
📌 Key Points
- తారకరత్న మరణం తర్వాత అలేఖ్య రెడ్డి సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టులు చేశారు.
- యువగళం పాదయాత్రలో తారకరత్న అస్వస్థతకు గురై 23 రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందారు.
- జనవరి 27 తన జీవితాన్ని మార్చిందని అలేఖ్య ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.
- తారకరత్నను బెంగళూరులోని నారాయణ హృదయాలయకు తరలించి చికిత్స అందించారు.
నందమూరి తారకరత్న మరణం తర్వాత ఆయన భార్య అలేఖ్య రెడ్డి తరచూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టులు చేస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో జనవరి 27న యువగళం పాదయాత్రలో ఏం జరిగిందో అలేఖ్య వెల్లడించారు.
తారకరత్న మరణం: అలేఖ్య ఎమోషనల్ పోస్ట్స్
Alekhya Tarakaratna: నందమూరి వారసుడు తారకరత్న అతి చిన్న వయసులోనే గుండెపోటు మరణించిన సంగతి తెలిసిందే. ఈయన మరణాన్ని ఇప్పటికీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి తరచూ తన భర్తని తలుచుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్టులు చేస్తున్నారు. ఇక తారకరత్న యువగళం పాదయాత్ర(Yuvagalam Padayatra)లో పాల్గొని అస్వస్థతకు గురి అయ్యి దాదాపు 23 రోజులపాటు బెంగళూరులోని నారాయణ హృదయాలయాలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఘటన జనవరి 27,2023వ తేదీ జరగగా తారకరత్న ఫిబ్రవరి18, 2023 న మరణించారు.
ఇలా ఈయన మరణించి దాదాపు మూడు సంవత్సరాలు అవుతున్న ఇప్పటికే అలేఖ్య ఈ బాధ నుంచి బయటపడలేకపోతున్నారు అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అలేఖ్య యువగళం పాదయాత్రలో ఏం జరిగిందనే విషయాన్ని బయటపెట్టారు. జనవరి 27వ తేదీ నా జీవితాన్ని మార్చేసిన రోజు. ఆరోజు శుక్రవారం.. తారక్ కు శుక్ర శనివారం పిల్లలతో సినిమా చూసే అలవాటు ఉంది . ఆరోజు ఉదయం 8 గంటల సమయంలో నాకు ఫోన్ చేసి నేను ఈరోజు సాయంత్రానికి వచ్చేస్తానని చెప్పారు. ఇక నేను మా చెల్లెలు దగ్గర ఉన్నాను ఆ టైంలో అమ్మ నుంచి ఫోన్ వచ్చింది. వెంటనే తారక్ కు ఫోన్ చెయ్యి అని చెప్పగా నేను ఫోన్ చేసేటప్పటికి వదిన అన్నయ్య కాస్త డిహైడ్రేషన్ కి గురి అయ్యారు ఏం కాలేదని చెప్పి ఫోన్ పెట్టేశారు . వెంటనే అమ్మ మళ్ళీ కాల్ చేసి ఇప్పుడే నువ్వు బాల బాబాయ్ కి ఫోన్ చేయమని చెప్పారు. బాల బాబాయ్ కి ఫోన్ చేస్తే ఆయన కూడా అదే చెప్పారు. హాస్పిటల్ కి తీసుకెళ్తున్నాము డీహైడ్రేషన్ అయిందని చెప్పారు.
యువగళం పాదయాత్రలో తారకరత్నకు ఏమైంది?
మరి కొంత సమయానికి విజయసాయి రెడ్డి గారు ఫోన్ చేసి వెంటనే నిషికను తీసుకొని కుప్పం బయలుదేరని చెప్పారు .ఎందుకు ఏంటి అని నేను అడగలేదు. నిషిక దగ్గరకు వెళ్తుంటే బాబు గారు (చంద్రబాబు) ఫోన్ చేశారు . బాబు గారి నుంచి ఫోన్ రాగానే అంత సవ్యంగా లేదు అని అర్థమైంది. ఇక పాప స్కూల్లోకి వెళ్ళగానే నాకు న్యూస్ తెలిసి అక్కడే కుప్పకూలిపోయాను. వెంటనే కుప్పం బయలుదేరి వెళ్ళాము అక్కడ తారక్ ను అలా చూసేసరికి జీర్ణించుకోలేకపోయానని అలేఖ్య తెలిపారు. అక్కడే ఉండి ట్రీట్మెంట్ ఇవ్వడం కంటే తనని ఇంకా బెస్ట్ హాస్పిటల్ కు తీసుకెళ్లడం మంచిదని మా బ్రదర్ బెంగళూరు నారాయణ హృదయాలకు షిఫ్ట్ చేశారు.
నాకోసమే అన్ని రోజులు బ్రతికాడేమో ..
జనవరి 27: అలేఖ్య జీవితాన్ని మార్చిన రోజు
అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది దాదాపు 23 రోజులపాటు తారక్ మూమెంట్స్, ట్రీట్మెంట్ కు రెస్పాండ్ అవుతున్నారు. అయితే ఆయనను ఇంటికి పంపించాలి అంటే ఎంఆర్ఐ స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఆ రిపోర్ట్స్ ఆధారంగా ఇంటికి పంపిస్తామని చెప్పారు. ఎంఆర్ఐ స్కాన్ తీసుకెళ్లాలనుకున్న ప్రతిసారి అతను కోపరేట్ చేయలేదు. పల్స్ పడిపోవడం, ఆక్సిజన్ తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడేవారు. చివరికి ఎంఆర్ఐ చేసిన తర్వాత డాక్టర్స్ తనకు చెప్పిన మాట సారీ.. ఓబు కోసం నేను ఆసమయంలో కూడా ఎంతోమంది దేవుళ్లను ప్రార్థించాను కానీ ఫలితం దక్కలేదు. డాక్టర్స్ ఆ మాట చెప్పగానే నేను అతనిపై పడి తన గుండె చప్పుడును చివరిగా విన్నాను అంటూ తారకరత్న మరణం గురించి మాట్లాడుతూ అలేఖ్య ఎమోషనల్ అయ్యారు. వెంటనే చనిపోతే నేను ఏమవుతాననో ఓబు కూడా ఈ విషయాన్ని తాను స్వీకరించడానికి అన్ని రోజులు సమయం తీసుకున్నారేమో అనిపిస్తుంది అంటూ అలేఖ్య కన్నీళ్లు పెట్టుకున్నారు.
తారకరత్న మరణం తెలుగు ప్రజలకు తీరని లోటు. అలేఖ్య రెడ్డి తన భర్త జ్ఞాపకాలను పంచుకుంటూ ఎమోషనల్ అవుతున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం.


