|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Akhanda 2 Collections : అనుకున్నట్టే కలెక్షన్స్‌పై ఎఫెక్ట్ పడింది.. ఫస్ట్ డే మరీ ఇంత తక్కువగా?

Published: 13-12-2025, 12:08 AM
Akhanda 2 Collections : అనుకున్నట్టే కలెక్షన్స్‌పై ఎఫెక్ట్ పడింది.. ఫస్ట్ డే మరీ ఇంత తక్కువగా?
  • అఖండ 2 చిత్రం డిసెంబర్ 12న విడుదలైంది, తొలుత డిసెంబర్ 5న రావాల్సి ఉంది.
  • ఫైనాన్సియల్ ట్రబుల్స్ కారణంగా సినిమా విడుదల వారం రోజులు ఆలస్యమైంది.
  • తొలిరోజు మిక్స్‌డ్ టాక్ రావడంతో పాటు పలు కారణాలు కలెక్షన్‌లపై ప్రభావం చూపాయి.
  • అంచనా 55 కోట్ల బదులు ప్రపంచవ్యాప్తంగా రూ. 32 కోట్లు మాత్రమే వసూలైనట్లు సమాచారం.

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన అఖండ 2 సినిమా తొలిరోజు అనుకున్నదానికంటే తక్కువ కలెక్షన్‌లు రాబట్టింది. మిక్స్‌డ్ టాక్, ఆర్థిక సమస్యలు వసూళ్లపై ప్రభావం చూపినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా రూ. 32 కోట్లు మాత్రమే వసూలైనట్లు సమాచారం.

అఖండ 2 విడుదల ఆలస్యం – కారణాలు

Akhanda 2 Collections : టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలయ్య, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం అఖండ 2.. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఎన్నో అడ్డంకులు ఎదురైనా ఎట్టకేలకు నిన్న భారీ అంచనాలతో థియేటర్లలోకి అడుగు పెట్టేసింది.. వాస్తవానికి గతవారం అంటే డిసెంబర్ 5నే ఈ సినిమా రిలీజ్ కావాలి. కానీ ఫైనాన్సియల్ ట్రబుల్స్ వల్ల.. వారం రోజులు ఆలస్యంగా డిసెంబర్ 12 న థియేటర్లలోకి వచ్చింది. డిసెంబర్ 11నే ప్రీమియర్ షోలు కూడా పడ్డాయి. అయితే సినిమాకి మొదటి రోజు కొంత మిక్స్డ్ టాక్ వచ్చింది.. అంతేకాదు మరికొన్ని కారణాలు ఈ సినిమా పై ఎఫెక్ట్ చూపించాయని వార్తలు వినిపించాయి. దాంతో మొదటి రోజు అనుకున్న దానికన్నా తక్కువ కలెక్షన్స్ వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఫస్ట్ డే అఖండ 2 ఎన్ని కోట్లు వసూల్ చేసిందో ఒకసారి తెలుసుకుందాం..

బాలయ్య, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి.. గతంలో వచ్చిన అఖండ సినిమాకు సీక్వెల్ గా అఖండ 2 సినిమాను తెరకెక్కించి థియేటర్లలోకి తీసుకొచ్చారు. ఈ మూవీ షూటింగ్ మొదలైనప్పటి నుంచి భారీ అంచనాలను క్రియేట్ చేసుకుంటూ వచ్చింది.. అలాగే సినిమా నుంచి బయటికి వచ్చిన ప్రతి అప్డేట్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.. దాంతో మొదటి రోజు 55 కోట్లకు పైగా వసూలు చేస్తుందని గట్టిగా నందమూరి అభిమానులు నమ్మారు.. కానీ థియేటర్లోకి వచ్చిన తర్వాత ఆ పరిస్థితి కనిపించలేదు.. ఈ సినిమా మిక్సీ్డ్ టాక్ ను అందుకోవడంతో కలెక్షన్స్ దారుణంగా పడిపోయినట్లు ఓ వార్త ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 32 కోట్లను రాబట్టినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో సమాచారం.. ఓవర్సీస్ లో 3 కోట్లు, కర్ణాటక 40 లక్షలు, తమిళనాడు 30 లక్షలు వసూళ్లను రాబట్టింది.. మొదటి రోజు ఈ మూవీ కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయని తెలుస్తుంది. 55 కోట్లు బ్రేక్ ఈవెంట్ టార్గెట్ తో థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా కేవలం 32 కోట్లు రాబట్టడంతో ఫ్యాన్స్ నిరాశ పడుతున్నారు. ఈ కలెక్షన్స్ పై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరి ఈ వీకెండు ఈ సినిమాకు ఏ మాత్రం కలిసి వస్తుందో చూడాలి..

తొలిరోజు వసూళ్లు: అంచనాలు, వాస్తవాలు

ప్రపంచవ్యాప్తంగా అఖండ 2 కలెక్షన్స్

నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసినా అఖండ 2 మూవీ నిన్న థియేటర్లోకి వచ్చేసింది. రిలీజ్ కి ముందు భారీ అంచనాలను క్రియేట్ చేసుకున్న ఈ మూవీ థియేటర్లలోకి వచ్చిన తర్వాత టాక్ మారింది.. ఒకవైపు మిక్స్డ్ టాక్ ని అందుకోవడం, ప్రీమియర్ షోలకి థియేటర్లు ఖాళీగా ఉండటం, మరోవైపు సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ లేకపోవడంతో ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ భారీగా తగ్గినట్లు తెలుస్తుంది.. ఈ కారణాలే సినిమాపై ఎఫెక్ట్ చూపించాయని సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా కూడా బాలయ్య సినిమాకు ఇలాంటి పరిస్థితి ఎదురవడం ఇదే మొదటిసారి.. సినిమా వాయిదా పడడం, అలాగే కలెక్షన్ తగ్గడం వంటివి జరిగాయి. అయితే మొదటిరోజు అనుకున్న దానికంటే కలెక్షన్లు తక్కువగా రావడంతో అభిమానులు టెన్షన్ పడుతున్నారు.. ఈ వీకెండు ఓపెనింగ్స్ బాగా జరిగే అవకాశం ఉందని ఓ వార్త సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది.. మరి ఈ సినిమా కలెక్షన్లు ఈవారం ఏ మాత్రం పెరుగుతాయో చూడాలి…

అఖండ 2 కలెక్షన్‌లు అంచనాలను అందుకోకపోవడం అభిమానులను నిరాశపరిచింది. ఈ వీకెండ్‌లో వసూళ్లు పుంజుకుంటాయో లేదో చూడాలి. చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.