|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఆదర్శ కుటుంబం AK 47: వెంకీ-గురూజీ మూవీ షూటింగ్ ఎక్కడ జరుగుతోంది? క్రేజీ అప్‌డేట్!

Published: 16-12-2025, 9:44 AM
ఆదర్శ కుటుంబం AK 47: వెంకీ-గురూజీ మూవీ షూటింగ్ ఎక్కడ జరుగుతోంది? క్రేజీ అప్‌డేట్!
  • వెంకటేష్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో ‘ఆదర్శ కుటుంబం AK 47’ సినిమా తెరకెక్కుతోంది.
  • సినిమా సమ్మర్‌కి విడుదల కానున్నట్లు టైటిల్ పోస్టర్‌తో అధికారికంగా ప్రకటించారు.
  • ప్రస్తుతం హైదరాబాద్ BHEL సమీపంలో వెంకటేష్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
  • నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి తర్వాత వీరి కాంబినేషన్ నుండి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.

వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం AK 47’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సమ్మర్ రిలీజ్‌కి సిద్ధమవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఎక్కడ షూటింగ్ జరుగుతోందో, మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

వెంకటేష్-త్రివిక్రమ్ సినిమాపై భారీ అంచనాలు

Aadarsha Kutumbam AK 47 : త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న సినిమా ఆదర్శ కుటుంబం. ఈ సినిమాకి సంబంధించిన టైటిల్స్ గురించి పలు రకాల వార్తలు వినిపిస్తూ వచ్చాయి. అయితే వాటన్నిటికీ భిన్నంగా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ స్టార్ట్ అయిపోతున్నట్లు టైటిల్ పోస్టర్ ను లాంచ్ చేసింది చిత్ర యూనిట్. ముఖ్యంగా వీరి కాంబినేషన్ సినిమా అంటేనే విపరీతమైన అంచనాలు ఉండటం అనేది సహజంగా జరుగుతుంది.

ఇదివరకే ఈ కాంబినేషన్ లో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్ సినిమా మంచి సక్సెస్ సాధించింది. ఇప్పటికీ కూడా ఆ సినిమా టీవీలో వస్తుంటే హైయెస్ట్ టిఆర్పి రేటింగ్ నమోదు చేసుకుంటుంది. అలానే మల్లీశ్వరి సినిమా కూడా మంచి సక్సెస్ సాధించింది. అయితే కేవలం త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ రెండు సినిమాలకు రచయితగానే పనిచేశారు. ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వం కాబట్టి చాలా మందికి మరి కొంచెం క్యూరియాసిటీ ఉంది.

‘ఆదర్శ కుటుంబం AK 47’ షూటింగ్ ఎక్కడ?

ఈ సినిమా టైటిల్ పోస్టర్ను రిలీజ్ చేసినప్పుడే సమ్మర్ కి సినిమా రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీనిని బట్టి కచ్చితంగా ఈ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సమ్మర్ కి వచ్చే ప్లాన్లోనే ఉంది. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటుంది. ఆదర్శ కుటుంబం గత వారంలో మూడు రోజుల పాటు వెంకటేష్ మరియు శ్రీనిధి శెట్టిల పైన లపై కొన్ని కీలక సీన్స్ తీశారు. ప్రస్తుతం BHEL సమీపంలో షూటింగ్ జరుగుతుంది. వెంకటేష్ పై సీన్స్ తీస్తున్నారు.

మరోవైపు ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఆదర్శ కుటుంబం అనే టైటిల్ తో పాటు టైటిల్ వెనక రెడ్ కలర్ లో హోమ్ సింబల్ గీశారు. అయితే కుటుంబంలోని ఆ చివరి 0 మాత్రం రెడ్ కలర్ లో ఉంది. అంటే దీనిని బట్టి ఫ్యామిలీ కోసం రక్తపాతం కూడా చేసే హీరో అనేది కొంతమంది అనాలసిస్. ఇక త్రివిక్రమ్ వెంకటేష్ తో ఏం ప్లాన్ చేశాడో తెలియాలి అంటే సమ్మర్ వరకు ఆగక తప్పదు.

నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి రికార్డులు

బేసిగ్గా వెంకటేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ అంటేనే విపరీతమైన కామెడీ ఎక్స్పెక్ట్ చేయటం అనేది సాధారణంగా జరుగుతుంది. ఆ కామెడీ ఏ మాత్రం తగ్గినా కూడా సినిమాకి మైనస్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే వారి కాంబినేషన్లో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలో కామెడీకి ఒక స్టాండర్డ్ సెట్ చేశాయి. రచయితగానే అది అచీవ్ చేయగలిగిన త్రివిక్రమ్ ఇప్పుడు దర్శకుడుగా దానిని మించి హిట్ సినిమా ఇవ్వాల్సిందే.

మొత్తంగా, ‘ఆదర్శ కుటుంబం AK 47’ సినిమా వెంకటేష్-త్రివిక్రమ్ కాంబోలో అంచనాలను పెంచుతోంది. సమ్మర్‌కి విడుదల కానున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.