
📌 Key Points
- వాట్సాప్ ప్లస్ సబ్‌స్క్రిప్షన్ ద్వారా అదనపు ఫీచర్లు పొందవచ్చు.
- ప్రస్తుతం 3 చాట్‌లను పిన్ చేయవచ్చు, ప్రీమియంతో 20 వరకు పిన్ చేసుకోవచ్చు.
- కస్టమైజ్డ్ యాప్ ఐకాన్లు, స్టిక్కర్లు, రింగ్‌టోన్‌లు ప్రీమియం యూజర్లకు అందుబాటులో ఉంటాయి.
- ఈ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు అందుబాటులో ఉంటుంది.
వాట్సాప్ యూజర్ల కోసం సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ రాబోతోంది. దీని ద్వారా యూజర్లు అదనపు ఫీచర్లను పొందవచ్చు. ఈ ప్లాన్ తీసుకుంటే ఎక్కువ చాట్‌లను పిన్ చేసుకోవచ్చు, కస్టమైజ్డ్ ఐకాన్‌లను ఉపయోగించవచ్చు.
వాట్సాప్ ప్లస్: కొత్త ఫీచర్లు ఏంటి?
WhatsApp Plus : వాట్సాప్ యూజర్ల కోసం సరికొత్త ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ రాబోతుంది. అదనపు ఫీచర్లు కోరుకునే యూజర్లు మాత్రమే ఈ ప్రీమియం ప్లాన్ తీసుకోవచ్చు.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
WhatsApp Plus : వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. అతి త్వరలో కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ రాబోతుంది. యూజర్ల కోసం ‘వాట్సాప్ ప్లస్’ పేరుతో కంపెనీ త్వరలో రిలీజ్ చేయనుంది. ప్రస్తుతం ఈ వాట్సాప్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ డెవలప్ స్టేజీలో ఉంది. వినియోగదారులకు అనేక అదనపు ఫీచర్లను అందిస్తుంది.
వాట్సాప్‌లో కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ వస్తుందని చాలా కాలంగా చర్చ జరుగుతోంది. నివేదికల ప్రకారం.. వాట్సాప్ ప్లస్ అనేది ప్రీమియం వాట్సాప్ యూజర్లకు అందుబాటులో ఉంటుంది. యాప్ కస్టమైజడ్, కొత్త చాట్ మెనేజ్‌మెంట్ టూల్స్ కూడా అందిస్తుంది.
సబ్‌స్క్రిప్షన్ తీసుకోవడం ఎలా?
వాట్సాప్ ప్లస్ ప్లాన్ పూర్తిగా ఆప్షనల్ : ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండింటి కోసం ఈ ఫీచర్ డెవలప్ అవుతోంది. అతి త్వరలోనే ఈ వాట్సాప్ ప్లస్ అందరికి అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. వాస్తవానికి ఈ ఫీచర్ పూర్తిగా ఆప్షనల్. రెగ్యులర్ వాట్సాప్ యూజర్లు సబ్‌స్క్రిప్షన్ లేకుండానే వాట్సాప్ వాడుకోవచ్చు. యాప్ మెయిన్ యాక్టివిటీలో ఎలాంటి మార్పు ఉండదు. ఈ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోవడం ద్వారా వాట్సాప్ యూజర్లు అదనపు ఫీచర్లు యాక్సస్ చేసుకోవచ్చు.
కానీ, యాప్ మెయిన్ యాక్టివిటీ, మెసేజింగ్, ఆడియో-వీడియో కాల్స్, మీడియా షేరింగ్ వంటివి ఫ్రీగా పొందవచ్చు. కంపెనీ ఇంకా ఫీచర్లు, ధర లేదా లాంచ్ టైమ్‌లైన్‌ను ప్రకటించలేదు. కానీ, సబ్‌స్క్రైబర్లు కస్టమైజడ్, యాప్ ఎక్స్‌పీరియన్స్ ఫీచర్‌లను అందుకుంటారని భావిస్తున్నారు.
Read Also : Nothing Phone 4a Series : కిర్రాక్ ఫోన్లు భయ్యా.. నథింగ్ ఫోన్ 4a సిరీస్ వచ్చేసిందోచ్.. ఫీచర్లు చూస్తే ఫిదానే, ఈ నెల 13 నుంచే ఫస్ట్ సేల్..!
సాధారణ యూజర్లకు మార్పులేమీ ఉండవా?
అదనపు ఫీచర్లు ఇవే : వాట్సాప్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్న యూజర్లు ఎక్కువ మొత్తంలో చాట్ పిన్ చేసుకోవచ్చు. ప్రస్తుతం, వాట్సాప్‌లో 3 చాట్‌లను పిన్ చేసేందుకు వీలుంది. కానీ, పేమెంట్ యూజర్లు 20 వరకు పిన్ చేయగలరు.
పేమెంట్ యూజర్లు 14 విభిన్న యాప్ ఐకాన్లు, ట్యాబ్‌లు, బటన్, ఫిల్టర్ కలర్ మార్పులు, స్పెషల్ స్టిక్కర్లు, కస్టమ్ రింగ్‌టోన్‌లు, ఇంటరాక్టివ్ మెసేజ్ రియాక్షన్లపై కూడా యాక్సెస్ పొందుతారు. ఒకసారి రిలీజ్ అయ్యాక యూజర్ల అభిప్రాయం ఆధారంగా కొత్త ఫీచర్‌లను యాడ్ చేయొచ్చు.
వాట్సాప్ నోటిఫికేషన్ వెయిట్‌లిస్ట్‌ను కూడా టెస్టింగ్ చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌పై వాట్సాప్ పనిచేస్తోంది. ఈ వెయిట్‌లిస్ట్‌లో చేరిన యూజర్లకు ప్రీమియం ప్లాన్ అందుబాటులోకి రాగానే నోటిఫికేషన్ వస్తుంది.
వాట్సాప్ ప్లస్ సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే అదనపు ఫీచర్లను ఆస్వాదించవచ్చు. త్వరలో మరిన్ని ఫీచర్లను జోడించే అవకాశం ఉంది. వేచి చూడండి!


