
📌 Key Points
- బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన అఖండ 2 చిత్రం.
- డిసెంబర్ 12న విడుదలైన ఈ చిత్రం తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
- ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు 59.5 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.
- సినీ విశ్లేషకుల ప్రకారం, ఒకటి, రెండు రోజుల్లో 100 కోట్లు దాటే అవకాశం ఉంది.
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన ‘అఖండ 2’ చిత్రం డిసెంబర్ 12న విడుదలైంది. తొలి ఆట నుంచే అద్భుతమైన స్పందన పొందుతున్న ఈ చిత్రం, మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా 59.5 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. వచ్చే రెండు రోజుల్లో 100 కోట్లు దాటే అవకాశం ఉంది.
అఖండ 2 – చిత్ర విశేషాలు
Akhanda 2 Collections : నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన మూవీ అఖండ 2- తాండవం. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. ఈ చిత్రంలో సంయుక్త కథానాయిక. ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా లు కీలక పాత్రలను పోషించగా.. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించారు. బాలయ్య రెండో కూతురు తేజస్విని ఈ చిత్రాన్ని సమర్పించారు.
అఖండ చిత్రానికి సీక్వెల్ కావడంతో భారీ అంచనాల మధ్య ఈ చిత్రం డిసెంబర్ 12 (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి ఆట నుంచే పాజిటివ్ తెచ్చుకుంది. ఇక బాలయ్య నట విశ్వరూపం, శివతాండవాన్ని తలపించే హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు ఫ్యాన్స్‌కు పండగ వాతావరణాన్ని తీసుకొచ్చాయి.
తొలిరోజు ప్రపంచవ్యాప్త వసూళ్లు
ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు ఈ చిత్రం 59.5 కోట్ల గ్రాస్ వసూళ్లను (Akhanda 2 Collections)సాధించింది. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా ఓ కొత్త పోస్టర్ ద్వారా తెలియజేసింది. ఇక ఈ రోజు శనివారం, రేపు ఆదివారం కావడంతో ఈ చిత్ర వసూళ్లు భారీగా పెరిగే అవకాశం ఉంది.
Mana Shankara Vara Prasad Garu : మెగా, వెంకీ స్టెప్పులతో పూనకాలే.!
బాక్సాఫీస్ వద్ద అంచనాలు
ఈ నేపథ్యంలో ఒకటి లేదా రెండు రోజుల్లో ఈ చిత్ర వసూళ్లు 100 కోట్లను దాటే అవకాశం ఉన్నట్లు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
‘అఖండ 2’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయపథంలో దూసుకుపోతోంది. బాలయ్య విశ్వరూపం, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ వసూళ్ల పరంపర కొనసాగితే, చిత్రం మరింత రికార్డులు సృష్టిస్తుంది అనడంలో సందేహం లేదు.


