో మునిగినా కూడా చెక్కుచెదరదు.

ఈ స్మార్ట్‌ఫోన్ డ్రాప్ రెసిస్టెన్స్ కోసం SGS 5-స్టార్ ప్రీమియం పెర్ఫార్మెన్స్ మార్క్‌ అందిస్తుంది. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ స్టాండర్స్ కు అనుగుణంగా ఉంటుంది. ఈ ఫోన్ 1.7 మీటర్ల ఎత్తు నుంచి మల్టీ-యాంగిల్ డ్రాప్ టెస్టింగ్‌ చేసినట్టు వివో పేర్కొంది. IP68 రేటింగ్ లేని వన్ ప్లస్ నార్డ్ CE5, రెడ్‌మి నోట్ 15 వంటి ధరతో కొన్ని స్మార్ట్‌ఫోన్‌లతో పోలిస్తే అదనపు బెనిఫిట్స్ అందిస్తుంది. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ సర్టిఫికేషన్ కూడా ఉంది.

స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. వివో V51 ప్రో భారీ 7,200mAh బ్యాటరీతో రానుంది. ఈ కేటగిరీలో అతిపెద్ద బ్యాటరీలలో ఇదొకటి. భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ ఈ ఫోన్ కేవలం 8.49mm మందం, 219 గ్రాముల బరువు ఉంటుంది. సిలికాన్-కార్బన్ బ్యాటరీ టెక్నాలజీ వాడారు. ఛార్జింగ్ ఆప్టిమైజ్ కోసం బ్యాటరీ వేర్‌, ఫోన్ బైపాస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్ బ్యాటరీ 6 ఏళ్ల వరకు గ్యారెంటీ ఉంటుందని వివో పేర్కొంది.

Read Also : 7 Budget Phones : ఖతర్నాక్ ఫోన్లు భయ్యా.. 5000mAh భారీ బ్యాటరీతో 7 బడ్జెట్ ఫోన్లు.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోవచ్చు!

బ్యాటరీ మరియు డ్యూరబిలిటీ వివరాలు

ఈ ఫోన్ 44W ఫ్లాష్‌చార్జ్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ ధరలో ఇతర స్మార్ట్‌ఫోన్‌లే బెస్ట్. మీడియాటెక్ డైమెన్సిటీ 7360 SoC, 8GB ర్యామ్ ఉంది. 2025లో ఇదే చిప్‌సెట్ తో వివో V60e ఫోన్ లాంచ్ అయింది. అత్యంత పవర్‌ఫుల్ ప్రాసెసర్ కాకపోయినా రోజువారీ పనులు, సాధారణ గేమింగ్ కోసం అద్భుతంగా ఉంటుంది. మీరు పవర్ యూజర్ అయితే, వన్ ప్లస్ నార్డ్ సీఈ5, లావా అగ్ని 4 మంచి అల్ట్రానేట్ ఫోన్లు కావచ్చు.

వివో Y51 ప్రో డ్యూయల్-కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 50MP ప్రైమరీ సెన్సార్, 2MP యాక్సిలరీ సెన్సార్ ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 8MP స్నాపర్ కూడా ఉంది. వివో V70 సిరీస్ కన్నా రిజల్యూషన్ తక్కువగా ఉంటుంది. జీస్ బ్రాండింగ్ కూడా లేదు. ఈ ఫోన్ కెమెరాలు పెద్దగా ఆకట్టుకోకపోవచ్చు.

డిస్‌ప్లే పరంగా చూస్తే.. వివో Y51 ప్రో అంతగా అట్రాక్ట్ ఉండకపోవచ్చు. రెండర్‌లు ప్రకారం.. 6.75-అంగుళాల LCD ప్యానెల్ బెజెల్‌ ఉన్నాయి. ఈ స్క్రీన్ HD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 1,250 నిట్స్ వరకు టాప్ బ్రైట్ నెస్ అందిస్తుంది.

వ్యూ ఎక్స్ పీరియన్స్ కోసం TUV రీన్‌ల్యాండ్ లో బ్లూ లైట్ సర్టిఫికేషన్, సూపర్ ఆడియో అల్గారిథమ్‌లతో డ్యూయల్ స్టీరియో స్పీకర్‌ల ద్వారా సపోర్టు ఇస్తుంది. అద్భుతమైన ఆడియో ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది. సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే.. ఆండ్రాయిడ్ 16 ఆధారంగా OriginOS 6పై రన్ అవుతుంది. వివో ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో సాఫ్ట్‌వేర్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది.

వివో Y51 ప్రో 5జీ అనేది భారీ బ్యాటరీ, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీతో వస్తున్న ఒక మంచి మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్. బడ్జెట్ ధరలో ఇది వినియోగదారులకు ఒక మంచి ఎంపిక.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.