
📌 Key Points
- నాని, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘ది ప్యారడైజ్’ చిత్రంలో నటిస్తున్నారు, ఇది 2026లో విడుదల కానుంది.
- సుజీత్ దర్శకత్వంలో నాని తదుపరి సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.
- సంగీత దర్శకుడు శాశ్వత్ సచ్‌దేవ్ నాని, సుజిత్ సినిమాకు పనిచేసే అవకాశం ఉంది.
- DVV దానయ్య ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు.
నాచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘ది ప్యారడైజ్’ చిత్రంలో నటిస్తున్నారు. దీని తర్వాత సుజిత్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు. ఈ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరనే దానిపై ఆసక్తి నెలకొంది.
నాని ‘ది ప్యారడైజ్’ సినిమా విశేషాలు
Actor Nani: నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాని ఇండస్ట్రీలో అంచలంచలుగా ఎదుగుతూ హీరోగా సక్సెస్ అవ్వడమే కాకుండా నిర్మాతగా సక్సెస్ సాధించారు.. ఇక నిర్మాతగా మారి కొత్తవారికి అవకాశాలు ఇస్తూ ఎంతోమంది దర్శకులను యువ హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇలా వరుస హిట్ సినిమాలతో కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నా నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల(Sreekanth Odela) దర్శకత్వంలో ది ప్యారడైజ్ (The Paradise)అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా 2026 మేలో విడుదల కాబోతోందంటూ వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమా తర్వాత నాని తదుపరి సినిమాలకు కూడా కమిట్ అయిన సంగతి తెలిసిందే.
నాని శ్రీకాంత్ ఓదెల సినిమా విడుదల అయిన అనంతరం ఈయన మరొక సెన్సేషనల్ డైరెక్టర్ సుజీత్(Sujeeth) డైరెక్షన్ లో బిజీ కాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాని అధికారికంగా ప్రకటించడమే కాకుండా పూజ కార్యక్రమాలను కూడా జరుపుకున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ పనులు ఈ ఏడాదిలోనే ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం డైరెక్టర్ సుజిత్ ప్రీ ప్రొడక్షన్ పనులతో పాటు ఈ సినిమా నటీనటుల ఎంపిక విషయంలో బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది .అయితే తాజాగా ఈ సినిమా కోసం మ్యూజిక్ డైరెక్టర్ ను కూడా ఫిక్స్ చేశారని తెలుస్తోంది. తాజాగా నాని (Nani)సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గురించి హింట్ ఇచ్చేశారు.
సుజిత్ దర్శకత్వంలో నాని తదుపరి చిత్రం
నాని ఇంస్టాగ్రామ్ వేదికగా ది ప్యారడైజ్ సినిమాకు సంబంధించి కొన్ని స్టిల్స్ షేర్ చేశారు అయితే ఈ ఫోటోలకు ధురంధర్ సినిమా బిజిఎం యాడ్ చేయడంతో నాని తదుపరి సినిమా కోసం ధురంధర్ సినిమా సంగీత దర్శకుడు శాశ్వత్ సచ్‌దేవ్ (Shashwat Sachdev) రంగంలోకి దిగబోతున్నారంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. దాదాపు వీరి కాంబినేషన్ ఫిక్స్ అయిందని తెలుస్తోంది. మరి నాని సుజిత్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ శాశ్వత్ సచ్‌దేవ్ అంటూ వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాలి అంటే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.
సంగీత దర్శకుడిగా శాశ్వత్ సచ్‌దేవ్?
ఇక ఈ సినిమాకు డివీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అన్ని అనుకున్న విధంగా జరిగి ఉంటే ఈ ఏడాది జూన్ లేదా జూలై నుంచి రెగ్యులర్ షూటింగ్ పనులు జరిగి ఉండేది కానీ నాని నటిస్తున్న ది ప్యారడైజ్ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా కూడా మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాని ది ప్యారడైజ్ సినిమా మార్చి 26వ తేదీ విడుదల చేసే విధంగా చిత్ర బృందం ప్రణాళికలు రచించారు కానీ షూటింగ్ ఆలస్యం అవడంతో విడుదల తేదీ నుంచి తప్పుకోబోతుందని, ఈ ఏడాది మే నెలలో విడుదల కాబోతుందంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
మొత్తానికి నాని, సుజిత్ కాంబినేషన్లో వస్తున్న సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. శాశ్వత్ సచ్‌దేవ్ సంగీతం అందిస్తే సినిమాకు మరింత ప్లస్ అవుతుంది. అధికారిక ప్రకటన కోసం ఎదురుచూద్దాం.


