
📌 Key Points
- నాని ‘ది ప్యారడైజ్’ సినిమా ఆగస్టు 21న విడుదల కానుంది.
- ఈస్ట్ గోదావరి థియేట్రికల్ హక్కులను మైత్రి మూవీ మేకర్స్ దక్కించుకున్నారు.
- నాని ఈ సినిమాలో జడల అనే విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు.
- మోహన్ బాబు విలన్ పాత్రలో నటిస్తుండగా, కయాదు లోహర్ హీరోయిన్ గా నటిస్తున్నారు.
నాచురల్ స్టార్ నాని నటించిన ‘ది ప్యారడైజ్’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి సంబంధించిన ఈస్ట్ గోదావరి థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది. ఆగష్టు 21న సినిమా విడుదల కానుంది.
ఆగష్టు 21న ‘ది ప్యారడైజ్’ విడుదల
The Paradise Film: నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇన్ని రోజులు నాని ఫ్యామిలీ, లవ్ ఎంటర్టైన్మెంట్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ మంచి సక్సెస్ అందుకున్నారు. ఇటీవల కాలంలో నాని విభిన్నమైన కథ చిత్రాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇక త్వరలోనే నాని హీరోగా నటించిన ది ప్యారడైజ్ (The Paradise)సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమా మార్చి 26వ తేదీ విడుదల కావాల్సి ఉండగా షూటింగ్ ఆలస్యం అయిన నేపథ్యంలో ఈ సినిమా ఆగస్టు 21వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.
ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరుపుకుంటుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నైజాం, ఆంధ్ర థియేట్రికల్ హక్కులకు సంబంధించి బిజినెస్ పూర్తి అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా ఈస్ట్ గోదావరి థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాణ సమస్థ మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers) కైవసం చేసుకున్నారని తెలుస్తోంది. ఇలా మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ చేతికి ఈ సినిమా ఈస్ట్ గోదావరి థియేట్రికల్ హక్కులను(east godavari theatrical rights ) భారీ ధరలకు దక్కించుకున్నారు.
మైత్రి మూవీ మేకర్స్ చేతికి థియేట్రికల్ హక్కులు
ఇక ఈ సినిమాలో నాని జడల అనే విభిన్నమైన పాత్రలో నటించబోతున్నారు . నాని మాస్ లుక్ సినిమా పట్ల భారీ స్థాయిలో అంచనాలను పెంచేస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ చూస్తుంటే ఈసారి పాన్ ఇండియా స్థాయిలో నాని బ్లాక్ బస్టర్ అందుకోబోతున్నారని స్పష్టమవుతుంది. ఇక ఇందులో సీనియర్ నటులు మోహన్ బాబు విలన్ పాత్రలో కనిపించగా నటుడు తనికెళ్ల భరణి, సంపూర్ణేష్ బాబు, సోనాలి కులకర్ణి వంటి తదితరులు కీలకపాత్రలలో నటిస్తున్నారు.
ఇందులో సోనాలి కులకర్ణి నాని తల్లి పాత్రలో కనిపించబోతున్నారు. ఇక నానికి జోడిగా కయాదు లోహర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్ వీడియోలను విడుదల చేయగా మంచి ఆదరణను సొంతం చేసుకున్నాయి. ఇక ఇటీవల ఈ సినిమా నుంచి ఆయా షేర్ అంటూ సాగిపోయే పాటను విడుదల చేశారు. ఈ పాట సోషల్ మీడియా ట్రెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. దసరా సినిమా ద్వారా దర్శకుడిగా అవకాశం అందుకున్న శ్రీకాంత్ ఓదెల (Sreekanth Odela)ఈసారి ది ప్యారడైజ్ అనే సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అందుకోబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాని చెరుకూరి సుధాకర్ రెడ్డి నిర్మించగా అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించారు. ఈ సినిమా ఏకంగా 8 భాషలలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నాని సినీ కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమా అనే చెప్పాలి.
జడల పాత్రలో నాని సరికొత్త లుక్
నాని ‘ది ప్యారడైజ్’ సినిమా విడుదల కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా హక్కులను దక్కించుకోవడంతో అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమా నానికి భారీ విజయాన్ని అందిస్తుందని భావిస్తున్నారు.


