
తెలుగు సినీ పరిశ్రమకు కోట్లు నష్టం కలిగించిన ఐ బొమ్మ రవి ఇటీవల అరెస్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో నటుడు శివాజీ ఐ బొమ్మ రవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అతని హ్యాకింగ్ తెలివిని దేశ భద్రతకు ఉపయోగించుకోవాలని శివాజీ సూచించారు. అతని కసిని మంచి పనికి వినియోగించి ఉంటే బాగుండేదన్నారు.
Key Points
తెలుగు సినీ పరిశ్రమకు కోట్లు నష్టం కలిగించిన ఐ బొమ్మ రవి ఇటీవలే అరెస్ట్ అయ్యాడు.
నటుడు శివాజీ ఐ బొమ్మ రవి టాలెంట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రవి హ్యాకింగ్ తెలివిని దేశ భద్రతకు ఉపయోగించుకోవాలని శివాజీ సూచించారు.
సినిమా ఈ ప్రపంచంలో అత్యంత చౌకైనది, మంచి సినిమాలు జీవితాంతం గుర్తుంటాయని శివాజీ అన్నారు.
ఐ బొమ్మ రవి అరెస్ట్: టాలీవుడ్‌కు నష్టం
ఇప్పుడు ఎక్కడ చూసినా అతని పేరే వినిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగిపోతోంది. అతనే ఇన్ని రోజులు సినీ ఇండస్ట్రీకి కోట్ల రూపాయలు నష్టం కలిగించిన వ్యక్తి. ఇటీవలే విదేశాల నుంచి ఇండియాకు వస్తూ పోలీసులకు దొరికిపోయాడు. అతను ఐ బొమ్మ ఇమ్మడి రవి. తెలుగు సినీ ఇండస్ట్రీ ఆదాయానికి కొన్నేళ్లుగా గండి కొడుతూ విదేశాల్లో తప్పించుకు తిరుగుతున్నారు. కానీ చివరికీ పోలీసుల నుంచి తప్పించుకోలేకపోయాడు. సవాల్ విసిరిన రవి.. చాలా ఈజీగానే దొరికేశాడు.
అతని గురించి అంతా నెగెటివ్ జరుగుతున్న వేళ.. టాలీవుడ్ నటుడు శివాజీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఐ బొమ్మ రవి టాలెంటెడ్‌గా కనిపిస్తున్నారు. అతని హ్యాకింగ్ తెలివిని దేశ భద్రతకు పనికొచ్చేలా ఉపయోగించుకోవాలని సూచించారు. వాడిలో ఉన్న కసిని మంచి పనికి వినియోగించి ఉంటే బాగుండేదని అన్నారు. అతను చేసింది చాలా దుర్మార్గమైన పనే.. కానీ అతని టాలెంట్ మనదేశ భద్రత కోసం ఉపయోగించుకుంటే బాగుంటుందని నా అభిప్రాయమని తెలిపారు. చాలా మందిని ఇబ్బందిపెట్టిన రవి.. ఇకనుంచైనా మారాలని కోరుకుంటున్నాని శివాజీ వెల్లడించారు. ఈ ప్రపంచంలో అన్నింటికన్నా చీప్‌గా దొరికేది ఒక్క సినిమా మాత్రమేనన్నారు. ఏదైనా సినిమా బాగుంటే జీవితాంతం గుర్తు పెట్టుకుంటారని శివాజీ వెల్లడించారు. ఓ సినిమా ఈవెంట్‌కు హాజరైన ఐ బొమ్మ రివి గురించి మాట్లాడారు.
ఐ బొమ్మ రవిపై నటుడు శివాజీ కామెంట్స్
దేశ భద్రతకు రవి టాలెంట్: శివాజీ సూచన
ఐ బొమ్మ రవి చేసింది తప్పు అయినా, అతని టాలెంట్‌ను దేశ భద్రతకు వాడాలని శివాజీ సూచించారు. సినిమా ఎంతో మందికి ఇష్టమైనదని, మంచి సినిమాలు ఎప్పుడూ గుర్తుంటాయని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.


