|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విజయ్ గెలుపు రహస్యం: ఆ స్టార్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు ఎవరు?

Published: 05-05-2026, 12:00 PM
విజయ్ గెలుపు రహస్యం: ఆ స్టార్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు ఎవరు?
  • తమిళనాడులో విజయ్ టీవీకే పార్టీ చారిత్రాత్మక విజయం సాధించింది.
  • ఈ గెలుపు వెనుక ప్రధాన వ్యూహకర్త కపిల్ సాహు పేరు మారుమోగుతోంది.
  • కపిల్ సాహు గతంలో ప్రశాంత్ కిషోర్ ఐపాక్‌లో దశాబ్దకాలం పనిచేశారు.
  • గ్రౌండ్ లెవల్, సోషల్ మీడియా వ్యూహాలతో టీవీకేను విజయపథంలో నడిపారు.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ అద్భుత విజయం సాధించింది. ఈ చారిత్రాత్మక గెలుపు వెనుక ఒక వ్యూహకర్త కృషి ఉందని తెలుస్తోంది. ప్రశాంత్ కిషోర్ శిష్యుడిగా పేరుపొందిన కపిల్ సాహు, తన వ్యూహాలతో టీవీకేను ఎలా గెలిపించాడో ఈ కథనంలో చూద్దాం.

కపిల్ సాహు: ఐపాక్ నుండి స్టార్ స్ట్రాటజిస్ట్ గా

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌య్ పార్టీ టీవీకే చారిత్రాత్య‌క విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. దేశ‌మంతా ఇప్పుడు విజ‌య్ గెలుపు గురించే చ‌ర్చించుకుంటోంది. అయితే సాధార‌ణంగా గ‌త కొన్నేళ్లుగా ఎన్నిక‌ల స‌మ‌యంలో వ్యూహ‌క‌ర్త‌ల‌ను క్యాంపెయినింగ్ కోసం నియ‌మించుకోవ‌డం కామ‌న్ అయిపోయింది. వ్యూహ‌క‌ర్త ప‌నితీరు బాగుంటే ఎన్నిక‌ల్లో పార్టీ విజ‌యం సాధించిన త‌ర‌వాత వారి పేరు మారుమోగిపోతుంది. ప్ర‌స్తుతం ప్ర‌శాంత్ కిషోర్ దేశ‌వ్యాప్తంగా పాపుల‌ర్ కాగా సునీల్ క‌నుగోలు పేరు కూడా అక్క‌డ‌క్క‌డా వినిపిస్తూ ఉంటుంది. ఇక టీవీకే విజ‌యంతో మ‌రో కొత్త వ్యూహ‌క‌ర్త పేరు వెలుగులోకి వ‌చ్చింది. టీవీకే విజ‌యానికి ప్ర‌ధాన కార‌కుడిగా, వ్యూహ‌క‌ర్త‌గా క‌పిల్ సాహు పేరు ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో మారుమోగుతోంది. దీంతో ఎవ‌రా సాహు అని నెటిజ‌న్లు తెగ వెతికేస్తున్నారు. క‌పిల్ సాహు ప్ర‌ముఖ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ స్థాపించిన ఐపాక్‌లో పనిచేశారు.

ఐపాక్ లో దశాబ్దకాలం పాటు రాజకీయ ప్రచారాలు, డేటా అనాలిసిస్, వ్యూహరచనలో అనుభవం సంపాదించుకున్నారు. ఐపాక్ నుండి బయటకు వచ్చిన తరవాత సొంతంగా 12 మంది సహచరులతో కలిసి పొలిటికల్ కన్సల్టెన్సీని ప్రారంభించారు. కపిల్ సాహు టీవీకే కంటే ముందు ఆమ్ ఆద్మీలో రాఘవ్ చద్దా కోసం, సిక్కిం ఎన్నికల్లో డెమోక్రటిక్ ఫ్రంట్ కోసం పనిచేశారు. పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ కోసం కూడా పనిచేశారు. ఇక టీవీకే కొత్త పార్టీ అయినప్పటికీ తన వ్యూహాల రెండేళ్లలోనే డీఎంకే, ఏఐడీఎంకే లాంటి పార్టీలను ఎదుర్కొనేలా సాహు పనిచేశారు. గ్రౌండ్ లెవల్ ఆపరేషన్స్ మాత్రమే కాకుండా సోషల్ మీడియా ప్రచారాల్లోనూ సమర్దవంతంగా పనిచేస్తూ ప్రజల్లోకి పార్టీని తీసుకువెళ్లడంలో సక్సెస్ అయ్యారు. నిజానికి విజయ్ మొదట ప్రశాంత్ కిషోర్ టీంను ప్రచారం కోసం సంప్రదించాలని అనుకున్నారట. కానీ కపిల్ సాహు వ్యూహాలు చూసిన తరవాత ఆయనవైపే మొగ్గుచూపినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం టీవీకే విజయంతో స్టార్ స్ట్రాటజిస్ట్ అంటూ కూడా సాహు ప్రశంసలు అందుకుంటున్నారు.

టీవీకే విజయం వెనుక సాహు వ్యూహాలు

ప్రశాంత్ కిషోర్ బదులు సాహు ఎంపిక ఎందుకు?

కపిల్ సాహు వ్యూహరచన, ప్రణాళికాబద్ధమైన కృషి టీవీకే పార్టీకి విజయాన్ని అందించింది. స్టార్ స్ట్రాటజిస్ట్ గా ఆయన పేరు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది. భవిష్యత్తులో ఆయన పాత్ర మరింత కీలకం కానుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.