
టబు తన కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలను వదులుకున్నారు. వాటిలో ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’, ‘కుచ్ కుచ్ హోతా హై’, ‘బధాయి హో’ వంటి సినిమాలు ఉన్నాయి. ఆమె రిజెక్ట్ చేసిన ఆరు సినిమాలు, వాటి IMDb రేటింగ్స్ ఇప్పుడు చూద్దాం.
Key Points
టబు తన సుదీర్ఘ కెరీర్‌లో అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాలను తిరస్కరించారు.
'మున్నాభాయ్ ఎంబీబీఎస్' (8.1 IMDb)లో గ్రేసీ సింగ్ పాత్ర ఆమెకే మొదట ఆఫర్ చేశారు.
షారుఖ్ ఖాన్ చిత్రాలు 'కుచ్ కుచ్ హోతా హై', 'కభీ అల్విదా నా కెహనా'లను వదులుకున్నారు.
'బధాయి హో', 'లజ్జా', 'మన్' వంటి హిట్ చిత్రాలను కూడా టబు తిరస్కరించారు.
టబు రిజెక్ట్ చేసిన బ్లాక్‌బస్టర్ సినిమాలు
టబు తన సుదీర్ఘ సినిమా కెరీర్‌లో చాలా హిట్ సినిమాల్లో నటించారు. సౌత్ భాషల్లో కాదు.. బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోలందరిని ఆమె కవర్ చేశారు. అయితే కెరీర్ లో టబు చాలా సినిమాలను తిరస్కరించారు. ఆమె రిజెక్ట్ చేసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాయి.
2003లో రిలీజైన బ్లాబ్ బస్టర్ మూవీ ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’లో గ్రేసీ సింగ్ పాత్రకు మొదట టబుని సంప్రదించారు. కానీ ఆమె తిరస్కరించారు. ఈ సినిమా IMDb రేటింగ్ 8.1.
షారుఖ్ ఖాన్ హీరోగా.. 1998లో ‘కుచ్ కుచ్ హోతా హై’ సినిమా రిలీజైంది. ఈ చిత్రంలో రాణి ముఖర్జీ నటించిన పాత్ర కోసం మొదట టబుని అడిగారట నిర్మాతలు. కానీ టబు ఈసినిమా చేయలేదు. . దీనికి IMDbలో 7.5 రేటింగ్ వచ్చింది.
అధిక IMDb రేటింగ్ సాధించిన సినిమాలు
2018లో వచ్చిన ‘బధాయి హో’లో నీనా గుప్తా పాత్రను మొదట టబుకి ఆఫర్ చేశారు. కానీ, ఆమె దాన్ని తిరస్కరించారు. ఈ సినిమాకి IMDbలో 7.9 రేటింగ్ వచ్చింది.
2001లో రిలీజైన ‘లజ్జా’ సినిమాలో మనీషా కోయిరాలా పాత్ర కోసం టబుని సంప్రదించారు. కానీ ఈ పాత్ర చేయడానికి టబు నిరాకరించారు. కానీ ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. దీనికి IMDbలో 6.6 రేటింగ్ వచ్చింది.
టబు వదులుకున్న ముఖ్యమైన పాత్రలు ఏవి?
ఆమిర్ ఖాన్ హీరోగా నటించిన మన్ సినిమా 1999లో ‘రిలీజైంది. ఈ సినిమా మేకర్స్ మొదటి ఛాయిస్ టబు. కానీ, ఆమె రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత ఈ సినిమా మనీషా కోయిరాలాకు దక్కింది. దీని IMDb రేటింగ్ 6.2.
2006లో ‘కభీ అల్విదా నా కెహనా’ సినిమా రిలీజైంది. ఇందులో షారుఖ్ ఖాన్ జోడీగా.. రాణి ముఖర్జీ నటించిన పాత్రను టబుకి ఆఫర్ చేశారు. కానీ, ఆమె ఆ ఆఫర్‌ను తిరస్కరించారు. ఈ సినిమా IMDb రేటింగ్ 6.1.
టబు కెరీర్‌లో కొన్ని పెద్ద హిట్‌లను వదులుకున్నప్పటికీ, ఆమె తనదైన శైలిలో గొప్ప నటిగా నిలిచారు. ఆమె ఎంచుకున్న చిత్రాలు కూడా ఆమెకు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చాయి.


