
ప్రభాస్ నేడు తన 45వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో ప్రభాస్ సందడి నెలకొంది. పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్, హీరో కాకపోతే ఏం చేసేవాడో స్వయంగా వెల్లడించారు. ఆయన అభిమానులకు తెలియని ఆసక్తికర విషయాలు ఈ కథనంలో.
Key Points
ప్రభాస్ తన 45వ పుట్టినరోజును ఘనంగా జరుపుకుంటున్నారు, సోషల్ మీడియాలో ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.
కృష్ణంరాజు నటవారసుడిగా వచ్చి, ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా ప్రభాస్ ఎదిగారు.
నటనలోకి రాకపోతే విదేశాల్లో ఎంబీఏ చేసి ఇండియాలో హోటల్ లేదా రెస్టారెంట్ పెట్టాలనుకున్నారు.
ప్రభాస్ భోజన ప్రియుడు, షూటింగ్ సెట్‌లో ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు అన్ని రకాల వంటకాలు తినిపించడం ఇష్టం.
ప్రభాస్ పుట్టినరోజు వేడుకలు, కొత్త పోస్టర్ల సందడి
ప్రభాస్ నేడు 45వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. దీంతో ఇండస్ట్రీలో, అటు సోషల్ మీడియాలో మొత్తం ఆ సందడి నెలకొంది. నెట్టింట ప్రభాస్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. మరోవైపు ఆయన సినిమాల అప్ డేట్లు ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్నాయి. `ఫౌజీ` ఫస్ట్ లుక్‌ని విడుదల చేసిన విషయం తెలిసిందే. సినిమా కాన్సెప్ట్ ని ప్రతిబింబించేలా ఈ పోస్టర్ ని డిజైన్ చేశారు. అది బాగా ట్రెండ్ అవుతోంది. మరోవైపు `ది రాజాసాబ్` నుంచి కొత్త పోస్టర్ వచ్చింది. అది కూడా అలరిస్తోంది. మొత్తంగా గురువారం ప్రభాస్ బర్త్ డే ఫ్యాన్స్ కి ఒక పండగ వాతావరణాన్ని తీసుకొచ్చిందని చెప్పొచ్చు.
అయితే కృష్ణంరాజు నటవారసుడిగా సినిమాల్లోకి వచ్చిన ప్రభాస్ ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. భారతీయ సినిమాకి ఒక దిక్సూచీగా నిలిచిన విషయం తెలిసిందే. మున్ముందు ఆయన గ్లోబల్ స్టార్‌గా రాణించబోతున్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే హీరో కాకపోతే ప్రభాస్ ఏం చేసేవాడు, ఏ రంగంలో ఉండేవాడు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ విషయాన్ని ప్రభాస్ వెల్లడించారు. తాను సినిమాల్లోకి రాకపోతే ఏం చేసేవాడో వెల్లడించారు. తన అభిరుచిని చాటుకున్నారు ప్రభాస్.
హీరో కాకపోతే ప్రభాస్ ప్లాన్ ఏంటి? స్వయంగా చెప్పిన డార్లింగ్
ఇంటర్మీడియట్ టైమ్‌లోనే తాను హీరో అనే ఫీలింగ్ కలిగిందట. రెగ్యూలర్‌గా సినిమాల షూటింగ్‌లకు వెళ్తుండటం, పైగా హైట్ ఎక్కువగా ఉండటంతో అంతా హీరో హీరో అంటుంటే తనకు కూడా అలాంటి ఫీలింగ్ కలిగిందని తెలిపారు ప్రభాస్. అంతేకాదు మామయ్య ఎంఎస్ రాజు ఎప్పుడు కలిసినా హీరో హీరో అనేవాడట. అలా తెలియకుండానే తాను హీరో అనేది మనసులో పడిపోయిందట. పైగా ఫ్రెండ్స్ అంతా హీరోహీరో అంటుంటే అది మరింతగా మనసులో నాటుకుపోయిందన్నారు ప్రభాస్. ఆ తర్వాత సత్యానంద్ వద్ద నటనలో శిక్షణ తీసుకున్నారు. అనంతరం `ఈశ్వర్`తో హీరోగా పరిచయం అయిన విషయం తెలిసిందే.
మరి హీరో కాకపోతే ఏం అయ్యేవాడనేదానికి ప్రభాస్ స్పందిస్తూ, నాకు విదేశాలకు వెళ్లి ఎంబీఏ చేయాలనుకున్నాడట. అక్కడ స్టడీ అయిపోయాక ఇండియా వచ్చి ఏదైనా హోటల్‌గానీ, రెస్టారెంట్‌గానీ పెట్టాలనే ప్లాన్‌లో ఉన్నాడట. తాను హీరో కాకపోతే ఈ పనిచేసేవాడిని అని తెలిపారు. ప్రభాస్ భోజన ప్రియుడు అంటారు. అంతేకాదు సినిమా సెట్‌లో ఆర్టిస్టులు, టెక్నీషియన్లకి అన్నిరకాల వంటకాలు తినిపించడం డార్లింగ్‌కి ఇష్టం. ఆయనతో పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్, డైరెక్టర్ ఈ విషయాన్ని చాలా సార్లు తెలిపారు. ఫోటోలు కూడా పంచుకున్న విషయం తెలిసిందే.
భోజన ప్రియుడు ప్రభాస్: అభిమానులకు తెలియని నిజాలు
సినిమా కాకుండా ఇతర వ్యాపకాల గురించి చెబుతూ, తనకు వ్యవసాయం అంటే ఇష్టమని తెలిపారు. భవిష్యత్ లో ఎక్కడైనా మూడు, నాలుగువందల ఎకరాలు కొనుక్కొని చక్కగా వ్యవసాయం చేయాలని ఉందట. అంతేకాదు తొమ్మిదో తరగతి చదువుకునే సమయంలోనే `ఆక్వా కల్చర్`ని చేసినట్టు తెలిపారు. ఇరవై ఏళ్ల వయసులోనే రొయ్యల చెరువు వేసినట్టు తెలిపారు డార్లింగ్. ఆయన ఫ్యాన్స్ ఆసక్తికరంగా మారాయి. గతంలో సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపారు ప్రభాస్.
ప్రభాస్ హీరోగా ఎంత బిజీగా ఉన్నా, తన భోజన ప్రియత్వం, అందరికీ వంటకాలు తినిపించే గుణం ఆయన్ని మరింత ప్రత్యేకంగా నిలుపుతుంది. నటనతో పాటు వ్యాపారం పట్ల ఆసక్తి ఉన్న ప్రభాస్ బహుముఖ ప్రజ్ఞాశాలి అని ఈ వివరాలు స్పష్టం చేస్తున్నాయి.


