|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: మహేష్ బాబు బ్లాక్ బస్టర్ మూవీలో ఛాన్స్ మిస్ చేసుకున్న రాజశేఖర్! కారణం ఇదేనా?

Published: 25-03-2026, 8:05 AM
షాకింగ్: మహేష్ బాబు బ్లాక్ బస్టర్ మూవీలో ఛాన్స్ మిస్ చేసుకున్న రాజశేఖర్! కారణం ఇదేనా?
  • రాజశేఖర్ ఒకప్పుడు టాలీవుడ్‌లో బిజీ హీరోగా ఉండేవారు, ఇప్పుడు తండ్రి పాత్రల్లో నటిస్తున్నారు.
  • రాజశేఖర్ ‘బైకర్’ అనే సినిమాలో త్వరలో కనిపించనున్నారు, దీని ప్రమోషన్లలో ఆయన పాల్గొన్నారు.
  • మహేష్ బాబు నటించిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో రేలంగి మామయ్య పాత్రకు రాజశేఖర్‌ను మొదట సంప్రదించారు.
  • రాజశేఖర్ ఆ సినిమాను రిజెక్ట్ చేయడంతో, ఆ పాత్ర ప్రకాష్ రాజ్‌కు దక్కింది.

సీనియర్ నటుడు రాజశేఖర్ ఒక సంచలన విషయాన్ని వెల్లడించారు. మహేష్ బాబు నటించిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో రేలంగి మామయ్య పాత్రకు మొదట తనను సంప్రదించారని, అయితే కొన్ని కారణాల వల్ల తాను ఆ అవకాశం వదులుకున్నానని ఆయన తెలిపారు.

రాజశేఖర్ కెరీర్ విశేషాలు

Actor Rajashekhar: టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు రాజశేఖర్ (Rajasekhar) ఒకరు ఒకానొక సమయంలో ఈయన వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల తన ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకొని సినిమాలను కాస్త తగ్గిస్తూ వచ్చారు. రాజశేఖర్ కు హీరోగా అవకాశాలు రాని నేపథ్యంలో ఈయన ఇతర హీరోల మాదిరిగానే తండ్రి పాత్రలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇకపోతే త్వరలోనే రాజశేఖర్ బైకర్(Biker) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో శర్వానంద్ (Sharwanand) మాళవిక నాయర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ మూడో తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజశేఖర్ మహేష్ బాబు (Mahesh)నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (SVSC Film)సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. ఈ సినిమాలో రేలంగి మామయ్య పాత్రలో నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj)నటించిన సంగతి తెలిసిందే. ఈయన వెంకటేష్ మహేష్ బాబులకు తండ్రి పాత్రలో నటించారు. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వడానికి ప్రకాష్ రాజ్ రేలంగి మామయ్య పాత్ర చాలా కీలకంగా ఉందని చెప్పాలి.

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో రేలంగి మామయ్య పాత్ర

ఇక రేలంగి మామయ్య పాత్ర ఈ సినిమాలో ఎప్పుడు కోప్పడకుండా నవ్వుతూ ఉండే పాత్ర. అయితే ఈ పాత్ర కోసం చిత్ర నిర్మాతలు ముందుగా సీనియర్ నటుడు రాజశేఖర్ ను సంప్రదించారని తెలుస్తోంది. రాజశేఖర్ నవ్వు కూడా చాలా బాగుంటుంది అందుకే రేలంగి మామయ్య పాత్రకు ఈయన అయితే సరిగ్గా సూట్ అవుతారని భావించిన నిర్మాతలు ముందుగా ఈ పాత్ర కోసం రాజశేఖర్ ను సంప్రదించగా ఆయన కొన్ని కారణాల వల్ల ఈ సినిమాను రిజెక్ట్ చేశారని తెలుస్తోంది. ఈ విధంగా రాజశేఖర్ రిజెక్ట్ చేయడంతో మేకర్స్ తదుపరి ప్రకాష్ రాజ్ ను కలిసి ఆయనకు అవకాశం ఇచ్చారని తెలుస్తోంది.

శర్వానంద్ తండ్రిగా రాజశేఖర్..

రాజశేఖర్ రిజెక్ట్ చేయడానికి కారణం ఏమిటి?

ఇప్పుడు రాజశేఖర్ బైకర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈ విషయాన్ని బయట పెట్టడంతో ఈయన అభిమానులు షాక్ అవుతున్నారు. ఇలాంటి మంచి పాత్రను మిస్ చేసుకుని తప్పు చేశారా అంటూ కొంతమంది కామెంట్లు చేయగా, మరి కొంత మంది రేలంగి మావయ్య పాత్రకు ప్రకాష్ రాజ్ సరిగా సరిపోయారని ఆ పాత్రలో ఆయనని తప్ప మరెవరిని ఊహించుకోలేము అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక బైకర్ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా రేసింగ్ నేపద్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఇందులో సునీల్ అనే పాత్రలో రాజశేఖర్ శర్వానంద్ తండ్రిగా కనిపించబోతున్నారు.

రాజశేఖర్ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాను రిజెక్ట్ చేయడం ఆయన అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రకాష్ రాజ్ ఆ పాత్రలో అద్భుతంగా నటించినప్పటికీ, రాజశేఖర్ ఆ పాత్రలో ఎలా ఉండేవారోనని చాలామంది చర్చించుకుంటున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.