
అల్లరి నరేష్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ ’12ఎ రైల్వే కాలనీ’ ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ ఓ అంతుచిక్కని మర్డర్ మిస్టరీని పరిచయం చేస్తూ ఉత్కంఠగా సాగింది. భిన్నమైన పాత్రలో నరేష్ ఆకట్టుకుంటుండగా, ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.
Key Points
అల్లరి నరేష్ నటించిన '12ఎ రైల్వే కాలనీ' క్రైమ్ థ్రిల్లర్ ట్రైలర్ విడుదలైంది.
ఈ ట్రైలర్ ఓ అంతుచిక్కని మర్డర్ మిస్టరీని పరిచయం చేసింది.
ఊహకందని కేసును పరిష్కరించే భిన్నమైన పాత్రలో నరేష్ కనిపిస్తాడు.
సాయికుమార్ పాత్రతో పాటు నరేష్ కొత్త గెటప్ ఆసక్తి రేపుతున్నాయి.
అల్లరి నరేష్ కొత్త క్రైమ్ థ్రిల్లర్ అవతార్
అల్లరి నరేష్ మరోసారి క్రైమ్ థ్రిల్లర్ మూవీలో నటిస్తున్నాడు. అతని నెక్ట్స్ మూవీ 12ఎ రైల్వే కాలనీ ట్రైలర్ మంగళవారం (నవంబర్ 11) రిలీజైంది. ఈ ట్రైలర్ చాలా ఉత్కంఠగా సాగింది. ఓ అంతు చిక్కని మర్డర్ మిస్టరీని పరిష్కరించే పాత్రలో అతడు నటించాడు.
ఎన్నో ఏళ్లపాటు కామెడీ పాత్రలకే పరిమితమైన అల్లరి నరేష్.. ఇప్పుడు రూటు మార్చాడు. అప్పుడప్పుడూ భిన్నమైన కథలతో వస్తున్నాడు. అలా మరోసారి 12ఎ రైల్వే కాలనీ మూవీతో రానున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది. ఓ మర్డర్ మిస్టరీగా ఈ ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.
12ఎ రైల్వే కాలనీ ట్రైలర్ హైలైట్స్
నువ్వు చెప్పేది ఏదీ నమ్మశక్యంగా లేదంటూ సాయికుమార్ పాత్ర ఎంటరవుతుంది. అసలు అంతు చిక్కని ఈ మర్డర్ కేసును మీరు ఎలా పరిష్కరించారు అని మరో పాత్ర సాయికుమార్ పాత్రను అడుగుతుంది. దానిని తాను సాల్వ్ చేయలేదని అతడు అంటాడు. అప్పుడు అల్లరి నరేష్ మరో పూర్తి భిన్నమైన గెటప్ లో ఎంట్రీ ఇస్తాడు. ఆ తర్వాత ట్రైలర్ మొత్తం ఆ మర్డర్ మిస్టరీ చుట్టే తిరుగుతుంది. అసలు ఆ హత్యకు గురైంది ఎవరు? దీనికి, సినిమాలో లీడ్ రోల్స్ కి సంబంధం ఏంటి? దీనిని ఎలా పరిష్కరిస్తాన్నది 12ఎ రైల్వే కాలనీలో చూడొచ్చు.
12ఎ రైల్వే కాలనీ మూవీ గురించి..
సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయి?
ఈ సినిమా తర్వాత ఆల్కహాల్, సభకు నమస్కారం అనే మరో రెండు సినిమాలు కూడా అతడు చేస్తున్నాడు. అయితే ఈ 12ఎ రైల్వే కాలనీ మూవీ థ్రిల్లింగ్ ట్రైలర్ తో అంచనాలను పెంచేస్తోంది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంత వరకూ సక్సెస్ అవుతుందో చూడాలి.
మొత్తం మీద, ’12ఎ రైల్వే కాలనీ’ ట్రైలర్ అల్లరి నరేష్ నటనతో, సస్పెన్స్‌తో సినిమాపై ఆసక్తిని రేపింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద ఎంతవరకు విజయం సాధిస్తుందో చూడాలి.


