|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: ‘గాయపడ్డ సింహం’ చూస్తే తిడతారు! రైటర్ సూర్య ప్రకాష్ సంచలన కామెంట్స్!

Published: 11-02-2026, 8:05 AM
షాకింగ్: 'గాయపడ్డ సింహం' చూస్తే తిడతారు! రైటర్ సూర్య ప్రకాష్ సంచలన కామెంట్స్!
  • తరుణ్ భాస్కర్ హీరోగా ‘గాయపడ్డ సింహం’ మూవీ టీజర్ రిలీజ్, యూత్ ఆడియన్స్‌లో భారీ అంచనాలు!
  • డొనాల్డ్ ట్రంప్ సెటైర్లతో పొలిటికల్ క్రైమ్ కామెడీగా ‘గాయపడ్డ సింహం’ మూవీ అదుర్స్!
  • సూర్య ప్రకాష్ జోశ్యుల కథకు కాశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం, తరుణ్ భాస్కర్ నటన అద్భుతం!
  • ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి హీరోయిన్లుగా ‘గాయపడ్డ సింహం’ మూవీలో గ్లామర్ ట్రీట్!

టాలీవుడ్ లో ఇప్పుడు ఒకటే హాట్ టాపిక్! తరుణ్ భాస్కర్ హీరోగా వస్తున్న ‘గాయపడ్డ సింహం’ మూవీ టీజర్ రిలీజ్ అయింది. సూర్య ప్రకాష్ జోశ్యుల చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

తరుణ్ భాస్కర్ ‘గాయపడ్డ సింహం’ టీజర్ రిలీజ్!

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మరోసారి హీరోగా నటించిన సినిమా గాయపడ్డ సింహం. కాశ్యప్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈసినిమాపై యూత్ ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. డోంట్ లాఫ్… ఇట్స్ ఏ సీరియస్ మేటర్’ అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ చిత్రం, ఒక వైవిధ్యమైన పొలిటికల్ క్రైమ్ కామెడీగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. తాజాగా ఈసినిమా టీజర్ ఈవెంట్‌ ఘనంగా జరిగింది.

పొలిటికల్ సెటైర్స్ తో పాటు క్రైమ్ ఎలిమెంట్స్‌కు కామెడీని జోడించి రూపొందించిన ఈ సినిమాకు మూల కథను సూర్య ప్రకాష్ జోశ్యుల అందించగా .. కాశ్యప్ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. తరుణ్ భాస్కర్ తనదైన శైలిలో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నట్టు టీజర్ చూస్తేనె తెలిసిపోతుంది. అమెరికా వీసా కోసం తపించే యువకుడి పాత్రలో.. పరిస్థితులకు తలవొగ్గని వ్యక్తిగా తరుణ్ కనిపించబోతున్నాడు. ఫరియా అబ్దుల్లా, మానసా చౌదరి వంటి హీరోయిన్లు సినిమాకు మరింత అందం తీసుకొచ్చారు. అంతే కాదు ఈమూవీకి విష్ణు ఓయి కామెడీ హైలెట్ కాబోతోంది.

సూర్య ప్రకాష్ జోశ్యుల వైరల్ కామెంట్స్!

ఈ సినిమాకు మూల కథను అందించిన సూర్య ప్రకాష్ జోశ్యుల మాట్లాడుతూ.. తనదైన స్టైల్ లో సెటైర్లు వేశారు. ” ఈ సినిమాకు మూల కథ అందించినందుకు మూలన కూర్చో బెట్టకుండా పిలిచారు చాలా సంతోషంగా ఉంది. పవన్ గారితో నాకు ముందు నుంచే పరిచయం ఉంది… ఇక తరుణ్ భాస్కర్ గారితో కూడా పరిచయం అవుతందని అనుమానంగా ఉంది. ఫరియా గారితో జాతిరత్నాలు టైమ్ లో కాస్త అనుబంధం ఉంది. ఆ సినిమాకు నేను కో డైరెక్టర్ గా పనిచేశాను. ఇక ఈసినిమా ట్రాంప్ మీద సాగే కథ, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. థియేటర్ లో చూసి ఎంజాయ్ చేస్తారు, నవ్వుకుంటారు. మీ పిల్లల్ని అమెరికా పంపించాలంటే ఆలోచిస్తారు.. నన్ను పక్కాగా తిట్టుకుంటారు.” అని తన మార్క్ సెటైర్లతో సందడి చేశారు సూర్య ప్రకాష్ జోశ్యుల.

ట్రంప్ పై సెటైర్లతో దుమ్మురేపే మూవీ!

తాజాగా విడుదలైన టీజర్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ ను సాధించింది. సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. టీజర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తూనే.. ఒక సీరియస్ విషయాన్ని అందరికి అర్ధం అయ్యేలా చూపించింది. అందరిలో ఒక ఆలోచన కలిగించే విధంగా ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిబంధనల వల్ల ఇబ్బందులకు గురైన యువత ఆవేదనను వివరిస్తూనే.. ట్రంప్ పై సెటైర్లు పేల్చారు. సినిమా టీమ్ ప్రమోషన్స్ విషయంలో కూడా ఎక్కడా తగ్గడం లేదు. ఆడియన్స్ నుంచి వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్‌ను చూస్తుంటే, ‘గాయపడ్డ సింహం’ బాక్సాఫీస్ వద్ద గర్జిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు టీమ్.

గాయపడ్డ సింహం సినిమా టీజర్ ఇప్పటికే ఒక ట్రెండ్ సెట్ చేసింది. సినిమా విడుదల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.