
📌 Key Points
- నటుడు శివాజీ ‘దండోరా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
- సినిమా టికెట్ ధరలు సామాన్యుడికి అందుబాటులో ఉండాలని శివాజీ అభిప్రాయం.
- మల్టీప్లెక్స్‌లలో రూ. 350 కాఫీ ధరపై శివాజీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
- టికెట్ల ధరలతో పాటు అన్ని నియంత్రించే బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.
సీనియర్ నటుడు శివాజీ తాజాగా సినిమా టికెట్ ధరల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. మల్టీప్లెక్స్‌లలో అధిక ధరలు సామాన్యులకు భారం అని, కాఫీ, స్నాక్స్ ధరలు దారుణంగా ఉన్నాయని తెలిపారు. టికెట్ల రేట్ల నియంత్రణ బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.
శివాజీ దండోరా చిత్రం, టికెట్ల రేట్లపై వ్యాఖ్యలు
Actor Shivaji : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్ లతో ఎంతో బిజీగా గడుపుతున్న వారిలో సీనియర్ నటుడు శివాజీ (Shivaji)ఒకరు. త్వరలోనే ఈయన దండోరా (Dandora) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి పాటను విడుదల చేయడంతో చిత్ర బృందం ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు మరెన్నో అంశాల గురించి కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. ముఖ్యంగా సినిమా టికెట్ల ధరల గురించి కూడా ప్రస్తావనకు వచ్చింది.
గతంలో శివాజీ సినిమా టికెట్ల రేట్లు 100 రూపాయలు పెంచితేనే ఇండస్ట్రీ మొత్తాన్ని తప్పుపడుతున్నారు కానీ సంక్రాంతి పండుగ సందర్భంగా పెరిగే బస్సు చార్జీల గురించి ఎవరు మాట్లాడరు అంటూ ఈయన మాట్లాడిన విషయం తెలిసిందే అయితే తాజాగా సినిమా టికెట్ల ధరల గురించి ప్రశ్నలు ఎదురవడంతో శివాజీ మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి . ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ.. సినిమా టికెట్ ధరలు ఒక కామన్ మ్యాన్ కు అందుబాటులో ఉండాల్సిందేనని శివాజీ తెలిపారు. ఇక మల్టీప్లెక్స్ లలో సినిమా టికెట్ల ధరల గురించి అక్కడ దొరికే స్నాక్స్ గురించి కూడా ఈ సందర్భంగా శివాజీ మాట్లాడారు.
మల్టీప్లెక్స్ ధరలపై శివాజీ ఆవేదన
మల్టీప్లెక్స్ లో వారికి ఎన్నో రకాల కారణాలు ఉండొచ్చు వారి దగ్గర ఎంతమంది స్టాఫ్ పనిచేస్తున్నారని, మల్టీప్లెక్స్ నిర్మించడానికి ఇంత ఖర్చయిందని చెబుతుంటారు అలాంటి కారణాలు ఏవైనా కావచ్చు కానీ రూ. 350 రూపాయలు కాఫీ ఏంటండి మరి దారుణంగా.. మా కుటుంబం మొత్తం కలిపి మూడు రోజులు తాగుతాము. జనాలు మల్టీప్లెక్స్ లకు వెళ్లాలి అంటే వీటికి భయపడుతున్నారని శివాజీ తెలిపారు. ఇంత ధరలు తీసుకోవడం కరెక్ట్ కాదు కచ్చితంగా ఈ విషయంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలిపారు.
మల్టీప్లెక్స్ లో ఈ స్థాయిలో ధరలు ఉన్నాయి అంటే ఆ ధరలతో నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్లకు ఏమాత్రం సంబంధం ఉండదని, ప్రభుత్వానికి మాత్రమే సంబంధం ఉంటుందని తెలిపారు. కానీ ఈ ధరలను నియంత్రించే బాధ్యత కేవలం ప్రభుత్వం మాత్రమే తీసుకోవాలని, ప్రభుత్వం అనుకుంటే టికెట్ ధరలతో పాటు అన్ని కంట్రోల్ ల ఉంటాయని శివాజీ తెలిపారు.ఇలా సినిమా టికెట్ల ధరల గురించి మాట్లాడటంతో వ్యాఖ్యల పట్ల విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఐబొమ్మ రవి గురించి ప్రశ్నలు ఎదురవడంతో ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి శివాజీ ఇష్టపడలేదు. దీంతో జై బాలయ్య అంటూ తన ప్రసంగాన్ని ముగించారు . గతంలో ఐ బొమ్మ రవి చాలా తెలివైనవాడు అంటూ ప్రశంసించడంతో ఈయన వ్యాఖ్యల పట్ల విభిన్న రీతిలో కామెంట్లు వ్యక్తమైన నేపథ్యంలో ఈసారి రవి గురించి మాట్లాడటానికి శివాజీ ఇష్టపడలేదని తెలుస్తోంది.
టికెట్ ధరల నియంత్రణ ప్రభుత్వానిదే
శివాజీ చేసిన ఈ వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో, ప్రేక్షకులలో చర్చకు దారితీస్తున్నాయి. ప్రభుత్వ నియంత్రణ అవశ్యకతను ఆయన గట్టిగా నొక్కిచెప్పారు. ఈ విషయంలో తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

