
📌 Key Points
- కావ్య కళ్యాణ్‌రామ్, అన్వేష్ మైఖేల్ జంటగా ‘వాట్స్ అప్ నరేష్’ చిత్రం తెరకెక్కుతోంది.
- సివివి సినిమా బ్యానర్‌పై భాగ్యలక్ష్మీ చింత ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
- గ్లింప్స్‌లో హీరో నరేష్ 8 కోట్లు కట్నం కావాలనే డైలాగ్‌తో ఆకట్టుకున్నాడు.
- ప్రేమికుల రోజున ఈ సినిమాకు సంబంధించిన రెండో గ్లింప్స్‌ను విడుదల చేయనున్నారు.
కావ్య కళ్యాణ్‌రామ్, అన్వేష్ మైఖేల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘వాట్స్ అప్ నరేష్’. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. గ్లింప్స్‌లో హీరో కట్నం గురించి మాట్లాడటం ఆసక్తికరంగా మారింది.
‘వాట్స్ అప్ నరేష్’ గ్లింప్స్ విడుదల
Whats Up Naresh Glimpse: యూత్ ఫుల్, కామెడీ, లవ్ ఎంటర్టైనర్ చిత్రాలు ఇప్పుడు థియేటర్లో ఎక్కువగా విజయాన్ని సాధిస్తున్నాయి. యూత్‌ని టార్గెట్ చేసే చిత్రాలకు ఫుల్ డిమాండ్ ఉన్న క్రమంలో తాజాగా అలాంటి ఓ చిత్రమే రూపుదిద్దుకుంటోంది. ‘బలగం’ తర్వాత కావ్య కళ్యాణ్‌రామ్..’కొత్తపోరడు’ తర్వాత అన్వేష్ మైఖేల్ జంటగా రాబోతోన్న చిత్రం ‘వాట్స్ అప్ నరేష్’. సివివి సినిమా బ్యానర్ మీద భాగ్యలక్ష్మీ చింత నిర్మించిన ఈ చిత్రానికి సివి విశాల్ దర్శకత్వం వహించారు. యూత్ ఫుల్, లవ్ ఎంటర్టైనర్‌గా రానున్న ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్‌ను రిలీజ్ చేసి ఒక్కసారిగా అందరి దృష్టిని తమ వైపుకు తిప్పుకున్నారు.
Read also- Rakshit Shetty: రష్మిక మాజీ ప్రియుడి గురించి కీలక విషయాలు బయటపెట్టిన స్టార్ హీరోయిన్.. అర్థరాత్రి 2 గంటలకు గొడవ అంటూ..!
కట్నం డైలాగ్‌తో ఆకట్టుకున్న నరేష్
‘వాట్స్ అప్ నరేష్’ గ్లింప్స్‌ని గమనిస్తే నరేష్ పాత్రలో అన్వేష్ మైఖేల్ చిల్ గాయ్‌లా కనిపిస్తున్నాడు. ఎనిమిది కోట్లు కట్నం ఇస్తే ఎన్ని కాలాలు అయినా వెయిట్ చేస్తా అనే డైలాగ్‌తో అతని పాత్రని పరిచయం చేశాడు. ఇక సాఫ్ట్ వేర్ లైఫ్, ప్రేమ, ఫ్యామిలీ ఇలా అన్ని రకాల అంశాల్ని జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టుగా కనిపిస్తోంది. ఇక చివర్లో సింపుల్‌గా హాయ్ అంటూ హీరో, హీరోయిన్ల పాత్రల పరిచయం కూడా కొత్తగా, ఫ్రెష్‌గా అనిపిస్తోంది. ఇక గ్లింప్స్ బ్యాక్ గ్రౌండ్ లో వినిపించిన ‘లోకం తీరింతే.. నువ్వే మారాలంతే.. లొల్లె ఒద్దంటే.. తెలివిని కప్పెట్టంతే’ అనే లిరిక్స్ సినిమా కథని, హీరో పాత్రను తెలియజేసేలా ఉన్నాయి.
Read also- O Romeo OTT : షాహిద్ కపూర్ – త్రిప్టీ దిమ్రీ మూవీకి కోర్టులో ఊరట… థియేట్రికల్ రన్ తరువాత ఈ ఓటీటీలోనే స్ట్రీమింగ్
ప్రేమికుల రోజున రెండో గ్లింప్స్ రిలీజ్
రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా రాబోతోన్న ఈ చిత్రానికి స్మరణ్ సాయి సంగీతాన్ని అందిస్తున్నారు. విప్లవ్ నైషదం ఎడిటర్‌గా పని చేస్తున్నారు. వేదరామన్ శంకరన్ కెమెరామెన్‌గా వర్క్ చేస్తున్నారు. ప్రేమికుల రోజున ఈ మూవీకి సంబంధించిన రెండో గ్లింప్స్‌ని రిలీజ్ చేయబోతోన్నారు.
మొత్తానికి ‘వాట్స్ అప్ నరేష్’ గ్లింప్స్‌తో సినిమాపై ఆసక్తి పెరిగింది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.


