
ఆగస్టు 14న విడుదలైన వార్ 2 మరియు కూలీ సినిమాల కలెక్షన్ల గురించి ఈ కథనం వివరిస్తుంది. ఎన్టీఆర్ నటనతో తెలుగులో వార్ 2 కి మంచి హైప్ వచ్చింది. రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఎలా రాణిస్తున్నాయో చూద్దాం.
Key Points
వార్ 2 మొదటి వీకెండ్ లో ప్రపంచవ్యాప్తంగా 265 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
వార్ 2 బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 700 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేయాల్సి ఉంది.
తెలుగులో వార్ 2 75 కోట్ల గ్రాస్ వసూలు చేసింది, బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 180 కోట్లు కావాలి.
కూలీ కంటే వార్ 2 120 కోట్లు తక్కువ వసూలు చేసింది.
వార్ 2 మొదటి వీకెండ్ కలెక్షన్స్
War 2 Collections : గత వారం ఆగస్టు 14న వార్ 2, కూలీ సినిమాలు రిలీజయ్యాయి. ఒకటి తమిళ్ సినిమా, ఒకటి బాలీవుడ్ సినిమా అయినా మన తెలుగు హీరోలు ఉండటంతో ఈ రెండు సినిమాలకు తెలుగులో మంచి హైప్ వచ్చింది, బిజినెస్ కూడా బాగానే జరిగింది. అయితే ఈ రెండు సినిమాలు ప్రేక్షకులకు యావరేజ్ గానే నిలిచాయి.
నాలుగు రోజులు హాలీడేస్ రావడం, ఈ సినిమాపై హైప్ ఉండటంతో కలెక్షన్స్ మాత్రం భారీగానే వచ్చాయి. ఎన్టీఆర్ మొదటి సారి బాలీవుడ్ సినిమాలో నటించడంతో తెలుగులో భారీ హైప్ ఉండటంతో నిర్మాత నాగవంశీ ఏకంగా 90 కోట్లు పెట్టి తెలుగు రైట్స్ తీసుకున్నట్టు సమాచారం.
వార్ 2 బ్రేక్ ఈవెన్ పాయింట్
వార్ 2 సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ 85 నుంచి 90 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు సమాచారం. కూలీ మూవీ అధికారికంగా 151 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అనౌన్స్ చేసినా వార్ 2 మాత్రం అనౌన్స్ చేయలేదు. మొదటి వీకెండ్ నాలుగు రోజులు వార్ 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 265 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమా వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే దాదాపు 350 కోట్లు షేర్ కలెక్ట్ చేయాలి. అంటే ఆల్మోస్ట్ 700 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేయాలి. మరి ఓవరాల్ గా రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.
వార్ 2 మరియు కూలీ కలెక్షన్స్ పోలిక
తెలుగులో వార్ 2 సినిమా 75 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది. ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం 180 కోట్ల గ్రాస్ వసూలు చేయాలని తెలుస్తుంది. వార్ 2 సినిమా మొదట్నుంచి, అడ్వాన్స్ సేల్స్ నుంచి రేసులో వెనకపడే ఉంది. కూలీకి ఉన్నంత హైప్ లేకపోయినా ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి తెలుగు వరకు భారీ హైప్ ఉంది. బాలీవుడ్ లో రెగ్యులర్ స్పై యాక్షన్ సినిమాగానే చూసారు. కూలీ సినిమా నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 385 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు సమాచారం. అంటే వార్ 2 కూలీ కంటే 120 కోట్లు తక్కువే కలెక్ట్ చేసింది. మరి ఈ రెండు సినిమాలు ఎప్పుడు బ్రేక్ ఈవెన్ అవుతాయో చూడాలి.
వార్ 2 మరియు కూలీ సినిమాల భవిష్యత్తు కలెక్షన్లు మరియు బ్రేక్ ఈవెన్ పాయింట్లను బట్టి వాటి విజయం నిర్ణయించబడుతుంది. రెండు సినిమాలకు ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.


