|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అల్లు అర్జున్ సీఎం కుర్చీపై కన్ను? విజయ్ తర్వాత బన్నీ వంతు!

Published: 04-05-2026, 5:45 PM
అల్లు అర్జున్ సీఎం కుర్చీపై కన్ను? విజయ్ తర్వాత బన్నీ వంతు!
  • అల్లు అర్జున్ తమిళ నటుడు విజయ్ లా రాజకీయాల్లోకి రావాలని చూస్తున్నాడు.
  • పుష్ప తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా మారిన బన్నీ రాజకీయ ఆశలు పెంచుకున్నాడు.
  • గత AP ఎన్నికల్లో వైసీపీకి మద్దతు ఇవ్వడం మెగా ఫ్యామిలీతో దూరం పెంచింది.
  • సీఎం కావాలనే లక్ష్యంతో అల్లు ఆర్మీని బలోపేతం చేస్తూ సీక్రెట్ మీటింగ్‌లు నిర్వహిస్తున్నాడు.

సినిమా స్టార్స్ రాజకీయాల్లోకి రావడం కొత్తేమీ కాదు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా తమిళ నటుడు విజయ్ బాటలో నడుస్తూ, రాజకీయ ప్రవేశం చేయాలని చూస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఏపీ సీఎం కుర్చీపై బన్నీ కన్ను వేశాడని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

విజయ్ బాటలో బన్నీ రాజకీయ ప్రవేశం

Allu Politics : సినిమా స్టార్స్ రాజకీయాలని ఏలడం కొత్తేమీ కాదు.లేటెస్ట్ గా కోలీవుడ్ దళపతి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్.అయితే ఇప్పుడు బన్నీ కూడా విజయ్ బాటలోనే నడిచే అవకాశం ఉందా ..మరికొద్ది రోజుల్లో ఇలాంటి పొలిటికల్ సెన్సేషన్ apలోనూ రిపీట్ కాబోతోందా? పుష్పరాజ్ అంటూ బాక్సాఫీస్ ని బద్దలు కొట్టేస్తున్న అల్లు అర్జున్ ఫ్యూచర్ లో ఏపీ సీఎం అయ్యేందుకు అడుగులు వేస్తున్నాడా అంటే ‘ఔననే’ సమాధానం వినిపిస్తోంది.

విజయ్ కి తమిళ నాట ఎంత క్రేజ్ ఉందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఆ క్రేజ్ పీక్స్ లో ఉన్నప్పుడే పాలిటిక్స్ లోకి ఇచ్చాడు ఇప్పుడు అల్లు అర్జున్ కూడా సరిగ్గా అదే బాటలో ఉన్నట్టు కనిపిస్తుంది. కేవలం తెలుగుకే పరిమితం కాకుండా, ‘పుష్ప’తో పాన్ ఇండియా లెవల్లో మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్న బన్నీ.. ఇప్పుడు కోలీవుడ్ టాప్ డైరెక్టర్లు అట్లీ, లోకేష్ కనగరాజ్ వంటి వారితో సినిమాలు చేస్తూ సౌత్ ఇండియా అంతటా తిరుగులేని క్రేజ్ ని సొంతం చేసుకునే పనిలో పడ్డాడు.

మెగా కాంపౌండ్ నుండి దూరం: కారణాలు

మెగా కాంపౌండ్ నుంచి బయటికి..

ఒకప్పుడు బన్నీ అంటే మెగా కాంపౌండ్ లో ఒక హీరో మాత్రమే.కాని ఇపుడు రేంజ్ మారింది.రీసెంట్ గా వచ్చిన పుష్ప సిరీస్ తో తనకంటూ సెపరేట్ ఐడెంటిటీ క్రియేట్ అయింది.అయితే గత కొద్దికాలంగా మెగా మరియు అల్లు ఫ్యామిలీల మధ్య దూరం పెరిగిందనే వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా ap ఎలక్షన్స్ టైం లో బన్నీడైరెక్ట్ గానే ycp కి సపోర్ట్ చేయడం మెగా క్యాంప్ లో మంటలు రేపింది.మరో పక్క వాటికి తోడు రీసెంట్‌గా తన ఫ్యాన్స్ అసోసియేషన్లతో పెట్టిన సీక్రెట్ మీటింగులు చూస్తుంటే..బన్నీ కేవలం సినిమాలకే పరిమితం కావాలని అనుకోవడం లేదన్న క్లారిటీ వస్తుంది. ఇక బన్నీ గతంలో “నాకు నచ్చిన వాళ్ల కోసం ఎక్కడికైనా వెళ్తా.. ఎవరికైనా సపోర్ట్ చేస్తా” అన్నమాటలని అనాలసిస్ చేస్తే ఆ మాటల వెనుక పెద్ద స్కెచ్చే ఉందని భావిస్తున్నారు పొలిటికల్ పండిట్స్ .

ఇప్పటికే ఆంద్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీయం గా చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాడు.దీంతో బన్నీ కూడా తన స్టామినా చూపించుకోవడానికి అల్లు అర్జున్ తన ‘అల్లు ఆర్మీ’ని మరింత స్ట్రాంగ్ చేస్తున్నాడని అందులో భాగంగానే మీటింగులు ఏర్పాటు చేస్తున్నాడని ఇన్ సైడ్ టాక్.ఈ వరుస పరిణామాలు అన్నీ చూస్తుంటే రేపు పొద్దున్న విజయ్ లాగే బన్నీ కూడా ఒక సొంత పార్టీ పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు.పవన్ కళ్యాణ్ ఒక వర్గం ఓట్లను ప్రభావితం చేస్తుంటే, బన్నీ తనకున్న గ్లోబల్ ఇమేజ్ మరియు యూత్ ఫాలోయింగ్‌తో ఏపీ రాజకీయాల్లో కింగ్ మేకర్ కావాలని ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.

అల్లు ఆర్మీని బలోపేతం చేస్తున్న బన్నీ

అట్లీ ,లోకేష్ కనగరాజ్ సినిమాలతో తమిళనాడులో పాగా వేయడం ఖాయం.ఇక అల్లు అరవింద్ వంటి వ్యక్తీ వెనకుండి నడిపిస్తుంటే, బన్నీ తన క్రేజ్‌తో జనాల్లోకి వెళ్తే.. ఫ్యూచర్ లో ఆంద్రలో “సీయం అల్లు అర్జున్ ” అనే స్లోగన్ వినిపించినా ఆశ్చర్యం లేదు. చూడాలి మరి మెగా బ్రాండ్ నుంచి బయటికి వచ్చి, సొంతంగా ‘అల్లు బ్రాండ్’తో పొలిటికల్ సెన్సేషన్ క్రియేట్ చేసే దిశగా పడుతున్న బన్నీ అడుగులు ఎలాంటి సంచలననాలకి దారి తీస్తాయో !

అల్లు అర్జున్ రాజకీయ ఆశలు, విజయ్ బాటలో అతని ప్రయాణం నిజమైతే, ఏపీ రాజకీయాల్లో కొత్త సంచలనం ఖాయం. రాబోయే రోజుల్లో బన్నీ ఎలాంటి అడుగులు వేస్తాడో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.