
📌 Key Points
- అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ‘రేసుగుర్రం’ రీ రిలీజ్ ట్రైలర్ విడుదల కానుంది.
- ‘రేసుగుర్రం’ సినిమా ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.
- అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ మూవీ టైటిల్ ఏప్రిల్ 8న ప్రకటించనున్నారు.
- ప్రస్తుతం అల్లు అర్జున్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.
టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతోంది. అల్లు అర్జున్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘రేసుగుర్రం’ త్వరలో రీ రిలీజ్ కానుంది. అంతేకాకుండా, అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా టైటిల్ ను కూడా ప్రకటించనున్నారు.
రీ రిలీజ్ కి సిద్ధమైన రేసుగుర్రం
Allu Arjun: తెలుగు చిత్ర పరిశ్రమలో ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున సినిమాలు తిరిగి ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే .ఒకప్పుడు థియేటర్లలో పెద్ద ఎత్తున ప్రేక్షకులను మెప్పించిన సినిమాలు మరోసారి 4k వెర్షన్ లో తిరిగి విడుదలవుతున్న నేపథ్యంలో అభిమానులు కూడా పెద్ద ఎత్తున రీ రిలీజ్ సినిమాలకు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలన్నీ విడుదల అయ్యి కలెక్షన్లలో సంచలనాలను సృష్టించారు. తాజాగా అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ సినిమాని కూడా తిరిగి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర నిర్మాతలు సిద్ధమయ్యారని తెలుస్తోంది.
అల్లు అర్జున్ హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమాలలో రేసుగుర్రం (Race Gurram)సినిమా ఒకటి. డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్లో అల్లు అర్జున్ శృతిహాసన్ (Shruthi Hassan)జంటగా నటించిన ఈ సినిమా 2014వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. అల్లు అర్జున్ నటన శృతిహాసన్ అమాయకత్వం ఈ సినిమాను బ్లాక్ బస్టర్ గా నిలబెట్టాయి. అయితే అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి రీ రిలీజ్ ట్రైలర్ విడుదల కాబోతోందని సమాచారం. అల్లు అర్జున్ ఏప్రిల్ 8వ తేదీ తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు.
అల్లు అర్జున్ పుట్టినరోజు వేడుకలు
ఈ నేపథ్యంలోనే తన పుట్టినరోజు సందర్భంగా రేసుగుర్రం సినిమా రీ రిలీజ్ ట్రైలర్ విడుదల చేయబోతున్నారని , ఈ సినిమాని ఏప్రిల్ 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలు చిత్ర నిర్మాతలు ఉన్నట్టు తెలుస్తుంది. ఇలా ఊహించని విధంగా అల్లు అర్జున్ సినిమా నుంచి ఇలాంటి గుడ్ న్యూస్ రావడంతో బన్నీ ఫాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా రీ రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ అందుకోవాలి అంటూ అభిమానులు కూడా ఆకాంక్షిస్తున్నారు. ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అవుతూ ఎంతో బిజీగా ఉన్నారు.
అల్లు అర్జున్ అట్లీ సినిమా టైటిల్ ప్రకటన..
అట్లీతో సినిమా టైటిల్ ప్రకటన
ప్రస్తుతం ఈయన కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా దాదాపు 70% షూటింగ్ పనులను పూర్తి చేసుకున్నట్టు సమాచారం. అయితే ఇప్పటివరకు సినిమాకు సంబంధించి ఎలాంటి చిన్న అప్డేట్ కూడా బయటకు రాకుండా చిత్ర బృందం చాలా పకడ్బందీగా షూటింగ్ పనులను పూర్తి చేస్తున్నారు.. ఇక ఏప్రిల్ 8వ తేదీ అల్లు అర్జున్ పుట్టినరోజు కావడంతో ఆ రోజున సినిమాకు సంబంధించిన టైటిల్ రివిల్ చేయాలనే ఆలోచనలో చిత్ర నిర్మాతలు ఉన్నట్టు సమాచారం. ఇలా టైటిల్ తో పాటు ఒక వీడియోని కూడా విడుదల చేయబోతున్నట్టు తెలుస్తుంది.అట్లీ సినిమా తర్వాత అల్లు అర్జున్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో కూడా సినిమా చేయబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.
మొత్తానికి అల్లు అర్జున్ అభిమానులకు ఇది నిజంగా పండగలాంటి వార్త. రేసుగుర్రం రీ రిలీజ్ తో పాటు, అట్లీ సినిమా టైటిల్ ప్రకటన కూడా ఉండటంతో ఫాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.


