|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

దుబాయ్ లో అల్లు శిరీష్ బ్యాచిలర్ పార్టీ రచ్చ! పెళ్లికి ముందే ఇంత హడావిడా?

Published: 31-01-2026, 5:35 AM
దుబాయ్ లో అల్లు శిరీష్ బ్యాచిలర్ పార్టీ రచ్చ! పెళ్లికి ముందే ఇంత హడావిడా?
  • అల్లు శిరీష్, నైనిక రెడ్డిల నిశ్చితార్థం గత ఏడాది అక్టోబర్‌లో జరిగింది.
  • దుబాయ్‌లో బ్యాచిలర్ పార్టీలో అల్లు అర్జున్ దంపతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
  • నైనిక రెడ్డి బిజినెస్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి, నితిన్ భార్య శాలినికి స్నేహితురాలు.
  • వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల బ్యాచిలర్ పార్టీలో శిరీష్, నైనికల పరిచయం జరిగింది.

టాలీవుడ్ నటుడు అల్లు శిరీష్, నైనిక రెడ్డిల వివాహం మార్చి 6న జరగనుంది. ఈ సందర్భంగా దుబాయ్‌లో బ్యాచిలర్ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో అల్లు అర్జున్ దంపతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

అల్లు శిరీష్, నైనిక రెడ్డిల నిశ్చితార్థం

Allu sirish: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పెళ్లి భాజాలు మోగబోతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది కొంతమంది సెలబ్రిటీలు ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్నారు. వారంతా ఈ ఏడాది పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఇలా ఈ ఏడాది పెళ్లి చేసుకోబోయే జంటలలో అల్లు శిరీష్(Allu Shirish) కూడా ఒకరు. అల్లు శిరీష్ గతేడాది అక్టోబర్ నెలలో ప్రేమించిన అమ్మాయి నైనిక రెడ్డి(Nainika Reddy)తో ఎంతో ఘనంగా కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరుపుకున్న సంగతి తెలిసిందే. ఇక వీరి వివాహం మార్చి 6వ తేదీ ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతుందని స్వయంగా తన పెళ్లి తేదీని అల్లు శిరీష్ వెల్లడించారు. వీరి పెళ్లికి సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్పటికే పెళ్లి పనులు కూడా ప్రారంభించారని తెలుస్తోంది.

ఇకపోతే మార్చి నెలలో అల్లు శిరీష నైనిక వివాహం కావడంతో ఈ జంట దుబాయ్ (Dubai)లో ఎంతో ఘనంగా బ్యాచిలర్ పార్టీ(bachelor party)ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో భాగంగా తన ఫ్రెండ్స్ అందరితో కాబోయే కొత్తజంట చిల్ అవుతున్నారు. అయితే ఈ బ్యాచిలర్ పార్టీలో భాగంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దంపతులు కూడా పాల్గొని స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. దాదాపు రెండు సంవత్సరాల ప్రేమ తర్వాత అల్లు శిరీష్ నైనికను వివాహం చేసుకోబోతున్నారు.

నైనిక బిజినెస్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయని తెలుస్తోంది. ఈమె హీరో నితిన్ భార్య శాలినికి మంచి స్నేహితురాలు. నైనిక అల్లు శిరీష్ పరిచయం మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల బ్యాచిలర్ పార్టీలోనే జరిగిందని అల్లు శిరీష్ తన ప్రేమ గురించి గతంలో వెల్లడించారు ఈ బ్యాచిలర్ పార్టీకి శాలిని నైనికతో రావడంతో అక్కడే వీరిద్దరి పరిచయం ఏర్పడిందని ఆ పరిచయం ప్రేమగా మారడంతో వీరిద్దరూ పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారని తెలుస్తోంది.

దుబాయ్‌లో ఘనంగా బ్యాచిలర్ పార్టీ

#AlluSirish pre-wedding chaos in Dubai 🎉 pic.twitter.com/CblYfQkkIr

— The Cine Gossips (@TheCineGossips) January 30, 2026

ప్రేమ కథకు బ్యాచిలర్ పార్టీ వేదిక

ఇప్పటికే నిశ్చితార్థం జరుపుకున్న ఈ జంట మరి కొద్ది రోజులలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.. ఇక అల్లు కుటుంబంలో శిరీష్ ది చివరి వివాహం కావడంతో ఈ వివాహపు వేడుకను ఎంతో అంగరంగ వైభవంగా జరపడం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే వీరి వివాహం ఎక్కడ ఏంటి అనే విషయాల గురించి తెలియజేయనున్నారు. అల్లు శిరీష్ గౌరవం అనే సినిమా ద్వారా హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు అయితే ఈయన మాత్రం ఇండస్ట్రీలో హీరోగా పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయారని చెప్పాలి. పలు సినిమాల ద్వారా హీరోగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన సరైన సక్సెస్ అందుకోని నేపథ్యంలో శిరీష్ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. శిరీష్ చివరిగా బడ్డీ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా తర్వాత తదుపరి ఎలాంటి సినిమాలను ప్రకటించలేదు.

అల్లు శిరీష్ చివరి వివాహం కావడంతో అల్లు కుటుంబం ఈ వేడుకను ఎంతో వైభవంగా జరిపేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే పెళ్లికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.