
📌 Key Points
- ప్రముఖ దర్శకుడు భారతీరాజా చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు.
- శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.
- ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.
- కుమారుడి మరణం, వయసు పైబడటం ఆయన ఆరోగ్య సమస్యలకు ప్రధాన కారణాలు.
ప్రముఖ దర్శకుడు భారతీరాజా శ్వాస సమస్యలతో చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఈ వార్త తెలుగు సినిమా ప్రపంచంలో ఆందోళన రేపింది.
దిగ్గజ దర్శకుడికి అస్వస్థత
దిగ్గజ దర్శకుడు భారతీరాజా(Director Bharathiraja) చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. గతనెల 27వ తేదీన శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న ఆయన్ను.. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఐసీయూలో ఉంచి ట్రీట్‌మెంట్ అందిస్తు్న్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. డిశ్చార్జికి కొంత సమయం పడుతుందని వైద్యులు బులిటెన్‌లో పేర్కొన్నారు. కాగా, భారతీరాజా తమిళ సినిమా దర్శకుడు. ఈయన దర్శకత్వం వహించిన సీతాకోకచిలుక సినిమాకు తెలుగులో ఉత్తమ చిత్రంగా భారత జాతీయ చలనచిత్ర పురస్కారంతో పాటు నంది అవార్డు వచ్చింది. నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన మంగమ్మగారి మనవడు చిత్రానికి కథను, రెబల్ స్టార్ కృష్ణంరాజు ప్రధాన పాత్రలో నటించిన పల్నాటి పౌరుషం చిత్రానికి స్క్రీన్‌ప్లేను అందించారు.
ప్రస్తుతం భారతీరాజా వయసు 84 ఏళ్లు. గత ఏడాది మార్చి నెలకు ముందు వరకు ఆయన చురుకుగా పని చేసేవారు. అయితే.. కుమారుడు, నటుడు మనోజ్ ఆకస్మికంగా గుండెపోటుతో మరణించడంతో భారతీరాజా తీవ్రంగా కుంగిపోయారు. ఆయన మానసిక వేదన, వయసు పైబడటం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తాయి.
ఐసీయూలో భారతీరాజా.. ప్రస్తుత పరిస్థితి
ఆరోగ్య సమస్యలకు అసలు కారణం
భారతీరాజా త్వరగా కోలుకొని తిరిగి రావాలని సినీ ప్రముఖులు, అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ, పూర్తిగా కోలుకోవడానికి సమయం పడుతుందని వైద్యులు పేర్కొన్నారు. దిగ్గజ దర్శకుడు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆశిద్దాం.


