
📌 Key Points
- నల్ల జీలకర్ర నూనె రోగనిరోధక శక్తిని పెంచుతుంది, వాపులను తగ్గిస్తుంది.
- ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ను అందిస్తుంది, హార్మోన్లను సమతుల్యం చేస్తుంది.
- ఆముదం శరీరంలోని వ్యర్థాలను తొలగించి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
- 40 ఏళ్ల అనుభవంతో డాక్టర్ అలోక్ చోప్రా నూనెల గురించి వివరించారు.
ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ అలోక్ చోప్రా కొన్ని రకాల నూనెలను ఉపయోగించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి వివరించారు. రోగనిరోధక శక్తిని పెంచడానికి, జీర్ణవ్యవస్థను మెరుగుపరచడానికి ఈ నూనెలు ఎలా ఉపయోగపడతాయో ఆయన తెలిపారు.
నల్ల జీలకర్ర నూనె ఉపయోగాలు
“హీలింగ్ ఆయిల్స్ కేవలం తాత్కాలిక ట్రెండ్స్ మాత్రమే కాదు – అవి మన శరీరానికి అండగా నిలిచే శక్తివంతమైన చుక్కలు” అని ఢిల్లీలోని ఆశ్లోక్ హాస్పిటల్ వ్యవస్థాపక డైరెక్టర్, ప్రముఖ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అలోక్ చోప్రా పేర్కొన్నారు.
ఆరోగ్య ప్రయోజనాలు అందించే నూనెలను చాలా మంది ప్రత్యామ్నాయ వైద్యంగా భావిస్తారు. కొందరు వీటిని పూర్తిగా నమ్మితే, మరికొందరు వీటి ప్రభావంపై సందేహాలు వ్యక్తం చేస్తుంటారు. అయితే, మన దైనందిన జీవితంలో కొన్ని రకాల నూనెలను చేర్చుకోవడం వల్ల నిజంగానే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని 40 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న డాక్టర్ అలోక్ చోప్రా స్పష్టం చేశారు. ఇటీవల ఆయన తన ఇన్స్టాగ్రామ్ వేదికగా శరీరానికి మేలు చేసే నూనెల జాబితాను పంచుకుంటూ వాటిని ఎలా వాడాలో వివరించారు.
“రోగనిరోధక శక్తి నుంచి జీర్ణవ్యవస్థ ఆరోగ్యం వరకు, చర్మ సౌందర్యం నుంచి శరీర శక్తి వరకు ప్రతి నూనెకూ ఒక ప్రత్యేక పాత్ర ఉంటుంది. అయితే వాటిని సరిగ్గా ఎలా వాడాలో తెలిసి ఉండాలి. ఎందుకంటే హీలింగ్ ఆయిల్స్ విషయంలో ఎక్కువగా వాడటం కంటే, తెలివిగా వాడటమే ముఖ్యం” అని ఆయన వివరించారు.
ఆయన సూచించిన ఆ 8 రకాల నూనెలు, వాటి ఉపయోగాలు ఇక్కడ చూద్దాం:
ఈ నూనె వల్ల శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలు అందుతాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా శరీరంలో వాపులను తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడానికి కూడా ఇది తోడ్పడుతుంది.
ఎలా వాడాలి: అర టీస్పూన్ నల్ల జీలకర్ర నూనెను గోరువెచ్చని నీటిలో లేదా తేనెలో కలిపి తీసుకోవాలని డాక్టర్ చోప్రా సూచించారు. అయితే, గర్భిణీలు దీనిని అతిగా వాడకూడదు.
ఆరోగ్యకరమైన ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఈ నూనెలో పుష్కలంగా ఉంటాయి. హార్మోన్ల సమతుల్యతను కాపాడటంలో, మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది.
ఎలా వాడాలి: రోజూ ఒక టీస్పూన్ పచ్చి ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ తీసుకోవచ్చు. అయితే, ఈ నూనెను అస్సలు వేడి చేయకూడదు. అలాగే మోతాదుకు మించి తీసుకోకూడదు.
ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ ప్రయోజనాలు
శరీరంలో ఉన్న వ్యర్థాలను బయటకు పంపడానికి (డీటాక్సిఫికేషన్), జీర్ణక్రియను మెరుగుపరచడానికి, కాలేయ ఆరోగ్యానికి ఆముదం ఎంతో సహాయపడుతుంది. మన తెలుగు రాష్ట్రాల్లో పూర్వ కాలం నుండి ఆముదాన్ని ఆయుర్వేద అవసరాల కోసం వాడుతున్నారు.
ఎలా వాడాలి: కొద్దిగా గోరువెచ్చని పాలలో కొన్ని చుక్కల ఆముదం వేసుకుని అప్పుడప్పుడు తీసుకోవచ్చు. అయితే, దీనిని ప్రతిరోజూ వాడకూడదు. అలాగే గర్భిణీలు దీనికి దూరంగా ఉండాలని డాక్టర్ చోప్రా స్పష్టం చేశారు.
మన ఇళ్లలో సాధారణంగా వాడే నువ్వుల నూనె ఎముకలను దృఢంగా మార్చడానికి, చర్మ ఆరోగ్యాన్ని కాపాడటానికి ఎంతో మేలు చేస్తుంది.
ఎలా వాడాలి: దీనిని వంటల్లో వాడుకోవచ్చు. అలాగే ఆయిల్ పుల్లింగ్ (నోటిని పుక్కిలించడం) కోసం, శరీర మర్దనకు ఉపయోగించవచ్చు. అయితే, శరీరం ఎక్కువగా వేడి చేసే స్వభావం ఉన్నవారు దీనిని అతిగా వాడకపోవడం మంచిది.
ఈ నూనె శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడంతో పాటు మెదడు పనితీరును, జీవక్రియను (మెటబాలిజం) వేగవంతం చేయడానికి సహాయపడుతుంది.
ఎలా వాడాలి: ఒక టీస్పూన్ ఎంసీటీ ఆయిల్ ను కాఫీలో లేదా స్మూతీలో కలుపుకుని తాగవచ్చు. అయితే, ప్రారంభంలో దీని వల్ల కడుపులో కొద్దిగా అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. అందుకే తక్కువ పరిమాణంతో ప్రారంభించి నెమ్మదిగా పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు.
వేప నూనెలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది చర్మానికి, తల మాడ ఆరోగ్యానికి చాలా మంచిది.
ఎలా వాడాలి: వేప నూనెను కేవలం బాహ్య అవసరాలకు మాత్రమే వాడాలి. దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ తాగడం లేదా ఆహారంలో కలిపి తీసుకోవడం వంటివి చేయకూడదు.
ఆముదం ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తుంది?
బాదం నూనె శరీరానికి మంచి పోషణను అందిస్తుంది. చర్మం, మెదడు ఆరోగ్యానికి మరియు శారీరక బలానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది.
ఎలా వాడాలి: రోజూ ఒక టీస్పూన్ చొప్పున పచ్చి బాదం నూనెను తాగవచ్చు లేదా మర్దనకు వాడుకోవచ్చు. అయితే, గింజల (నట్స్) వల్ల అలర్జీ వచ్చే వారు దీనికి దూరంగా ఉండాలని డాక్టర్ చోప్రా సూచించారు.
ఉసిరి నూనె శరీరానికి చలువ చేస్తుంది. జుట్టు పెరుగుదలకు, తల మాడ ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుంది.
ఎలా వాడాలి: దీనిని కేవలం తలకు, జుట్టుకు పట్టించడానికి మాత్రమే వాడాలి. ఆహారంగా తీసుకోకూడదు.
(ఈ కథనం కేవలం ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. సోషల్ మీడియాలో ప్రముఖ నిపుణులు పంచుకున్న వివరాల ఆధారంగా దీనిని అందించాం. ఏదైనా వైద్యపరమైన నిర్ణయాలు తీసుకునే ముందు లేదా మీకు ఏదైనా అనారోగ్య సమస్య ఉన్నప్పుడు డాక్టర్‌ను సంప్రదించడమే సరైన పద్ధతి.)
A post shared by Alok Chopra (@dralokchopra)
హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం. Read More
డాక్టర్ అలోక్ చోప్రా సూచనల ప్రకారం, ఈ నూనెలను తెలివిగా ఉపయోగించడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. సరైన మోతాదులో వాడితే మంచి ఫలితాలు ఉంటాయి.


