
కోలీవుడ్ నటి, గాయని ఆండ్రియా తన బహుముఖ ప్రజ్ఞను చాటుతూ ఐసీసీ మహిళా క్రికెట్ క్రీడాకారుల కోసం ఒక ప్రత్యేక గీతాన్ని రూపొందించారు. ‘బ్రింగ్ ఇట్ హోమ్’ పేరుతో విడుదల కానున్న ఈ ఆంథమ్, మహిళా ప్రపంచకప్ ఫైనల్ సందర్భంగా నవంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది మహిళల క్రీడాస్ఫూర్తిని ప్రోత్సహించనుంది.
Key Points
నటి ఆండ్రియా నటిగా మాత్రమే కాకుండా, గాయనిగా, గీత రచయిత్రిగా గుర్తింపు పొందారు.
ఐసీసీ మహిళా క్రికెట్ క్రీడాకారుల కోసం 'బ్రింగ్ ఇట్ హోమ్' అనే గీతాన్ని రాసి, పాడారు.
క్రీడాకారుల ధైర్యం, ఆసక్తి, పట్టుదలను ఆవిష్కరించేలా హైఎనర్జిటిక్‌గా ఈ పాట రూపొందింది.
నవంబర్ 2న జరగనున్న మహిళా క్రికెట్ ప్రపంచకప్ తుది పోరు సందర్భంగా ఈ గీతం విడుదల కానుంది.
ఆండ్రియా బహుముఖ ప్రజ్ఞ: నటి, గాయని, రచయిత్రి
కోలీవుడ్‌లో ఎలాంటి పాత్ర ఇచ్చినా సరే నటి ఆండ్రియా( Andrea Jeremiah) ఓకే చెప్పేస్తుంది. కానీ, మొదట తనకు నచ్చాలి. తనకు నచ్చితే చాలు ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగలదు. ఆమె నటి మాత్రమే కాదు మంచి గాయని, గీత రచయిత కూడా.. సంగీత పరిజ్ఞానం కలిగిన ఆండ్రియా బహుభాషా నటిగా గుర్తింపు పొందింది. ఈమె పాడిన పలు పాటలు సింగీతప్రియులను అలరించాయి. కాగా తాజాగా ఆండ్రియా ఐసీసీ మహిళా క్రికెట్ క్రీడాకారులను ప్రోత్సహించేలా, కీర్తించే విధంగా ఒక ఆంథమ్‌ను రాసి పాడారు.
మహిళా ప్రపంచకప్ కోసం ‘బ్రింగ్ ఇట్ హోమ్’ గీతం
ఐసీసీ మహిళా క్రికెట్ క్రీడాకారులు 2025 టీమ్ కోసం బ్రింగ్ ఇట్ హోమ్ పేరుతో రూపొందించిన ఆంగ్ల ఆంథం ఇది. క్రీడాకారుల ధైర్యం, ఆసక్తి, పట్టుదలను ఆవిష్కరించేలా మంచి రిథమ్, మెలోడీ, ఎమోషన్‌తో కూడిన హైఎనర్జిటిక్‌గా రూపొందిన ఈ పాటను ఆండ్రియా, నజీఫ్ మహ్మద్ కలిసి రాశారు. దీనికి నకుల్ అభయంకర్ సంగీతాన్ని అందించారు. ఆంగ్ల పదాలతో కూడిన ఈ పాటలో తరికిట్ తరికిట తరికిట థోమ్ అనే ఇండియన్ బాణీ హుక్‌తో ధక్‌ధక్ ఉయ్ ‘బ్రింగ్ ఇట్ హోమ్’ ఆనే పల్లవితో సాగే గీతం క్రికెట్ క్రీడాకారుల హృదయ స్పందనను తెలియజేసేలా ఉంటుందన్నారు.
క్రీడాస్ఫూర్తిని చాటిన ఆండ్రియా ప్రత్యేక గీతం
ఈ గీతం నవంబర్ 2న జరగనున్న ప్రపంచ మహిళా క్రికెట్ క్రీడ తుది పోరు సందర్భంగా విడుదల చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ గీతం గురించి ఆండ్రియా తెలుపుతూ ఇది ఒక పాట మాత్రమే కాదని, పెద్దగా కలలు కనడంతోపాటు, కఠినంగా శ్రమించి విజయాన్ని ఇంటికి తీసుకొచ్చే ఒక మహిళ విజయం అని పేర్కొన్నారు.
ఆండ్రియా రూపొందించిన ఈ గీతం మహిళా క్రీడాకారులకు స్ఫూర్తిని నింపడమే కాకుండా, పెద్ద కలలు కనడానికి, కష్టపడి విజయం సాధించడానికి ప్రోత్సహిస్తుంది. ఈ పాట క్రికెట్ ప్రపంచంలో ఒక నూతన ఉత్తేజాన్ని తీసుకువస్తుంది.


