|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఆ హీరోతో సినిమా…మూడు కీ-బోర్డులు పగలగొట్టిన త‌మ‌న్‌

Published: 14-11-2025, 2:13 PM
ఆ హీరోతో సినిమా...మూడు కీ-బోర్డులు పగలగొట్టిన త‌మ‌న్‌

బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ‘అఖండ 2’ సినిమా సంగీతంపై తమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండో సగభాగం కోసం తీవ్రంగా శ్రమించి రెండు, మూడు కీబోర్డులు పగలగొట్టానని వెల్లడించారు. ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదల కానుంది.

Key Points

1

'అఖండ 2' ఫస్టాఫ్ మ్యూజిక్ పూర్తయ్యింది, సెకండాఫ్‌పై పని చేస్తున్నారు.

2

రెండో సగభాగం మ్యూజిక్ కోసం తమన్ మూడు కీబోర్డులు పగలగొట్టారు.

4

తమన్ ప్రకారం, 'అఖండ 2' ₹250 కోట్లు వసూలు చేయగలదు.

తమన్ ‘అఖండ 2’ మ్యూజిక్ విశేషాలు

నంద‌మూరి బాల‌య్య హీరోగా చేసిన తాజా సినిమా ‘అఖండ 2’. బోయపాటి శ్రీను.. ఈ సినిమాను చాలా గ్రాండ్ తీశారు. దాదాపుగా ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా, చిన్న చిన్న వ‌ర్క్స్ మాత్ర‌మే ఉన్నాయి. డిసెంబ‌ర్ 5న అఖండ 2 విడుద‌ల కానుండ‌గా, తాజాగా అఖండ‌ తాండ‌వం సాంగ్ లాంచ్ చేశారు. ముంబైలో జ‌రిగిన ఈ ఈవెంట్ లో ఎస్‌.ఎస్ త‌మ‌న్ కూడా పాల్గొని మాట్లాడారు.

‘అఖండ2’ ఫస్టాఫ్ మ్యూజిక్ కంప్లీట్ అయ్యిందని, సెకండాఫ్ పైన వర్క్ చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ ఇంకా గొప్పగా ఉంటుందన్నారు. సెకండాఫ్ కు ఏం చేయాలో నాకు అర్థం కాక రెండు, మూడు కీ బోర్డులు పగలగొట్టాన‌ని వెల్ల‌డించారు త‌మ‌న్‌. ‘అఖండ2’ 250 కోట్లు కలెక్ట్ చేయబోతుందని త‌మ‌న్ పేర్కొన్నారు. బాలయ్య సినిమాలు నాకు కేస్ స్టడీతో సమానం అన్నారు. నా ఫాన్స్ కు ఈ సినిమాలో ఏం ఇస్తున్నావ్ ? అని బాలయ్య నన్ను ఎప్పుడూ అడుగుతుంటారని గుర్తు చేశారు.

కీబోర్డులు పగలగొట్టిన తమన్ ఉద్వేగం

‘అఖండ 2’ విడుదల, వసూళ్ల అంచనాలు

తమన్ సంగీత కంపోజింగ్ లో చూపించిన అంకితభావం, ‘అఖండ 2’పై ఆయనకున్న నమ్మకం సినిమా విజయాన్ని సూచిస్తున్నాయి. బాలయ్య సినిమాలు తనకు కేస్ స్టడీ అన్న తమన్ వ్యాఖ్యలు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.