
ప్రముఖ తెలుగు యూట్యూబర్ పూలచొక్కా నవీన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వర్జిన్ బాయ్స్ సినిమా నిర్మాత ఇచ్చిన ఫిర్యాదుతో ఈ అరెస్ట్ జరిగినట్లు సమాచారం. నవీన్ ఇటీవల సినిమాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆరోపణలున్నాయి.
Key Points
యూట్యూబర్ పూలచొక్కా నవీన్ పోలీసుల అదుపులోకి
వర్జిన్ బాయ్స్ సినిమా నిర్మాత రాజా దారాపునేని ఫిర్యాదు
నెగటివ్ రివ్యూలు ఇచ్చారనే ఆరోపణ
సినిమాకు నష్టం కలిగించారనే ఆరోపణ
పోలీసుల అరెస్ట్
దిశ, వెబ్ డెస్క్: తెలుగు యూట్యూబర్ పూలచొక్కా నవీన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నవీన్ పై వర్జిన్ బాయ్స్ సినిమా నిర్మాత రాజా దారపునేని ఇచ్చిన ఫిర్యాదుతో అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నవీన్ పై రాజా దారపునేని సంచలన ఆరోపణలు చేశారు. తాము థియేటర్లలో సినిమాను ప్రేక్షకులతో కలిసి చూసినప్పుడు వాళ్లు ఎంతో ఎంజాయ్ చేయడం చూశామన్నారు. కానీ పూలచొక్కా నవీన్ లాంటి యూట్యూబర్లు డబ్బులు డిమాండ్ చేసి ఇవ్వకపోతే పగబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు. కావాలని సినిమాను డ్యామేజ్ చేసే విధంగా నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారని చెప్పారు. కొందరు సినిమా విడుదలకు మందే నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని అలాంటి వాళ్లపై ఫిల్మ్ ఛాంబర్ లో ఫిర్యాదు చేశామన్నారు. పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేశామని లీగల్ గా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నిర్మాత ఫిర్యాదు
నెగటివ్ రివ్యూ వివాదం
వర్జిన్ బాయ్స్ సినిమాపై నెగటివ్ రివ్యూ ఇచ్చినందుకు పూలచొక్కా నవీన్ పై పోలీసుల చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటన తెలుగు సినీ పరిశ్రమలో చర్చనీయాంశమైంది.


