|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మహిళా కమిషన్ విచారణ తర్వాత శివాజీ సంచలన ఆవేదన: “నాపై కుట్ర జరుగుతోంది!”

Published: 27-12-2025, 7:32 AM
మహిళా కమిషన్ విచారణ తర్వాత శివాజీ సంచలన ఆవేదన: "నాపై కుట్ర జరుగుతోంది!"
  • హీరోయిన్ల వస్త్రధారణపై వ్యాఖ్యల కేసులో మహిళా కమిషన్ విచారణకు శివాజీ హాజరు.
  • రెండు గంటల పాటు సాగిన విచారణ తర్వాత శివాజీ మీడియాతో మాట్లాడారు.
  • “నాపై కుట్ర జరుగుతోంది, నాతో కెరియర్ ప్రారంభించిన వారే శత్రువులయ్యారు” అని ఆవేదన.
  • తనకు కావాల్సినవారే జూమ్ కాల్ చేసుకుని తన గురించి మాట్లాడుకున్నారని ఆరోపణ.

హీరోయిన్ల వస్త్రధారణ వ్యాఖ్యల వివాదంలో నటుడు శివాజీ మహిళా కమిషన్ విచారణకు హాజరయ్యారు. సుదీర్ఘ విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనపై పెద్ద కుట్ర జరుగుతోందని, తనకు కావాల్సినవారే దీని వెనుక ఉన్నారని సంచలన ఆరోపణలు చేశారు.

శివాజీపై ఫిర్యాదు, మహిళా కమిషన్ విచారణ

Actor Sivaji: టాలీవుడ్ హీరో శివాజీ గత వారం రోజులుగా వార్తలలో నిలుస్తున్నారు. ఈయన నటించిన దండోరా (Dandora)సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా హీరోయిన్ల వస్త్రధారణ గురించి మాట్లాడుతూ కాస్త అభ్యంతరకరమైన పదాలను మాట్లాడారు. దీంతో పెద్ద ఎత్తున ఈయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇలా శివాజీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ అనసూయ, చిన్మయిలాంటివారు సోషల్ మీడియా వేదికగా తరచూ పోస్టులు చేస్తున్నారు. ఇలా శివాజీ విషయంలో అనసూయ వరుస పోస్టులు చేస్తున్న నేపథ్యంలో ఎంతోమంది అనసూయకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇలా శివాజీ చేసిన ఈ వ్యాఖ్యల కారణంగా ఆయనపై కేసు కూడా నమోదు చేశారు.

శివాజీ మాట్లాడిన మాటలను వెనక్కు తీసుకుంటూ క్షమాపణలు తెలియజేస్తూ ఒక వీడియో విడుదల చేశారు. అయినప్పటికీ ఈయనపై కేసు నమోదు కావడంతో నేడు మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ విచారణలో భాగంగా మహిళా కమిషన్ శివాజీని పలు ప్రశ్నలు వేసినట్టు తెలుస్తోంది. దాదాపు రెండు గంటల పాటు ఈ విచారణ కొనసాగింది . విచారణ అనంతరం శివాజీ మీడియా ముందుకు వచ్చారు. ఈ మీడియా సమావేశంలో భాగంగా ఈయన కాస్త ఎమోషనల్ అవుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

విచారణ తర్వాత శివాజీ భావోద్వేగ వ్యాఖ్యలు

ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ మహిళా కమిషన్ విచారణలో భాగంగా మేడం గారు తన బిడ్డకు చెప్పినట్టు కొన్ని సలహాలు సూచనలు నాకు ఇచ్చారు. ఆమె తన నిబంధనల ప్రకారం నడుచుకున్నారని తెలిపారు. అయితే తన విషయంలో ఏదో కుట్ర జరుగుతుందని తెలిపారు. నేను ఏ తప్పు చేశానని నాపై ఇంత కోపం చూపుతున్నారు. ఏమ్మా మీ ఇంట్లో మీ అమ్మానాన్నలు ఇలా సలహాలు ఇవ్వరా? అంటూ ప్రశ్నించారు. ఈ ఘటన కారణంగా నాకు సలహాలు ఇవ్వకూడదని అర్థమైందని తెలిపారు. కచ్చితంగా నాపై కుట్ర జరుగుతుందని, నాతో కెరియర్ ప్రారంభించిన వారికి నా పట్ల చాలా కోపం ఉంది. నాకు బాగా కావాల్సిన వాళ్ళు ఇంత కుట్ర చేస్తారని అనుకోలేదు అంటూ ఈయన కాస్త ఎమోషనల్ అయ్యారు.

నేను మాట్లాడిన ఈ వ్యాఖ్యలు అనంతరం నాకు బాగా కావాల్సినవాళ్లు జూమ్ కాల్ చేసుకుని సమావేశమై నా గురించి మాట్లాడుకున్నారని ఆ విషయాలన్నీ నాకు తెలుసు కానీ , వారి పేర్లు బయట పెట్టాలనుకోలేదు అంటూ శివాజీ ఈ సందర్భంగా మాట్లాడుతూ చేస్తున్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇలా తనకు బాగా కావాల్సిన వాళ్లే కుట్ర చేశారంటూ ఈయన మాట్లాడటంతో శివాజీ ఎవరిని ఉద్దేశించి అన్నారంటూ చర్చలు జరుగుతున్నాయి. ఇక ఇటీవల కాలంలో శివాజీ తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలలోను వెబ్ సిరీస్ లలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా శివాజీ సక్సెస్ జీర్ణించుకోలేక కుట్రలు చేస్తున్నారా అంటూ అనుమానాలను వ్యక్తపరుస్తున్నారు.

“నాపై కుట్ర జరుగుతోంది”: శివాజీ సంచలన ఆరోపణలు

శివాజీ చేసిన ఈ సంచలన ఆరోపణలు టాలీవుడ్‌లో కొత్త చర్చకు దారితీశాయి. తనపై కుట్ర వెనుక ఎవరున్నారనేది ఇంకా స్పష్టం కాలేదు. ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపుతుండగా, తదుపరి పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.