|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

100 కోట్ల స్కామ్ వ్యవహారంలో అల్లు అరవింద్.. ఈడీ విచారణపై ఏమన్నారంటే

Published: 04-07-2025, 1:14 PM
100 కోట్ల స్కామ్ వ్యవహారంలో అల్లు అరవింద్.. ఈడీ విచారణపై ఏమన్నారంటే

టాలీవుడ్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ 100 కోట్ల రూపాయల బ్యాంక్ ఫ్రాడ్ కేసులో ఈడీ విచారణకు హాజరయ్యారు. మూడు గంటల పాటు విచారణ జరిగింది. ఈ కేసులో ఆయన పాత్రపై వివరణ ఇచ్చారు.

Key Points

1

100 కోట్ల రూపాయల బ్యాంక్ ఫ్రాడ్ కేసులో అల్లు అరవింద్ ఈడీ విచారణకు హాజరయ్యారు.

2

మూడు గంటల పాటు ఈడీ అధికారులు అల్లు అరవింద్ ను విచారించారు.

4

అల్లు అరవింద్ మీడియాలో వస్తున్న వార్తలను ఖండించి, తనకు ఈ కేసుతో తక్కువ సంబంధం ఉందని తెలిపారు.

ఈడీ విచారణ వివరాలు

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తాజాగా వార్తల్లో నిలిచారు. దాదాపు 100 కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మూడు గంటలపాటు అల్లు అరవింద్ ని విచారించారు. హైదరాబాద్‌లోని ఈడీ జోన్ కార్యాలయంలో ఈ విచారణ జరిగింది. ఈ కేసులో రామకృష్ణ ఎలక్ట్రానిక్స్, రామకృష్ణ టెలీట్రానిక్స్ (RTPL) సంస్థలు ప్రధాన అనుమానితులుగా ఉన్నాయి.

ఈ దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు హైదరాబాద్, కర్నూలు, ఘాజియాబాద్ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ బెంగళూరులో రిజిస్టర్ చేసిన FIR ఆధారంగా ఈ కేసు నమోదైంది.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసిన ఫిర్యాదు మేరకు రామకృష్ణ ఎలక్ట్రానిక్స్, RTPL సంస్థలు బ్యాంక్‌ నుంచి పొందిన లోన్లను అక్రమంగా వాడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ సంస్థల డైరెక్టర్లు, పార్టనర్లు అయిన వి. రాఘవేంద్ర, వి. రవి కుమార్ తదితరులపై సీబీఐ కేసు నమోదు చేసింది.

అల్లు అరవింద్ స్పందన

ఈ సంస్థలు బ్యాంకుల నుంచి పొందిన రూ.101.4 కోట్ల లోన్‌ను వేరే పనుల కోసం దారి మళ్లించారని, ఇందులో మోసం, మనీలాండరింగ్ జరిగిందని భావిస్తున్న ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు.

ఈ వ్యవహారంలో అల్లు అరవింద్‌కు సంబంధాలు ఉన్నట్లు ఆధారాలు లభ్యమైన నేపథ్యంలో, ఈడీ అధికారులు ఆయనను విచారణకు హాజరయ్యేలా చేశారని తెలుస్తోంది. విచారణలో ఆయనతో ఈ వ్యవహారానికి సంబంధించిన పలు అంశాలపై సమగ్రంగా వివరాలు తీసుకున్నట్టు సమాచారం.

కేసు నేపథ్యం

అయితే ఈడీ విచారణపై అల్లు అరవింద్ స్పందించారు. మీడియాలో చూపిస్తున్నట్లు ఏదో పెద్దగా జరిగిపోలేదని అన్నారు. ఆయన మాట్లాడుతూ.. 2017లో నేను ఓ ప్రాపర్టీ కొన్నాను. అది మైనర్ వాటాదారుడికి చెందిన ప్రాపర్టీ. అతడికి బ్యాంక్ లోకి సంబంధించిన వివాదం ఏదో ఉంది. లోన్ తీసుకుని కట్టలేదని చెబుతున్నారు. దీనితో అతడిని ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు. అక్కడ అకౌంట్స్ బుక్స్ లో నా పేరు కూడా ఉంది. దీనితో అధికారులు ఎంక్వైరీ కోసం పిలిచారు.

ఈడి అధికారులు పిలిచారు కాబట్టి బాధ్యత గల పౌరుడిగా విచారణకు హాజరయ్యా. ఈడీ అధికారులకు వివరణ ఇచ్చాను. అంతకు మించి ఇక్కడ ఏమీ జరగలేదు అని అల్లు అరవింద్ అన్నారు. అయితే మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఇది అధికారులు అల్లు అరవింద్ ని మరోసారి విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

అల్లు అరవింద్ ఈడీ విచారణను తేలికగా తీసుకున్నట్లు తెలుస్తోంది. తనకు ఈ కేసుతో తక్కువ సంబంధం ఉందని ఆయన స్పష్టం చేశారు. అయితే, ఈడీ మరోసారి విచారణకు పిలవడం సాధ్యమే.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.