
📌 Key Points
- నందమూరి బాలకృష్ణ ‘అఖండ 2’ సినిమా డిసెంబర్ 5న విడుదల కావాల్సింది.
- ఆర్థిక కారణాల వల్ల సినిమా విడుదల వాయిదా పడింది.
- ప్రస్తుతం డిసెంబర్ 12న ‘అఖండ 2’ విడుదలయ్యే అవకాశం ఉంది.
- ‘మోగ్లీ 2025’, ‘ఈషా’ సినిమాలు వాయిదా పడే పరిస్థితి నెలకొంది.
నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ 2’ సినిమా ఆర్థిక కారణాల వల్ల డిసెంబర్ 5న విడుదల కాలేదు. ఇప్పుడు డిసెంబర్ 12న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ నిర్ణయం ‘మోగ్లీ 2025’, ‘ఈషా’ వంటి ఇతర చిన్న సినిమాల విడుదల తేదీలపై తీవ్ర ప్రభావం చూపుతుందని టాలీవుడ్ లో చర్చ జరుగుతోంది.
అఖండ 2 విడుదల వాయిదా కారణాలు
నందమూరి బాలయ్య తాజాగా నటించిన సినిమా అఖండ 2. ఈ సినిమా మొన్న డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కొన్ని ఫైనాన్షియల్ కారణాల వల్ల సినిమా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ కు మార్గం సుగమం అయిందని చెబుతున్నారు. ఫైనాన్షియల్ సమస్యలు మొత్తం తీరిపోయాయట. దీంతో డిసెంబర్ 12వ తేదీన అంటే మరో మూడు రోజుల్లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నద్ధం అవుతోందట.
డిసెంబర్ 12న అఖండ 2 విడుదల
అయితే నందమూరి బాలయ్య నటించిన అఖండ 2 సినిమా డిసెంబర్ 12వ తేదీన రిలీజ్ అయితే, మరో రెండు చిన్న సినిమాలు వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి నెలపొందని టాలీవుడ్ సర్కిల్స్ లో వార్తలు వైరల్ అవుతున్నాయి. అఖండ 2 డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ అవుతుందని ముందే ప్రకటించడంతో ‘మోగ్లీ 2025’ అలాగే ఈషా సినిమాలు డిసెంబర్ 12వ తేదీన రిలీజ్ చేసేందుకు ముందుగా ప్లాన్ చేసుకున్నాయి.
ఇతర సినిమాలపై అఖండ 2 ప్రభావం
ఈ మేరకు ప్రమోషన్సు కూడా చేసుకుంటున్నాయి. అంతా బాగానే ఉందని అనుకునే సమయంలో అఖండ 2 సినిమా మోగ్లీ 2025, ఈషా సినిమాలకు విలన్ గా మారాయి. డిసెంబర్ 12నే అఖండ 2 రిలీజ్ కానుందని వార్తలు రావడంతో ఈ రెండు సినిమాల నిర్మాతలు వణికిపోతున్నారు. నిజంగా అఖండ 2 రిలీజ్ అయితే, కొత్త డేట్స్ ప్రకటించాలని అనుకుంటున్నారట.
మొత్తం మీద ‘అఖండ 2’ విడుదల తేదీ మార్పు టాలీవుడ్‌లో కొత్త చర్చకు దారితీసింది. డిసెంబర్ 12న ఈ భారీ సినిమా విడుదల అయితే, ‘మోగ్లీ 2025’, ‘ఈషా’ చిత్రాల భవితవ్యం ఎలా ఉంటుందో చూడాలి. నిర్మాతలకు కొత్త రిలీజ్ డేట్లు ప్రకటించక తప్పదు.


