
📌 Key Points
- అఖండ 2 అంచనాలను అందుకోలేకపోయినా అభిమానులను కొంత సంతృప్తిపరిచింది.
- సినిమా ప్రమోషన్ కోసం అమరావతిలో గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
- ఈ ఈవెంట్‌కు బాలకృష్ణ రాజకీయ నేపథ్యాన్ని ఇప్పుడు వాడుతారా అనే చర్చ జరుగుతోంది.
- పవన్ కళ్యాణ్ సనాతన ధర్మంపై మాట్లాడినా, ఈ సినిమాను ప్రస్తావించకపోవడం గమనార్హం.
బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబోలో వచ్చిన అఖండ 2 అంచనాలను పూర్తిగా అందుకోలేకపోయింది. ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్ కోసం అమరావతిలో గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్‌కు బాలయ్య రాజకీయ నేపథ్యాన్ని వాడుతారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతంలో తన పలుకుబడిని ఎందుకు వాడుకోలేదన్న చర్చ జరుగుతోంది.
అఖండ 2: అంచనాలు-వాస్తవాలు
Akhanda 2 Thaandavaam : బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన సినిమా అఖండ 2. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ అందుకోలేకపోయింది. కానీ కొంతమేరకు అభిమానులను సంతృప్తిపరిచింది. అయితే ఈ సినిమా విషయంలో హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడమే చాలావరకు ప్రాబ్లం అయింది. మొత్తానికి బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తే ఏ ఏ అంశాలు అభిమానులు కోరుకుంటారో వాటన్నిటినీ కూడా కొంతమందికి ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు బోయపాటి.
ఈరోజుల్లో ఒక సినిమా సక్సెస్ అయింది అంటే ఆ సక్సెస్ ఈవెంట్ అనేది ఆరోజు సాయంత్రానికే జరపడం అనేది ఆనవాయితీగా మారిపోయింది. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన సక్సెస్ ఈవెంట్ ను అమరావతిలో ఎల్లుండి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం వినిపిస్తుంది దీని గురించి అధికారిక ప్రకటన కూడా త్వరలో వస్తుంది. బహుశా దీనిని రేపే అనౌన్స్ చేసే అవకాశం ఉంది.
అయితే రీసెంట్ టైమ్స్ లో ఒక సినిమాకి సంబంధించి కలెక్షన్లు తగ్గుతున్నాయి ఆదరణ తగ్గిపోతుంది అనుకునే టైంలో ఈవెంట్ చేసి ఆ సినిమాను మళ్ళీ ప్రమోట్ చేయడం అనేది ఆనవాయితీగా మారుతుంది. ఇక అఖండ సినిమాకు సంబంధించి బయట ఎక్కడ పెద్దగా ఒక రేంజ్ లో వినిపించడం లేదు.
అమరావతిలో ఈవెంట్: రాజకీయ కోణం?
అందుకోసమే ఈ సినిమా ఒకసారి గ్రాండ్ ఈవెంట్ చేస్తే ఇక ప్రమోషన్ కూడా పనికొస్తుంది అని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే అమరావతిలో పెట్టడానికి కారణం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో బాలయ్య బాబుకి ఉన్న పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ నెక్స్ట్ లెవెల్.
అయితే బాలకృష్ణ లాంటి పెద్ద హీరో సినిమా అనేది చివరి నిమిషంలో రిలీజ్ కాకుండా ఆగిపోవడం అనేది ఊహించని పరిణామం. అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తనకు ఒక పలుకుబడి ఉండి కూడా ఏమీ చేయలేకపోయారు అనే కొన్ని వార్తలు కూడా వినిపిస్తూ వచ్చాయి. చాలామంది పెద్ద ఎత్తున కామెంట్స్ చేశారు. అయితే అప్పుడు వాడని పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ను ఇప్పుడు ఈవెంట్ చేసి అమరావతిలో వాడుతారా అనే కామెంట్స్ ఎప్పుడు వినిపిస్తున్నాయి.
పవన్ కళ్యాణ్, సనాతన ధర్మం ప్రస్తావన
ఇకపోతే రీసెంట్ టైమ్స్ లో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి ఎంతలా మాట్లాడారు అనేది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మరోవైపు ఈ సినిమా కూడా మెయిన్ పాయింట్ సనాతన ధర్మము గురించి చెప్పడమే. అయితే పవన్ కళ్యాణ్ ఈ సినిమా గురించి ఒక ట్వీట్ వేయటం కానీ అలానే ఎక్కడ మాట్లాడటం కానీ జరగలేదు. బహుశా పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఫ్రెండ్షిప్ వలన ఈ సినిమాకి హాజరై సనాతన ధర్మం గురించి అక్కడ మాట్లాడుతారేమో చూడాలి.
అఖండ 2 అమరావతి ఈవెంట్ ద్వారా సినిమాకు తిరిగి బూస్ట్ ఇవ్వాలని మేకర్స్ చూస్తున్నారు. బాలయ్య రాజకీయ ప్రభావం ఈసారి ఎంతవరకు పనిచేస్తుంది, పవన్ కళ్యాణ్ మౌనం వెనుక కారణాలు వంటి అంశాలు ఆసక్తికరంగా మారాయి. అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.


