
📌 Key Points
- మహారాష్ట్రలో రెండో పెళ్లి కోసం కన్న బిడ్డను చంపిన తల్లి.
- భర్త ఫిర్యాదుతో అసలు విషయం వెలుగులోకి.
- మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు, కేసు నమోదు.
- విచారణలో నేరం అంగీకరించిన నిందితురాలు.
మహారాష్ట్రలో ఒక దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒక మహిళ తన రెండో పెళ్లి కోసం సొంత బిడ్డనే చంపేసింది. ఈ విషయం ఆమె మొదటి భర్త ఫిర్యాదు చేయడం వల్ల బయటపడింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
రెండో పెళ్లి కోసం కన్న బిడ్డను చంపిన తల్లి
వారిద్దరికీ పెద్దలు పెళ్లిచేశారు. కాపురానికి గుర్తుగా.. ఓ పిల్లాడు కూడా పుట్టాడు. ఆ సమయంలో ఆమెకు మరో పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించాలన్న కోరిక పుట్టింది. అందుకు తన 11 నెలల కొడుకే అడ్డమనుకుని చంపేసింది. ఇంట్లో ఉన్న డబ్బులు తీసుకుని పారిపోయి.. మరో పెళ్లి కూడా చేసేసుకుంది. ఈ విషయం తెలిసిన మొదటి భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది.
భర్త ఫిర్యాదుతో వెలుగులోకి నేరం
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 22 ఏళ్ల నిందితురాలికి అదే ప్రాంతానికి చెందిన వ్యక్తితో పెద్దలు మూడేళ్ల క్రితం పెళ్లిచేశారు. ఒక పిల్లాడికి జన్మనిచ్చింది. కానీ భర్తంటే ఇష్టంలేని ఆమె.. మరో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయింది. కానీ.. సమయం కోసం వేచి చూసింది. మార్చి 4వ తేదీన భర్త, బిడ్డతో కలిసి కొంకణ్ లో టూర్ కు వెళ్లింది. కొడుకు చిరాకుతో పదే పదే ఏడుస్తుండగా.. అసహనం వ్యక్తం చేసింది. ఇంటికి వచ్చాక ఆస్పత్రికి తీసుకెళ్లమని అడగ్గా.. పట్టించుకోకుండా బయటికి వెళ్లిపోయాడు. ఆగ్రహంతో మార్చి 8న 11 నెలల కొడుకుని చంపేసి, మృతదేహాన్ని బావిలో పడేసింది.
పోలీసుల విచారణలో నిజం అంగీకరించిన నిందితురాలు
ఇంట్లో భర్త దాచి ఉంచిన డబ్బు తీసుకుని పారిపోయి.. ఓ కొత్త ఫోన్ కొని, మ్యారేజ్ ఏజెంట్ ద్వారా మరో పెళ్లి చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న భర్త.. ఆమె దగ్గరకు వెళ్లి తన బిడ్డను ఇవ్వాల్సిందిగా అడిగాడు. సరిగా స్పందించకపోవడంతో.. అనుమానం కలిగి రంజన్ గావ్ పీఎస్ లో ఫిర్యాదు చేశాడు. ఏప్రిల్ 5న మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా.. బిడ్డ ప్రమాదవశాత్తు చనిపోవడంతో బావిలో పడేశానని తెలిపింది. బావిలో నుంచి బిడ్డ మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టానికి పంపిన పోలీసులు.. మరోసారి మహిళను నిలదీయడంతో.. తాను చేసిన నేరాన్ని అంగీకరించింది. ఆ తర్వాత పోలీసులు ఆమెను జైలుకు పంపారు.
మొత్తానికి రెండో పెళ్లి మోజులో కన్న బిడ్డను చంపుకున్న ఆ తల్లి ఉదంతం అత్యంత విషాదకరమైనది. ఇలాంటి ఘటనలు సమాజంలో జరుగుతున్న నేరాలకు అద్దం పడుతున్నాయి. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను తెలియజేయండి.


