
📌 Key Points
- ఈ వారం థియేటర్లలోకి ఏకంగా 16 సినిమాలు రాబోతున్నాయి.
- గతవారం నందమూరి అభిమానులు ఎదురుచూసిన అఖండ 2 వాయిదా పడింది.
- రోషన్ కనకాల హీరోగా తెరకెక్కిన ‘మోగ్లీ’ సినిమా డిసెంబర్ 12న విడుదల.
- ‘కామ అండ్ డిజిటల్ సూత్రాస్’, హారర్ థ్రిల్లర్ ‘ఈషా’ కూడా డిసెంబర్ 12న రిలీజ్.
ఈ వారం థియేటర్లలో సందడి ఎక్కువగా ఉండనుంది. ప్రేక్షకుల ముందుకు ఏకంగా 16 సినిమాలు రాబోతున్నాయి. అందులో రోషన్ కనకాల ‘మోగ్లీ’, యూత్‌ని ఆకట్టుకునే ‘కామ అండ్ డిజిటల్ సూత్రాస్’ వంటి రెండు చిత్రాలపై ఆసక్తి నెలకొంది. ఈ రిలీజ్‌ల పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఈ వారం విడుదలవుతున్న 16 సినిమాలు
Upcoming Movies in Theater : ప్రతి నెల థియేటర్లలోకి చాలా సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి.. అందులో ఒక్కోవారం సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తుంటాయి.. ఈవారం కూడా చాలా సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. డిసెంబర్ మొదటి వారము మూవీ లవర్స్ ని నిరాశపరిచిందనే చెప్పాలి.. నందమూరి అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూసిన అఖండ 2 మూవీ వాయిదా పడింది.. మొదటివారం సినిమాలు పెద్దగా రిలీజ్ కాలేదు. రెండో వారం సినిమాలు సందడి కాస్త ఎక్కువగానే ఉంది.. ఒకేరోజు ఏకంగా 16 సినిమాలు ప్రేక్షకులను పలకరించడానికి రెడీగా ఉన్నాయి.. ఆ సినిమాలు ఏవి? అందులో ఇంట్రెస్టింగ్ గా ఏ మూవీస్ ఉన్నాయో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
కామ అండ్ డిజిటల్ సూత్రాస్- 12
అన్నగారు వస్తారు- 12(డబ్బింగ్)
లాక్ డౌన్ – 12( డబ్బింగ్)
ఆసక్తి రేపుతున్న మోగ్లీ సినిమా
ఎవడి సినిమా కి వాడే హీరో -13
యాంకర్ సుమ కొడుకు రోషన్ కనకాల హీరోగా కలర్ ఫోటో సినిమాతో నేషనల్ అవార్డ్ ను అందుకున్న డైరెక్టర్ సందీప్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మోగ్లీ.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో రోషన్ సరసన సాక్షి మండోద్కర్ జంటగా నటిస్తున్నారు.. ఇటీవల ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. దాంతో ఈ మూవీపై అంచనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. డిసెంబర్ 12న థియేటర్లలో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతుంది.
నందు హీరోగా నటిస్తున్నాడు. యామినీ భాస్కర్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ వచ్చే వారం అంటే 12న విడుదల కాబోతోంది. గత కొన్నేళ్లుగా సరైన హిట్ సినిమాలేని నందు ఈ సినిమాతో కచ్చితంగా హిట్ కొడతాడని అనిపిస్తుంది. ఈ మూవీ నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ అన్ని కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి.
డిసెంబర్ 12న రిలీజ్ అవుతున్న హారర్ థ్రిల్లర్ ‘ఈషా’
ఎన్.హెచ్. ప్రసాద్ దర్శకత్వం వహిస్తూ, సుమలీల సినిమా బ్యానర్‌పై నిర్మించిన సినిమా ‘కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్’. వినయ్ వర్మ, తమేశ్వరయ్య అక్కల, చంద్రకళా ఎస్, అర్జున్ వంటి వాళ్లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా కూడా యూత్ని బాగా ఆకట్టుకునేలా కనిపిస్తుంది. డిసెంబర్ 12న థియేటర్లలోకి రాబోతుంది.
ఇదొక హారర్ మూవీ..హెచ్‌వీఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు నిర్మిస్తున్న హారర్ థ్రిల్లర్ మూవీ ఈషా.. ఇప్పటివరకు రిలీజ్ అయిన టీజర్లు, ట్రైలర్ ప్రేక్షకులను బాగా భయపెట్టించేసాయి. ఈ మూవీ కూడా భారీ అంచనాలతో ఈ నెల 12న థియేటర్లలోకి రాబోతుంది..
ఇవే కాదు లాక్ డౌన్, సకుటుంబానాం సినిమాలు కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నాయి. అతనికి డిసెంబర్ 12న 16 సినిమాలు థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ సినిమాలలో ఏ సినిమా బాక్సాఫీస్ విన్నర్గా నిలుస్తుందో చూడాలి.
మొత్తంగా, ఈ వారం థియేటర్లలో పలు రకాల సినిమాలు విడుదలవుతున్నాయి. కొన్ని చిత్రాలపై ఇప్పటికే మంచి అంచనాలున్నాయి. ఈ సినిమాల్లో ఏవి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయో వేచి చూడాలి.

