
వేద జ్యోతిష్యం ప్రకారం, శుక్రుడు సంపద, ఆనందం, అందానికి కారకుడు. జూన్ 29, 2025న శుక్రుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. దీని వల్ల 5 రాశుల వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి.
Key Points
వృషభ రాశిలో శుక్రుని సంచారం వల్ల ఐదు రాశుల వారికి అనుకూల ఫలితాలు.
ఆర్థిక లాభాలు, వ్యాపార విజయాలు, వైవాహిక సంతోషం లభించే అవకాశం.
కొన్ని రాశుల వారికి ఆస్తి లాభాలు, ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి.
విద్యార్థులు, పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారికి శుభకాలం.
శుక్రుని వృషభ రాశి సంచారం ప్రభావం
వేద, జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడు శ్రేయస్సు, సంపద, ఆనందం, అందం, కళలకు కారకుడు. జాతకంలో శుక్రుడు స్థానం బలంగా ఉంటే జీవితంలో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిన అవసరమే ఉండదు. అదే ఒకవేళ శుక్రుడు బలహీనంగా ఉన్నట్లయితే ఆర్థికంగా వైఫల్యాలు, ప్రేమ జీవితంలో వైవాహిక జీవితంలో సమస్యలు రావచ్చు.
సంపద , శ్రేయస్సుకు కారకుడైన శుక్రుడు ఒక ఏడాది తర్వాత సొంత రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. శుక్రుడు రాశి మార్పు వలన కొన్ని రాశుల వారికీ ప్రయోజనకరంగా ఉంటుంది. శుక్రుని రాశి మార్పు 12 రాశులపై ప్రభావం చూపించినప్పటికీ కొన్ని రాశుల వారికి మాత్రం శుభ ఫలితాలు ఉంటాయి. జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం శుక్రుడు ఏడాది తర్వాత సొంత రాశిలోకి ప్రవేశిస్తున్నాడు.
శుక్రుడు 29 జూన్ 2025న మేష రాశిని వదిలి వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది 12 రాశుల వారిపై ప్రభావం చూపించినప్పటికీ ఐదు రాశుల వారికి మాత్రం ప్రత్యేక ఫలితాన్ని తీసుకువస్తుంది.
ప్రయోజనం పొందే 5 రాశులు
వృషభ రాశిలోకి శుక్రుడు సంచారం వృషభ రాశి వారికి ప్రయోజనాన్ని అందిస్తుంది. ఈ సంచారం వలన ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. వ్యాపారంలో కలిసి వస్తుంది. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. మీ జీవిత భాగస్వామి సపోర్ట్ మీకు ఉంటుంది. ఆస్తులు కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది.
మిధున రాశి వారికి కూడా శుక్రుడి సంచారం వలన కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. ఎలాంటి టెన్షన్లు ఉన్నా వదిలి పోతాయి. విద్యార్థులకి ఈ సమయంలో కలిసి వస్తుంది. పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న వారికి శుభ సమయం ఇది. వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఇన్వెస్ట్ చేస్తే మంచిగా డబ్బులు వస్తాయి.
తులా రాశి వారికి శుక్రుడి వృషభ రాశి సంచారం కలిసి వస్తుంది. తల్లిదండ్రుల నుంచి ఆస్తి వస్తుంది. పూర్వికుల ఆస్తులు కూడా వచ్చే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామితో రొమాంటిక్ ట్రిప్ వేస్తారు. ధనం కూడా పెరుగుతుంది. పెళ్ళికాని వారికి పెళ్లి అయ్యే అవకాశం ఉంది.
ప్రతి రాశికి ఏమి ఆశించాలి?
శుక్రుడి వృషభ రాశి సంచారం మకర రాశి వారికి కూడా కలిసి వస్తుంది. సంతోషంగా ఉంటారు. ఈ సమయంలో వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది. ఆర్థికపరంగా కూడా కలిసి వస్తుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటాయి.
వృషభ రాశిలో శుక్రుడి సంచారం మీన రాశి వారికి ప్రత్యేక ఫలితాన్ని ఇస్తుంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ధనం పెరుగుతుంది బిజినెస్ పని మీద విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
శుక్రుని వృషభ రాశి సంచారం కొన్ని రాశులకు అనుకూలంగా ఉంటుంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మీరు లాభాలను పొందవచ్చు. అయితే, ఇది ఒక సాధారణ సూచన మాత్రమే.


