|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Aditi Rao Hydari: నాకు పర్సనల్ ఫోన్ నంబర్ లేదు

Published: 16-11-2025, 6:08 AM
Aditi Rao Hydari: నాకు పర్సనల్ ఫోన్ నంబర్ లేదు

నటి అదితి రావు హైదరీ పేరుతో కొందరు ఫొటోగ్రాఫర్స్‌ను మోసం చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై స్పందించిన అదితి, తనకు వ్యక్తిగత ఫోన్ నంబర్ లేదని, తన టీమ్ ద్వారానే సంప్రదింపులు జరుగుతాయని స్పష్టం చేసింది. మోసగాడి పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.

Key Points

1

అదితి రావు హైదరీ పేరుతో ఓ వ్యక్తి ఫొటోగ్రాఫర్స్‌ను మోసం చేస్తున్నాడు.

2

తనకు వ్యక్తిగత ఫోన్ నంబర్ లేదని, టీమ్ ద్వారానే సంప్రదిస్తానని అదితి స్పష్టం చేసింది.

4

'మహాసముద్రం' షూటింగ్‌లో సిద్ధార్థ్‌తో ప్రేమలో పడి, 2024లో వివాహం చేసుకుంది.

అదితి రావు హైదరీ పేరుతో మోసం: సినీ తార హెచ్చరిక

తెలంగాణలోని వనపర్తి సంస్థానికి చెందిన అదితీ రావు హైదరీ ప్రస్తుతం హీరోయిన్‌గా తెలుగు, తమిళ, హిందీ సినిమాలు చేస్తోంది. హీరో సిద్దార్థ్‌ని పెళ్లి చేసుకుని ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. అయితే ఈమె పేరు చెప్పి ఓ వ్యక్తి.. పలువురు ఫొటోగ్రాఫర్స్‌ని మోసం చేస్తున్నాడు. ఇది అదితీ దృష్టికి వచ్చేసరికి స్వయంగా దీని గురించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి హెచ్చరించింది.

నాకు పర్సనల్ ఫోన్ నంబర్ లేదు: అదితి స్పష్టత

‘వాట్సాప్‌లో నా పేరుతో ఎవరో ఓ వ్యక్తి.. ఫొటోషూట్స్ కోసం పలువురు ఫొటోగ్రాఫర్స్‌కి మెసేజులు చేస్తున్నాడు. కొందరు వ్యక్తులు ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చారు. అయితే అది నేను కాదు. ఇలా నేను మెసేజ్ చేయను. చెప్పాలంటే నాకు వ్యక్తిగత ఫోన్ నంబర్ ఏం లేదు. నా టీమ్ ద్వారా నేను సంప్రదిస్తాను. కాబట్టి ఆ నంబర్ నుంచి మెసేజులు ఏమైనా వస్తే స్పందించొద్దు’ అని అదితీ రావ్ హైదరీ తన ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. సదరు మోసగాడి నంబర్ కూడా వెల్లడించింది.

అదితి కెరీర్, సిద్ధార్థ్‌తో ప్రేమ కథ

2006 నుంచి అదితీ సినిమాలు చేస్తోంది. తెలుగు, తమిళ, మలయాళ, మరాఠీ, హిందీ భాషల్లో నటించింది. టాలీవుడ్‌లో ‘సమ్మోహనం’ ఈమెకు తొలి మూవీ. తర్వాత అంతరిక్షం, వీ, మహాసముద్రం చిత్రాల్లో నటించింది. ‘సమ్మోహనం’తో హిట్ కొట్టినప్పటికీ మిగిలనవన్నీ ఫెయిల్ అయ్యాయి. ‘మహాసముద్రం’లో నటిస్తున్న టైంలో హీరో సిద్ధార్థ్‌తో అదితీ ప్రేమలో పడింది. తర్వాత మూడేళ్ల పాటు ప్రేమించుకుని 2024లో వీళ్లిద్దరూ ఒక్కటయ్యారు.

అదితి రావు హైదరీ తన పేరుతో జరుగుతున్న మోసాన్ని తీవ్రంగా ఖండించింది. తనకు వ్యక్తిగత ఫోన్ నంబర్ లేదని స్పష్టం చేస్తూ, టీమ్ ద్వారా మాత్రమే సంప్రదించాలని సూచించింది. ఇలాంటి మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని అదితి హెచ్చరించింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.