|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అఖండ -2 రిలీజ్ ఎప్పుడు? ప్రొడ్యూసర్ ను పొట్టు పొట్టు తిడుతున్న ఫ్యాన్స్

Updated: 04-12-2025, 10:50 PM
అఖండ -2 రిలీజ్ ఎప్పుడు? ప్రొడ్యూసర్ ను పొట్టు పొట్టు తిడుతున్న ఫ్యాన్స్
  • అఖండ-2 విడుదల అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది.
  • ఈరోస్ సంస్థతో ఆర్థిక వివాదాలే పోస్ట్‌పోన్‌కు కారణమని ఫ్యాన్స్ ఆగ్రహం.
  • బాలయ్య సినిమా పండుగలా భావించే ఫ్యాన్స్ మనోభావాలు దెబ్బతిన్నాయని వాపోతున్నారు.
  • సంక్రాంతి 2026 లేదా డిసెంబర్ 18న విడుదలపై ఊహాగానాలు.

అఖండ-2 విడుదల వాయిదా పడటంతో బాలయ్య ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ సంస్థ ఆర్థిక వివాదాల కారణంగా రిలీజ్‌ను నిలిపివేయడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. కొత్త విడుదల తేదీపై ఇంకా స్పష్టత లేదు.

అఖండ-2 వాయిదా: ఫ్యాన్స్ ఆగ్రహం

తెల్లవారితే అఖండ-2 సినిమా విడుదల కావాల్సి ఉండగా.. అనివార్య కారణాల వల్ల రిలీజ్ ను పోస్ట్ పోన్ చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ గురువారం అర్థరాత్రి ప్రకటించింది. దీనిపై బాలయ్య ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. ఈరోస్ నిర్మాణ సంస్థతో నెలకొన్న ఆర్థిక లావాదేవీల వివాదాల కారణంగా అఖండ-2 రిలీజ్ ఆగిపోయిందని తెలుసుకున్న ఫ్యాన్స్ ఇవన్నీ ముందే క్లియర్ చేసుకోవడం తెలీదా అంటూ నిర్మాణ సంస్థను పొట్టు పొట్టు తిడుతున్నారు. ఫ్యాన్స్ కు బాలయ్య సినిమా విడుదల అంటే ఒక పండుగ అని, తమ మనోభావాలతో ఆడుకున్నారని వాపోతున్నారు. పైగా విడుదల తేదీ త్వరలోనే చెప్తామని ప్రకటించడంతో ఇంకెప్పుడు సినిమా రిలీజ్ చేస్తారని ఫైరవుతున్నారు.

కాగా.. అఖండ-2 విడుదల వాయిదా పడటంతో సంక్రాంతి 2026కే రిలీజ్ చేస్తారని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ.. సంక్రాంతి బరిలో ఇప్పటికే నాలుగు సినిమాలు థియేటర్లు ఫిక్స్ చేసుకున్నాయి. మన శంకరవరప్రసాద్ గారు, ది రాజా సాబ్, భర్త మహాశయులకు విజ్ఞప్తి, నారీ నారీ నడుమ మురారి సినిమాలతో పాటు జయ నాయగన్, పరాశక్తి సినిమాలు విడుదల కానున్నాయి. దీంతో డిసెంబర్ 18న సినిమా విడుదల కాబోతుందని ఒక న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ఆర్థిక వివాదాలే కారణమా?

కొత్త విడుదల తేదీపై ఊహాగానాలు

అఖండ-2 విడుదల వాయిదా అభిమానులను నిరాశపరిచింది. ఆర్థిక వివాదాలు సద్దుమణిగి, నిర్మాతలు త్వరగా కొత్త విడుదల తేదీని ప్రకటించి అభిమానుల ఆశలను నిలబెడతారని ఆశిద్దాం. అప్పటివరకు సస్పెన్స్ తప్పదు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.