|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: ‘టాక్సిక్’ కథను బయటపెట్టిన యష్! ఇది గ్యాంగ్‌స్టర్ రివేంజ్ డ్రామానా?

Published: 17-04-2026, 2:05 PM
షాకింగ్: 'టాక్సిక్' కథను బయటపెట్టిన యష్! ఇది గ్యాంగ్‌స్టర్ రివేంజ్ డ్రామానా?
  • యష్ ‘టాక్సిక్’ సినిమా గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతోంది.
  • ఈ సినిమా గ్యాంగ్‌స్టర్ కథతో పాటు తండ్రి కొడుకుల ప్రతీకారం కూడా ఉంటుందని యష్ తెలిపారు.
  • గోవా నేపథ్యంలో సాగే రాజకీయ పరిస్థితులు, స్మగ్లింగ్ అంశాలు సినిమాలో ఉంటాయి.
  • ఈ సినిమాలో నయనతార, కియారా అద్వానీ వంటి తారాగణం నటించనున్నారు.

కే జి ఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన యష్, గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో ‘టాక్సిక్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా గ్యాంగ్‌స్టర్ కథతో పాటు తండ్రి కొడుకుల మధ్య రివేంజ్ డ్రామాగా ఉండబోతుందని సమాచారం.

టాక్సిక్ సినిమా కథను లీక్ చేసిన యష్

Yash Toxic Film: కే జి ఎఫ్ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న నటుడు యశ్(Yash) కే జి ఎఫ్ 2 విడుదలయ్యి కూడా దాదాపు నాలుగు సంవత్సరాలు అవుతున్న ఇప్పటివరకు యశ్ నుంచి తదుపరి సినిమా మాత్రం ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఈయన గీతు మోహన దాస్ దర్శకత్వంలో టాక్సిక్ (Toxic)అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే .నిజానికి ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉందిగా కొన్ని కారణాలవల్ల వాయిదా పడుతుంది. ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా గ్లోబల్ రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. మార్చి 19వ తేదీన విడుదల కావాల్సిన ఈ సినిమా యుద్ధం కారణంగా వాయిదా పడింది.

ఇకపోతే ఈ సినిమా కొత్త విడుదల తేది గురించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు దీంతో ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుంది అంటూ అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీ సమాచార ప్రకారం ఈ సినిమా జూన్ 4వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. తాజాగా యశ్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన తన టాక్సీక్ సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు. అంతేకాకుండా ఈ సినిమా కథను కూడా లీక్ చేశారు.

తండ్రి కొడుకుల రివేంజ్ స్టోరీగా టాక్సిక్

టాక్సిక్ సినిమా ఒక గ్యాంగ్ స్టర్ సినిమాగా  ప్రేక్షకుల ముందుకు రాబోతుందని అందరూ భావించారు. అయితే ఈ సినిమా కేవలం గ్యాంగ్ స్టర్ సినిమా మాత్రమే కాదని ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ లో తండ్రి కొడుకుల మధ్య ఒక ప్రతీకార సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని యష్ తెలిపారు. అయితే రామాయణ సినిమాకు ఇది పూర్తిగా విభిన్నంగా ఉండబోతుందని తెలియజేశారు. గోవాలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా రాబోతుందని తెలుస్తుంది. సాధారణంగా గ్యాంగ్ స్టర్ సినిమాలు అంటే ముంబై లేదా కలకత్తా బ్యాక్ డ్రాప్  లో ఉంటాయి కానీ ఈ సినిమా చాలా విభిన్నంగా గోవా బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో సినిమా పట్ల మంచి అంచనాలే ఉన్నాయి.

జూన్ 4న టాక్సిక్ విడుదల కానుందా?

గోవా బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్ డ్రామా

ఇక ఈ సినిమాలో యష్ రాయ్ అనే పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, తారా సుతారియా, హుమా ఖురేషి, దిశా పటాని వంటి తదితరులు కీలకపాత్రలో కనిపించబోతున్నారు. ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ఇప్పటికే భారీగా అంచనాలు ఉన్నాయి. మరి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు అనుగుణంగానే ఈ సినిమా నాలుగో తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోందా లేదంటే మరింత ఆలస్యంగా విడుదల కానుందా అనే విషయాలు తెలియాల్సి ఉంది.

మొత్తానికి యష్ ‘టాక్సిక్’ సినిమా గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో తండ్రి కొడుకుల రివేంజ్ డ్రామాగా ఉండబోతుంది. గోవా బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.