|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మహిళల నిద్రకు శత్రువులేవరు? పురుషుల కంటే ఆలస్యంగా నిద్రించడానికి కారణాలివేనా?

Published: 18-04-2026, 7:05 AM
మహిళల నిద్రకు శత్రువులేవరు? పురుషుల కంటే ఆలస్యంగా నిద్రించడానికి కారణాలివేనా?
  • మహిళల్లో హార్మోన్ల హెచ్చుతగ్గులు నిద్రకు ఆటంకం కలిగిస్తాయి.
  • రుతుక్రమం, మెనోపాజ్ సమయంలో నిద్రలేమి సమస్యలు వస్తాయి.
  • పురుషులతో పోలిస్తే మహిళల్లో ఆందోళన, కుంగుబాటు ఎక్కువ.
  • ఇంటి పనుల బాధ్యతల వల్ల మహిళల మెదడు నిరంతరం అప్రమత్తంగా ఉంటుంది.

ఆడవారి ఆరోగ్యంపై పలు అంశాలు ప్రభావం చూపుతాయి. పురుషులతో పోలిస్తే మహిళలు నిద్రించడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు. డాక్టర్ క్రిస్టోఫర్ జె. అలెన్ మహిళల నిద్రకు ఆటంకం కలిగించే కారణాలను విశ్లేషించారు.

హార్మోన్ల ప్రభావం: నిద్రపై ముఖ్య పాత్ర

Women Sleep Health : ఆడవారిలోని జీవక్రియలు మగవారికి భిన్నంగా ఉంటాయి. అడవాళ్ల ఆరోగ్యంపై పలు అంశాలు ప్రభావం చూపిస్తాయి. ఇందులో భాగంగా నిద్ర విషయంలోనూ తేడాలుంటాయి. మహిళలతో పోల్చితే మగవారు వేగంగా నిద్రపోతారని.. మగవారితో పోలిస్తే ఆడవారు త్వరగా నిద్రపోలేరంట..! ఆడవారిలో నిద్ర నాణ్యత కూడా తక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.

ఇదే అంశాన్ని ప్రముఖ నిద్ర నిపుణులు, పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ క్రిస్టోఫర్ జె. అలెన్ విశ్లేషిస్తూ… మహిళల నిద్రకు ఆటంకం కలిగించే ఆసక్తికరమైన కారణాలను పంచుకున్నారు. హార్మోన్ల హెచ్చుతగ్గుల నుంచి వారు మోసే ‘మెంటల్ లోడ్’ వరకు నిద్రపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వివరించారు.

మహిళల శరీరంలో హార్మోన్ల వ్యవస్థ చాలా సంక్లిష్టంగా ఉంటుంది. ముఖ్యంగా ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ అనే రెండు హార్మోన్లు నిద్ర చక్రాన్ని శాసిస్తాయి. “మగవారిలో నిద్రకు సంబంధించిన హార్మోన్లు స్థిరంగా ఉంటాయి. కానీ ఆడవారిలో ప్రతి నెలా వచ్చే రుతుచక్రం వల్ల ఈ హార్మోన్లు మారుతుంటాయి” అని డాక్టర్ అలెన్ వివరించారు. నెలసరి రావడానికి ముందు ప్రొజెస్టెరాన్ స్థాయిలు హఠాత్తుగా తగ్గిపోతాయి. దీనివల్ల గాఢ నిద్ర ఉండదు… మధ్య మధ్యలో మెలకువ వస్తుంటుంది. అలాగే మెనోపాజ్ సమయంలో ఈస్ట్రోజెన్ తగ్గిపోవడం వల్ల సరిగా నిద్రపోలేరు. ఫలితంగా వారు రాత్రంతా నిద్రలేమితో ఇబ్బంది పడాల్సి వస్తుంది.

ఆందోళన, కుంగుబాటు: నిద్రలేమికి కారణమా?

మగవారితో పోలిస్తే ఆడవారిలో ఆందోళన , కుంగుబాటు వంటి సమస్యలు వచ్చే అవకాశం రెట్టింపుగా ఉంటుంది. ఇది నేరుగా వారి నిద్ర నాణ్యతపై దెబ్బకొడుతుంది. ఆందోళన వల్ల నిద్ర సరిగ్గా పట్టదు, నిద్ర లేకపోవడం వల్ల ఆందోళన మరింత పెరుగుతుంది. ఇదొక విషవలయంలా మారుతుంది. “ఒకే రకమైన ఒత్తిడి ఎదురైనప్పుడు మగవారు 10 నిమిషాల్లోనే నిద్రలోకి జారుకోగలరు. కానీ మహిళల మెదడు మాత్రం ఎప్పుడూ అప్రమత్తంగా ఉండి ఆలోచనల వలయంలో చిక్కుకుంటుంది,” అని డాక్టర్ క్రిస్టోఫర్ స్పష్టం చేశారు.

మన సమాజంలో పిల్లల సంరక్షణ లేదా ఇంటి పనుల బాధ్యత అధికంగా మహిళలపైనే ఉంటుంది. రాత్రిపూట పాప ఏడుస్తుందేమోనని ఒక చెవి అప్రమత్తంగా ఉంచడం, రేపటి పిల్లల స్కూల్ షెడ్యూల్స్, భోజనాల గురించి ఆలోచించడం వంటివన్నీ వారి మెదడును శాంతింపజేయవు. దీనివల్ల వారి మెదడు ‘సెమీ-అలెర్ట్’ స్థితిలో ఉండిపోతుంది. ఫలితంగా వారు గాఢ నిద్రకు దూరం కావాల్సి వస్తుంది.

మెంటల్ లోడ్: మహిళల నిద్రకు ఆటంకం

భారతీయ కుటుంబాల్లో చూసుకుంటే…. ఉద్యోగం చేసే మహిళలకు ఈ భారం మరింత ఎక్కువగా ఉంటుంది. ఆఫీసు పనులతో పాటు ఇంటి నిర్వహణ బాధ్యతలు తోడవడంతో వారి మెదడు నిరంతరం పని చేస్తూనే ఉంటుంది. అందుకే, మహిళలకు నిద్ర లేకపోవడమనేది కేవలం ఒక అలవాటు కాదు, అది వారి జీవనశైలి, శారీరక మార్పులతో ముడిపడి ఉన్న తీవ్రమైన అంశమని మనం గుర్తించాలని డాక్టర్ క్రిస్టోఫర్ జె. అలెన్ చెబుతున్నారు.

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More

మొత్తానికి, మహిళలు ఎదుర్కొనే అనేక సమస్యల వల్ల నిద్ర నాణ్యత తగ్గుతుంది. ఈ విషయాలపై అవగాహన పెంచుకుని సరైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.