|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

PM Modi : ప్రధాని మోదీకి ‘అఖండ 2’ స్పెషల్ షో.. బాలయ్య మోదీని కలుస్తారా..?

Published: 15-12-2025, 5:48 AM
PM Modi : ప్రధాని మోదీకి ‘అఖండ 2’ స్పెషల్ షో.. బాలయ్య మోదీని కలుస్తారా..?
  • ‘అఖండ 2’ సినిమాను ప్రధాని నరేంద్ర మోదీ వీక్షించనున్నారని బోయపాటి శ్రీను వెల్లడించారు.
  • ఢిల్లీలో ఎంపీల కోసం ఏర్పాటు చేసే ప్రత్యేక ప్రదర్శనకు ప్రధాని హాజరయ్యే అవకాశం ఉంది.
  • ఈ షోకు బాలకృష్ణ, బోయపాటి హాజరై మోదీని కలుస్తారా అనే చర్చ విస్తృతంగా జరుగుతోంది.
  • ఏపీలో కూటమి ప్రభుత్వం నేపథ్యంలో మోదీ-బాలయ్య భేటీకి రాజకీయ ప్రాధాన్యత నెలకొంది.

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన ‘అఖండ 2’ సినిమా ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తాజాగా, ప్రధాని నరేంద్ర మోదీ ఈ చిత్రాన్ని వీక్షించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఢిల్లీలో జరగనున్న ఈ ప్రత్యేక ప్రదర్శనకు బాలయ్య హాజరై మోదీని కలుస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

అఖండ 2: ప్రధాని మోదీకి ప్రత్యేక ప్రదర్శన

PM Modi : బాలకృష్ణ బోయపాటి కాంబోలో వచ్చిన అఖండ 2 సినిమా థియేటర్స్ లో మాస్ ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఈ సినిమా ముందే చెప్పిన డేట్ కి రిలీజ్ చేసి ఉంటే మంచి హైప్ తోఇంకా ఎక్కువ కలెక్షన్స్ వచ్చి దూసుకుపోయేది. కానీ పలు కారణాలతో వాయిదా పడటంతో హైప్ తగ్గిపోయి ఓపెనింగ్స్ అనుకున్నంత రాలేదు. కానీ మాస్ ప్రేక్షకులకు, సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్లకు, దేశభక్తులకు ఈ సినిమా బాగానే కనెక్ట్ అవుతుంది.

అఖండ 2 సినిమాని పాన్ ఇండియా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. నార్త్ లో కూడా బాగా ప్రమోషన్స్ చేసారు. యుపి సీఎం యోగి ఆదిత్యనాథ్ కి ఇప్పటికే సినిమాలో కొంతభాగం మూవీ యూనిట్ కలిసి చూపించారు. బాలయ్య, బోయపాటి, సంయుక్త, నిర్మాతలు యోగి ఆదిత్యనాథ్ ని కలిశారు. ఆయనకు ఈ సినిమా నచ్చేసింది.

మోదీ – బాలయ్య భేటీపై నెలకొన్న ఉత్కంఠ

అయితే ఇప్పుడు అఖండ 2 సినిమా ప్రధాని నరేంద్ర మోదీ చూస్తారట. ఇటీవల జరిగిన అఖండ 2 సక్సెస్ మీట్ లో బోయపాటి మాట్లాడుతూ.. ప్రధాని మోడీ గారు అఖండ 2 గురించి విన్నారు. ఈ సినిమాపై ఆసక్తి చూపించారు. త్వరలోనే ఢిల్లీలో ఈ సినిమాకు ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నాం. ఆ షోను మోడీ గారు కూడా చూస్తారు అని తెలిపారు. ఢిల్లీలో ఎంపీలకు అప్పుడప్పుడు కొన్ని మంచి సినిమాలను ప్రదర్శిస్తారని తెలిసిందే.

ఢిల్లీలో ఎంపీల కోసం అఖండ 2 స్పెషల్ షో

ఈ క్రమంలో అఖండ 2 కూడా త్వరలోనే ఎంపీలకు స్పెషల్ షో వేయనున్నారు. ఈ షోకి ప్రధాని మోదీ కూడా హాజరవుతారని సమాచారం. దీంతో బాలయ్య, బోయపాటి కూడా ఈ షోకి హాజరవుతారా, మోదీని కలుస్తారా అనే చర్చ నెలకొంది. అసలే ఏపీలో కూటమి ప్రభుత్వం ఉంది. ఈ క్రమంలో బాలయ్య మోదీని కలుస్తారని వార్త ఫ్యాన్స్ తో పాటు కార్యకర్తల్లో సంతోషాన్ని నింపుతుంది. మరి మోదీ వచ్చి అఖండ 2 సినిమా చూస్తారా బాలయ్యని కలుస్తారా చూడాలి.

మొత్తంమీద, ‘అఖండ 2’ సినిమాకు ప్రధాని మోదీ నుంచి దక్కే గుర్తింపు, బాలయ్యతో ఆయన భేటీ జాతీయ స్థాయిలో చర్చకు దారితీయవచ్చు. ఈ పరిణామం సినిమాతో పాటు రాజకీయ వర్గాల్లోనూ కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.