📌 Key Points
- అక్షయ్ ఖన్నా ‘దురంధర్’ సినిమాతో బాలీవుడ్‌లో రీఎంట్రీ ఇచ్చి విజయం సాధించారు.
- ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మహాకాళి’ సినిమాలో అక్షయ్ ఖన్నా కీలక పాత్రలో నటిస్తున్నారు.
- మహాకాళి చిత్రంలో అక్షయ్ ఖన్నా శుక్రాచార్యుడి పాత్రలో కనిపించనున్నారు.
- ప్రశాంత్ వర్మ అక్షయ్ ఖన్నా పుట్టినరోజు సందర్భంగా ఆయన పాత్రకు సంబంధించిన ఫోటోను విడుదల చేశారు.
బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా, ‘దురంధర్’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చి విజయం సాధించారు. ఇప్పుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ‘మహాకాళి’ సినిమాలో శుక్రాచార్యుడి పాత్రలో కనిపించనున్నారు. ఈ మేరకు ఆయన ఫస్ట్ లుక్ విడుదలైంది.
‘దురంధర్’తో అక్షయ్ ఖన్నా రీఎంట్రీ సక్సెస్
Akshay Khanna: ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా (Akshay Khanna)గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. విలక్షణమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ తనదైన రీతిలో అందరి దృష్టిని ఆకట్టుకుంటున్న అక్షయ్ ఖన్నా ఇటీవల ఆదిత్యధర్ (Adityadhar) దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ మూవీ ధురంధర్ సినిమాలో విలన్ పాత్ర పోషించి గట్టి కం బ్యాక్ ఇచ్చారు. రీ ఎంట్రీలో అదిరిపోయిన సక్సెస్ ఆయన ఖాతాలో చేరింది. ఈ ఒక్క సినిమా ఇచ్చిన విజయంతో ఈయన ఇప్పుడు వరుస పెట్టి అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నారు.
ఇకపోతే నిన్న మొన్నటి వరకు బాలీవుడ్ చిత్రాలతో కూడా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న అక్షయ్ ఖన్నా ఇప్పుడు నేరుగా తెలుగు చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నారు. అసలు విషయంలోకి వెళ్తే హనుమాన్ సినిమాతో ఓవర్ నైట్ లోనే పాన్ ఇండియా డైరెక్టర్గా పేరు దక్కించుకున్న కుర్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న మహాకాళి సినిమాలో అక్షయ్ ఖన్నా కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రశాంత్ వర్మ అధికారికంగా ప్రకటించారు. అసలు విషయంలోకి వెళ్తే.. మార్చి 28వ తేదీన అక్షయ్ ఖన్నా పుట్టినరోజు కావడంతో ఆయనకు సంబంధించి మహాకాళి చిత్రంలోని అక్షయ్ ఖన్నా పాత్ర గురించి ఒక అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు ప్రశాంత్ వర్మ. అక్షయ్ కుమార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ.. తన సోషల్ మీడియా వేదికగా అక్షయ్ ఖన్నా పాత్రకు సంబంధించిన ఫోటోని కూడా షేర్ చేశారు.
‘మహాకాళి’లో కీలక పాత్రలో అక్షయ్ ఖన్నా
ఈ మేరకు” మహాకాళి చిత్రంలో అక్షయ్ ఖన్నా శుక్రాచార్యుడి పాత్రలో కనిపిస్తారు. నిజమైన ప్రతిభకు హంగు ఆర్భాటాలు అవసరం లేదు అని నిరూపించే నటుడు అక్షయ్ ఖన్నా మాత్రమే.. మీతో కలిసి పని చేయడం నాకు దక్కిన గౌరవంగా నేను భావిస్తున్నాను. మన కాంబినేషన్లో వస్తున్న ఈ అద్భుతమైన చిత్రాన్ని నేను ప్రపంచానికి చూపించడానికి చాలా ఆసక్తిగా ఉన్నాను” అంటూ ప్రశాంత్ వర్మ కామెంట్లు చేశారు. ఇక ప్రస్తుతం ప్రశాంత్ వర్మ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొత్తానికైతే ధురంధర్ సినిమాతో బాలీవుడ్లో రీ ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న అక్షయ్ ఖన్నా ఇప్పుడు మహాకాళి సినిమాతో తెలుగు ప్రేక్షకులను నేరుగా పలకరించి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోబోతున్నారు. మొత్తానికైతే ఆయన ప్లాన్ అదుర్స్ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరి మహాకాళి సినిమాతో అక్షయ్ ఖన్నా ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి.
శుక్రాచార్యుడిగా అక్షయ్ ఖన్నా లుక్ విడుదల
Tags Akshaye Khanna Mahakali film Share
మొత్తానికి, ‘దురంధర్’ సినిమాతో బాలీవుడ్‌లో రీఎంట్రీ ఇచ్చిన అక్షయ్ ఖన్నా, ఇప్పుడు ‘మహాకాళి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన కెరీర్ ఇకపై మరింత ఉజ్వలంగా ఉండాలని ఆశిద్దాం.


