|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Pawan Kalyan తో నటించి కనిపించకుండా పోయిన హీరోయిన్లు, లిస్ట్ లో ఐదుగురు.. ఆమె మాత్రం చేజేతులా..

Published: 06-12-2025, 9:08 AM
Pawan Kalyan తో నటించి కనిపించకుండా పోయిన హీరోయిన్లు, లిస్ట్ లో ఐదుగురు.. ఆమె మాత్రం చేజేతులా..
  • పవన్ కళ్యాణ్ తో నటించిన కొంతమంది హీరోయిన్లు ఇండస్ట్రీకి దూరమయ్యారు.
  • నేహా ఒబెరాయ్, సారా జేన్, నికీషా పటేల్ వంటివారు ఒక్క సినిమాతో కనుమరుగయ్యారు.
  • ఇలియానా తన కెరీర్ ను స్వయంగా నాశనం చేసుకుందని ఆర్టికల్ హైలైట్ చేస్తుంది.
  • సినిమా డిజాస్టర్లు, అవకాశాలు రాకపోవడం వల్లే చాలామంది ఇండస్ట్రీకి దూరమయ్యారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి నటించి, ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరమైన హీరోయిన్ల గురించి ఈ కథనం వివరిస్తుంది. నేహా ఒబెరాయ్ నుండి కృతి కర్బంద వరకు, చాలామంది అవకాశాలు లేక కనుమరుగైతే, ఇలియానా మాత్రం తన కెరీర్‌ను చేజేతులా నాశనం చేసుకుంది.

పవన్ కళ్యాణ్ తో నటించి కనుమరుగైన హీరోయిన్లు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అటు రాజకీయాలు, ఇటు సినిమాల్లో రాణిస్తున్నారు. ఈ ఏడాది పవన్ కళ్యాణ్ నుంచి హరి హర వీరమల్లు, ఓజీ రెండు చిత్రాలు విడుదలయ్యాయి. ఓజీ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కాగా.. హరిహర వీరమల్లు డిజాస్టర్ గా నిలిచింది. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ తో చాలా మంది హీరోయిన్ నటించారు. వారిలో కొంతమంది హీరోయిన్ కనిపించకుండా పోయారు. ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

బాలు చిత్రంలో నేహా ఒబెరాయ్ నటించింది. బాలు చిత్రం నిరాశ పరిచింది. ఈమె నిర్మాత ధరమ్ ఒబెరాయ్ కుమార్తె. బాలు తర్వాత బ్రహ్మాస్త్రం అనే చిత్రంలో నటించింది. ఆ తర్వాత టాలీవుడ్ లో ఆమె కనిపించలేదు.

సినిమా డిజాస్టర్ తో అవకాశాలు కోల్పోయినవారు

ఇలియానా పవన్ కళ్యాణ్ తో జల్సా చిత్రంతో నటించింది. ఆ సమయంలో ఇలియానా కెరీర్ పీక్ లో ఉంది. జల్సా తర్వాత జులాయి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇలియానాకి పడింది. అయినప్పటికీ ఆమె టాలీవుడ్ లో మరికొంత కాలం కొనసాగకుండా చేజేతులా కెరీర్ నాశనం చేసుకుంది. బాలీవుడ్ కి వెళ్లడంతో అక్కడ ఆమెకి సరైన ఆఫర్స్ రాలేదు.

డయాస్ సారా జేన్ పవన్ తో పంజా చిత్రంలో నటించింది. పంజా మూవీ డిజాస్టర్ కావడంతో ఆమెకి అవకాశాలు రాలేదు. దీనితో సారా జేన్ టాలీవుడ్ లో కనిపించకుండా పోయింది.

చేజేతులా కెరీర్ నాశనం చేసుకున్న ఇలియానా

నికీషా పటేల్ కొమరం పులి చిత్రంలో పవన్ తో రొమాన్స్ చేసింది. కొమరం పులి డిజాస్టర్ కావడంతో నికీషాకి కూడా సరైన ఆఫర్స్ రాలేదు. దీనితో ఆమె నెమ్మదిగా ఇండస్ట్రీకి దూరమవుతూ వచ్చింది.

తీన్మార్ మూవీలో కృతి కర్బంద హోమ్లీ లుక్ లో అదరగొట్టింది. పవన్, కృతి మధ్య కెమిస్ట్రీ బాగా పండింది. కానీ సినిమా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో కృతి నటించినప్పటికీ సరైన విజయం దక్కలేదు. ఈమె కూడా టాలీవుడ్ కి దూరమైంది.

పవన్ కళ్యాణ్ తో నటించినప్పటికీ, సినీ పరిశ్రమలో అవకాశాలు లభించకపోవడం లేదా సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల చాలామంది హీరోయిన్లు కనుమరుగయ్యారు. ఇండస్ట్రీలో నిలబడాలంటే కేవలం ఒక స్టార్ హీరోతో నటించడం సరిపోదని ఈ సంఘటనలు నిరూపిస్తున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.