|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అమెరికాలో విషాదం: విజయనగరం టెక్కీ జల సమాధి! శోకసంద్రంలో స్వస్థలం!!

Published: 12-04-2026, 11:05 AM
అమెరికాలో విషాదం: విజయనగరం టెక్కీ జల సమాధి! శోకసంద్రంలో స్వస్థలం!!
  • విజయనగరం జిల్లాకు చెందిన సాయిహరికృష్ణ అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.
  • కాలిఫోర్నియాలోని జలపాతంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి సాయిహరికృష్ణ మృతి.
  • మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.
  • సాయిహరికృష్ణ మృతితో పిరిడి గ్రామంలో విషాద ఛాయలు.

విజయనగరం జిల్లాకు చెందిన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అమెరికాలో ప్రమాదవశాత్తు మరణించారు. కాలిఫోర్నియాలోని జలపాతంలో స్నేహితులతో గడుపుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. అతని మరణం స్వగ్రామంలో విషాదాన్ని నింపింది. మృతదేహాన్ని స్వదేశానికి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి

Vizianagaram software engineer dead in US : అమెరికాలో ఉన్నత చదువులు చదువుకుని…. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా స్థిరపడాలనుకున్న ఓ యువకుడి జీవితం అర్ధంతరంగా ముగిసిపోయింది. స్నేహితులతో సరదా గడిపేందుకు ఓ జలపాతానికి వెళ్లగా… ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు.

వివరాల్లోకి వెళ్తే…. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పిరిడి గ్రామానికి చెందిన సింగిరెడ్డి సాయిహరికృష్ణ అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. వీకెండ్ కావడంతో తన స్నేహితులతో కలిసి కాలిఫోర్నియాలోని ఓ జలపాతాన్ని సందర్శించేందుకు వెళ్లారు. అక్కడ సరదాగా గడుపుతున్న సమయంలో ప్రమాదవశాత్తు కాలు జారి జలపాతంలోని లోతైన నీటిలో పడిపోయారు. స్నేహితులు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ప్రవాహం వేగంగా ఉండటంతో ఆయన నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు.

కాలిఫోర్నియా జలపాతంలో ప్రమాదం

ఈ విషాద వార్తతో సాయిహరికృష్ణ తల్లిదండ్రులు శ్రీనివాసరావు, రమాదేవి కన్నీరుమున్నీరవుతున్నారు. సాయిహరికృష్ణ అకాల మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

మరోవైపు సాయికృష్ణ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. విదేశీ వ్యవహారాల శాఖతో సమన్వయం చేస్తోంది. ఒకటి రెండు రోజుల్లో మృతదేహం పిరిడి గ్రామానికి చేరుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

స్వగ్రామానికి మృతదేహం తరలింపు

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More

సాయిహరికృష్ణ మరణం అతని కుటుంబానికి, స్వగ్రామానికి తీరని దుఃఖాన్ని మిగిల్చింది. ప్రభుత్వం అతని మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటోంది. ఈ విషాద సంఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.